BigTV English

Rahul Gandhi Public Meeting in kadapa: చివరి రోజు కడపకు రాహుల్, సీఎం జగన్‌‌కు కౌంటరిస్తారా?

Rahul Gandhi Public Meeting in kadapa: చివరి రోజు కడపకు రాహుల్, సీఎం జగన్‌‌కు కౌంటరిస్తారా?

Rahul Gandhi Public Meeting in kadapa(AP political news):

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరింది. శనివారంతో ప్రచారం ముగియనుండడంతో కీలక నేతలు ప్రచారానికి సిద్దమయ్యారు. ఇందులోభాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ శనివారం కడపకు రానున్నారు. వైఎస్ షర్మిల గెలుపు కోసం ప్రత్యేకంగా రాహుల్‌గాంధీ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో రాహుల్ ఏం మాట్లాడుతారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.


సీఎం జగన్‌తోపాటు వైసీపీ నేతలకు వణుకు మొదలైంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. జగన్ అక్రమాస్తుల కేసులో వైఎస్సార్ పేరును కాంగ్రెస్ పార్టీ ఛార్జ్‌షీటులో చేర్చిందన్నది సీఎం జగన్ ప్రధాన ఆరోపణ. దీన్ని షర్మిల కూడా ఖండించారు కూడా. ఇప్పుడు రాహుల్‌గాంధీ ఆ వ్యవహారంపై కౌంటర్ ఇచ్చే ఛాన్స్ వుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు వైఎస్ ఫ్యామిలీకి తమ పార్టీ అండగా ఉంటుందని యువనేత చెప్పే అవకాశముందని అంటున్నారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీపై చేసిన ఆరోపణలన్నింటికీ ఇవాళ సభలో రాహుల్ కౌంటరివ్వడం ఖాయమని అంటున్నారు. వివేకానంద హత్య కేసును రాహుల్‌‌గాంధీ ప్రస్తావించే ఛాన్స్ ఉందని సమాచారం.

ఈ క్రమంలో శుక్రవారం కడప రోడ్ షోలో మాట్లాడిన సీఎం జగన్.. రాహుల్ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ ఫ్యామిలీని రోడ్ల పాలు చేసి తనను జైలులో పెట్టారని ఆరోపించారు. 16 నెలల కాలాన్ని తనకు ఎవరు తిరిగి ఇస్తారని ప్రశ్నించారు. ముఖ్యంగా కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మన కళ్లను మనం పొడుచుకున్నట్లేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ఓట్లను చీల్చి టీడీపీకి మేలు చేయడమే కాంగ్రెస్ ఉద్దేశమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


ఎప్పుడు లేని విధంగా తొలిసారి జగన్ టెన్షన్‌ పడుతున్నట్లు ఫ్యాన్ పార్టీ నేతలు ఓపెన్‌గా చెబుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ మొదలు కాంగ్రెస్ హైకమాండ్ కడప వచ్చిన సందర్భం లేదు. అక్కడి వ్యవహారా లను షర్మిలకే అప్పగించారు. రెండుసార్లు కీలకమైన నియోజకవర్గాల్లో ఆమె రోడ్ షో చేశారు. సీఎం జగన్ వ్యవహారశైలిని తూర్పారబట్టారు. ఫ్యామిలీ విషయాలను సైతం బయటపెట్టారు. పార్టీల మధ్య పోరాటం కాదని, అన్నకు- చెల్లికు మధ్య జరుగుతున్న పోరుగా వర్ణించారామె. న్యాయం కోసం ఒకవైపు రాజన్న బిడ్డ, మరో జగన్ భార్య, బంధువులు మరొక వైపు అని చెప్పుకనే చెప్పేవారు. తేల్చుకోవాల్సిందే ప్రజలేనని గుర్తు చేశారు. ఈలోగా రాహుల్ రాక ఫ్యాన్ పార్టీలో వణుకు మొదలైందన్నది రాజకీయ విశ్లేషకుల మాట.

ALSO READ: ‘పగలు బీజేపీతో.. రాత్రి కాంగ్రెస్‌తో చంద్రబాబు సంసారం’

కడప విమానాశ్రయానికి చేరుకోగానే అక్కడి నుంచి షర్మిలతో కలిసి హెలికాప్టర్‌లో పులివెందులకు వెళ్తారు రాహుల్‌గాంధీ. అక్కడి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. తిరిగి కడపకు చేరుకుని బిల్టప్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అయితే షర్మిల గెలుపు కోసం ప్రత్యేకంగా రాహుల్ గాంధీ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×