E-Paper
Advertisement

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!
Advertisement

Donald Trump: పశ్చిమాసియా ప్రాంతంలో మరోసారి యుద్ధ మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. హర్మూజ్ జలసంధి మూసివేత, అణ్వాయుధ వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తతలను మరింత తారా స్థాయికి చేరాయి.

హర్మూజ్ జలసంధిపై ట్రంప్ అల్టిమేటం

Advertisement

హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని ట్రంప్ హెచ్చరించారు. లేదంటే తీవ్రమైన దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ట్రంప్ స్పష్టం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా చేపడుతున్న అత్యంత భారీ సైనిక దాడికి సిద్ధమవుతుండటంతోనే ఇరాన్ తమ వద్దకు చర్చల కోసం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఈసారి చర్చల నుంచి ఇరాన్ వెనక్కి తగ్గితే పర్యవసానాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై మరో 48 గంటల్లో స్పష్టత వస్తుందని తెలిపారు.

ఒప్పందంపై అమెరికా ఆశాభావం

Advertisement

మరోవైపు ఇరాన్, ఒమన్ దేశాలతో కలిసి తాము జరుపుతున్న చర్చలు సానుకూల దిశలో సాగుతున్నాయని అమెరికా ప్రకటించింది. జలసంధిలో స్వేచ్ఛాయుత రవాణాపై ఒకట్రెండు రోజుల్లోనే కీలక ఒప్పందం కుదిరే అవకాశముందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ వెల్లడించారు. అయితే వెనుక తలుపుల ద్వారా తమతో చర్చలు జరుపుతూనే, బయటకు మాత్రం వాటిని ఇరాన్ బహిరంగంగా ఖండించడం విడ్డూరంగా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

అమెరికా వ్యాఖ్యలను తిరస్కరించిన ఇరాన్

అమెరికా ప్రకటనను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఒమన్‌తో తాము జరుపుతున్న దౌత్య చర్చల్లో అమెరికాకు ఎలాంటి భాగస్వామ్యం లేదని టెహ్రాన్ స్పష్టం చేసింది. తమ దేశ సార్వభౌమాధికారం, భద్రతా ప్రయోజనాలను కాపాడుకునే దిశగానే కొత్త సముద్ర రవాణా విధానంపై చర్చలు సాగుతున్నాయని ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ఈ పరస్పర ప్రకటనల యుద్ధంతో గల్ఫ్ ప్రాంతంలో భవిష్యత్తు పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయోనన్న తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Also Read: ప్రకాష్ రాజ్ పళ్లు రాలగొడతాం.. సైబర్ డీజీకి బీజేపీ నేతలు ఫిర్యాదు

Tags

Related News

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను ఇరికించిన భద్ర.. వల్లికి దిమ్మతిరిగే షాక్.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకొనేది..

Karthika Deepam 2 Serial Today Episode September 18th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణను దొంగగా బావించిన ఆలయ ధర్మకర్త          

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. ఇదేం ట్విస్ట్ రా అయ్యా..

ఆయనో భూస్వామి..నువ్వో పెయింటర్‌.. రా భూముల లెక్కలు తేల్చుకుందాం..! కేటీఆర్‌ వీరావేశం..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్.. ఐఫోన్ ధరలు తగ్గుతాయా? లేక షాక్ ఇస్తాయా? పూర్తి విశ్లేషణ!

Karthika Deepam 2 Serial Today Episode September 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: హాస్పిటల్ లో దీప – ఇంట్లోంచి గెంటివేయబడ్డ శివనారాయణ          

జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ లీలలు.. ఫోన్ ఓపెన్ చేసి చూసిన అధికారులకు మైండ్ బ్లాక్!

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

Big Stories

Advertisement
×