BigTV English

Hobart Yacht Race : పడవ పోటీల్లో పిల్లి!

Hobart Yacht Race : పడవ పోటీల్లో పిల్లి!
Hobart Yacht Race

Hobart Yacht Race : ప్రపంచ సెయిలింగ్ పోటీల్లో రోలెక్స్ సిడ్నీ హోబాట్ యాచ్ రేస్ అత్యంత ప్రధానమైనది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి 1163 కిలోమీటర్ల(628 నాటికల్ మైళ్లు) దూరంలోని టాస్మేనియా రాజధాని హోబాట్ వరకు ఈ పడవ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా సాగుతాయి.
బాక్సింగ్ డే రోజైన మంగళవారం ఆరంభం కానున్న పోటీలు ఈ సారి వెరీ స్పెషల్.


అత్యంత కఠిన వాతావరణ పరిస్థితుల నడుమ జరిగే ఈ రేస్‌లో తొలిసారిగా ఓ మార్జాలం పాల్గొనడం విశేషం. తన యజమాని బాబ్ విలియమ్స్‌తో కలిసి పదేళ్ల వయసున్న ఓలి నదురు బెదురూ లేకుండా రెగెట్టాకు సిద్ధమైంది. మార్జాలాన్ని అనుమతించే విషయంలో అధికారులు తొలుత కొంత అయోమయంలో పడ్డారు. వాస్తవానికి హోబాట్ యాచ్ రేస్‌లో జంతువులు పాల్గొన్నరాదన్న నిబంధన ఏదీ లేదు.

పోటీ పడే సెయిలర్లు పూర్వం పావురాలను తీసుకెళ్లేవారు. తీరాన ఉన్న వారికి సందేశం అందజేసే ఆలోచనతో పావురాలు వెంటబెట్టుకుని వెళ్లేవారు. సముద్రయానాల్లో పెంపుడు పిల్లులను తీసుకెళ్లిన దాఖలాలు ఉన్నాయి. కానీ పడవల పోటీల్లో ఓ మార్జాలం పాలుపంచుకోవడం మాత్రం ఇదే తొలిసారి. సెయిలింగ్ పోటీల చరిత్రలో ఓలి ఇలా రికార్డులకెక్కింది.


విలియమ్స్‌తో కలిసి ఓలి ఇప్పటికే పలు సార్లు సముద్రయానం చేసింది. ఐదేళ్ల క్రితం తొలినాళ్ల ప్రయాణంలో కొంత అస్వస్థతకు గురైంది. రాన్రాను సముద్ర ప్రయాణానికి ఓలి అలవాటైపోయిందని విలియమ్స్ చెప్పుకొచ్చారు. అన్నట్టు.. ఓలికి ఈత కూడా వస్తుందట. అయినా అల్లకల్లోల పరిస్థితుల్లో పడవ తిరగబడినా.. ఓలి సముద్ర జలాల్లోకి జారిపోకుండా సురక్షిత చర్యలన్నీ తీసుకున్నానని విలియమ్స్ చెబుతున్నారు.

హోబాట్ యాచ్ రేస్‌లో చిన్నవి, పెద్దవి కలుపుకుని మొత్తం 113 పడవులు పోటీ పడుతున్నాయి. నిరుటి సంఖ్యతో పోలిస్తే ఈ సారి ఏడు మాత్రమే తక్కువ. 1945 నుంచి ఈ రేస్ జరుగుతుండగా.. ప్రముఖులెందరో పోటీపడ్డారు. మీడియా మొగల్ రూపర్ట్ ముర్దోక్ నుంచి ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజ క్రీడాకారుడు మైఖేల్ క్లార్క్, మాజీ ప్రధాని సర్ ఎడ్వర్డ్ హీత్ వరకు ఎందరో ఆ జాబితాలో ఉన్నారు. అందుకే ఏటా జరిగే హోబాట్ యాచ్ రేస్ అంటే ఎంతో క్రేజ్.

ఈ పోటీల్లో విజేతగా నిలవడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఎన్నో కఠిన పరిస్థితులను, ప్రతికూల వాతావరణాన్ని అధిగమించాల్సి ఉంటుంది. 1998లో జరిగిన పోటీల్లో పోటీదారులు పెనుతుఫానులో చిక్కుకున్నారు. ఆరుగురు సెయిలర్లు మరణించారు. అయిదు బోట్లు మునిగిపోయాయి. ఇప్పటివరకు జరిగిన పోటీల్లో అత్యంత దురదృష్టకరమైన ఘటన అదే. ఈ సారి కూడా అలాంటి పరిస్థితులే ఎదురుకావొచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉరుములతో కూడిన గాలివాన రావొచ్చని చెబుతున్నారు.

.

.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×