E-Paper
Advertisement

Boxing Day Test: రేపు సౌతాఫ్రికాతో టీమిండియా బాక్సింగ్ డే టెస్ట్.. సఫారీలతో సవాల్

Boxing Day Test: రేపు సౌతాఫ్రికాతో టీమిండియా బాక్సింగ్ డే టెస్ట్.. సఫారీలతో సవాల్
Advertisement

Boxing Day Test: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాణించి వన్డే సిరీస్‌ను గెలుచుకుని టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతోంది. 2 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టెస్టు డిసెంబర్‌ 26న సెంచూరియన్‌ వేదికగా జరగాల్సి ఉంది. సాధారణంగా క్రికెట్‌లో క్రిస్‌మస్‌కు తర్వాతి రోజున మొదలుకాబోయే బాక్సింగ్‌ డే టెస్టులో సఫారీతో కఠిన సవాల్‌ను స్వీకరించనుంది.

ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ వంటి కామన్వెల్త్‌ దేశాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన బాక్సింగ్‌ డే టెస్టులు ఇటీవల కాలంలో భారత్‌లో కూడా పాపులర్‌ అవుతున్నాయి. టీమిండియా మొట్టమొదటిసారిగా 1985లో బాక్సింగ్‌ డే టెస్టు ఆడింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌ను భారత్‌ డ్రా చేసుకుంది. ఇప్పటివరకూ భారత్‌.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ లతో 16 బాక్సింగ్‌ డే టెస్టులు ఆడింది. ఆస్ట్రేలియాతో 9, సౌతాఫ్రికాతో 6, న్యూజిలాండ్‌తో ఒక టెస్టు ఆడింది.

Advertisement

1985 నుంచి బాక్సింగ్‌ డే టెస్టులు ఆడుతున్న భారత్‌.. ఇప్పటివరకూ గెలిచింది నాలుగు మ్యాచ్‌లు మాత్రమే. అది కూడా టీమిండియా తొలి బాక్సింగ్‌ డే టెస్టు విజయం సౌతాఫ్రికా మీదే కావడం గమనార్హం. 2010లో సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా డర్బన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌.. సఫారీలను ఓడించి తొలి విజయాన్ని నమోదుచేసింది. కానీ 2018 నుంచి ఆడిన మూడు బాక్సింగ్‌ డే టెస్టులలో భారత్‌దే విజయం. 2018, 2020లలో ఆస్ట్రేలియాను ఓడించిన కోహ్లీ సేన.. 2021లో కూడా ప్రోటీస్‌ టీమ్‌ను ఓడించింది. త్వరలో రోహిత్‌ శర్మ సారథ్యంలో మ్యాచ్‌ ఆడనున్న టీమిండియా.. తొలి టెస్టు జరుగబోయే సెంచూరియన్‌లోనే చివరిసారిగా బాక్సింగ్‌ డే టెస్టును గెలుచుకుంది. మొత్తంగా సౌతాఫ్రికాపై ఆరు టెస్టులు ఆడి రెండు గెలిచి నాలుగింటిలో ఓడింది.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×