Big Stories

YS Sunitha: జగన్‌కు సునీత సవాల్.. ‘ఎక్కడైనా సరే చర్చకు సిద్ధం.. సాక్షి ఛానల్‌కు రమ్మన్నా వస్తా’

Suneetha Narreddy latest commentsSuneetha narreddy latest comments(Andhra pradesh political news today): మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత సీఎం జగన్ పై మండిపడ్డారు. తాను అడిగే ప్రశ్నలకు అన్నగా కాకపోయినా సరే.. సీఎంగానైనా సమాధానం చెప్పాలన్నారు. తన తండ్రిని హత్య చేసిన నేరస్తులను జగన్ ఎందుకు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. కడపలో అవినాష్ రెడ్డిని ఓడించాలని.. జగన్ ను కూడా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

- Advertisement -

ఎవరినైనా ఒకసారి మాత్రమే మోసం చేయగలరని.. పదే పదే మోసం చేయలేరని సునీత నర్రెడ్డి అన్నారు. సీఎం జగన్ ప్రజలను పదేపదే మోసం చేస్తున్నారని విమర్శించారు. గత కొన్ని రోజులుగా తాను, వైఎస్ షర్మిల మాట్లాడుతుంటే అవి వేరే ప్రభావంతోనే అలా మట్లాడుతున్నట్లు విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ట్రాప్ లో పడలేదని.. మీ మాటలు నమ్మి ప్రజలే ట్రాప్ లో పడుతున్నారని అన్నారు.

- Advertisement -

తన తండ్రి వివేకా హత్య కేసు విషయంలో జగన్ తనతో తోలుబొమ్మలాట ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మిమ్మల్ని గుడ్డిగా నమ్మి చెప్పినట్లు చేశానిని.. ప్రస్తుతం తాను చేసిన తప్పును తెలుసుకున్నానన్నారు. వాటికి సరిద్దిద్దుకునే సమయం వచ్చిందన్నారు.

కడపలో అవినాష్ రెడ్డిని ఓడించాలని.. జగన్ ను కూడా ఓడించాలని కడప ప్రజలకు పిలుపునిచ్చారు. అవినాష్ పై వైఎస్ షర్మిల పోటీ చేయడం ఆనందంగా ఉందన్నారు. అందుకే అవినాష్ ను ఓడించి.. షర్మిలను గెలిపించాలని అన్నారు.

ప్రజలంతా గమనిస్తున్నారని.. వాస్తవాలేంటో వారికి తెలుసని వెల్లడించారు.హైదరాబాద్, కడపలో తాను అడిగే ప్రశ్నలకు అన్నగా కాకపోయినా సరే.. సీఎంగానైనా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి సారి ఎమోషల్ మాటలతో ప్రజలందరినీ మోసం చేయలేరని గుర్తుచేశారు.

కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సునీత తన ఆవేదనను వ్యక్తం చేశారు. వివేకాను చంపిందెవరో ఆ దేవుడికి, కడప జిల్లా ప్రజలకు తెలుసన్నారు. ఆ జిల్లాలోనే మీరు ఒకరు కదా.. అలాంటప్పుడు మీకు హత్య ఎవరు చేశారో.. చేయించారో తెలిసినట్లే కదా అని ప్రశ్నించారు. అది సీఎంగా బయటపెట్టాల్సిన బాధ్యత జగన్ పై ఉందన్నారు. వివేకాను హత్య చేసిన అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు.

Also Read: AP Congress List : నేడే ఏపీ కాంగ్రెస్ జాబితా.. ఇడుపులపాయలో ప్రకటించనున్న షర్మిల

ఈ కేసులో అవినాష్ రెడ్డి ప్రమేయం బయటపడితే.. ఇంకేమైనా బయటకి వస్తాయని బయటపడుతున్నారా అని ప్రశ్నించారు. ‘అంతభయం దేనికి? నేరుగా మాట్లాడాలంటే చెప్పండి. నాకు అభ్యంతరం లేదు. మీ సాక్షి ఛానల్ కి వస్తా.. డెబిట్ చేద్దాం. నిజానిజాలు బయటకు వస్తాయి. ఎవరేం చెప్తున్నారో ప్రజలే అర్థం చేసుకుంటారు’ అని సునీత అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News