BigTV English

Ysrcp React: పోసాని అరెస్ట్‌పై వైసీపీ రియాక్ట్.. ముమ్మాటికీ కక్ష సాధింపు

Ysrcp React: పోసాని అరెస్ట్‌పై వైసీపీ రియాక్ట్.. ముమ్మాటికీ కక్ష సాధింపు

Ysrcp React: ఏపీలో కూటమి ప్రభుత్వం రూటు మార్చిందా? వైపీసీ నేతలపై చర్యలు తీసుకోకుంటే ప్రజలు, కార్యకర్తల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని భావించిందా? అందుకే ఎవరికీ తెలీకుండా అరెస్ట్ పర్వానికి తెర లేపిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.త్వరలో అరెస్టులు చేయబోయే రేసులో ఆ పార్టీకి చెందిన చాలామంది నేతలు ఉన్నారు. కాకపోతే వారిలో ముగ్గురిపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది టీడీపీ వర్గాల నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. గత ప్రభుత్వంలో ఆ ముగ్గురూ ఫైర్ బ్రాండ్ నేతలే. వారంతా మంత్రులుగా చెలామణి అయ్యారు కూడా. దీంతో ఎవరంటూ చర్చించుకోవడం టీడీపీ నేతల వంతైంది.


పోసాని అరెస్ట్‌పై వైసీపీ రియాక్షన్

పోసాని కృష్ణమురళి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే పోసాని అరెస్ట్ జరిగిందన్నారు. అసెంబ్లీ సాక్షిగా పోసాని అరెస్ట్ కు కుట్ర జరిగిందన్నారు. ఆ నోటీసు పరిశీలిస్తే గురువారం తారీఖుతో నోటీసు ఇచ్చి బుధవారం అరెస్ట్ చేయడం కూటమి సర్కార్‌‌లో చూస్తున్నామని అన్నారు.


అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తనకు ఫోన్ చేసే వరకు ఈ విషయం తెలీదన్నారు తోపుదుర్తి. పోసాని ఒక పద్దతిగా మాట్లాడేవారని, ప్రభుత్వం పాలసీల మీద విమర్శించారని, ఏనాడూ హద్దులు దాటి మాట్లాడిన సందర్భం లేదన్నది తోపుదుర్తి మాట. సింపుల్‌గా చెప్పాలంటే పోసానిని ఆ పార్టీ వెనుకేసు కొచ్చింది. ఆ సెక్షన్లు చూస్తుంటే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారన్నారు.

రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి మాత్రమే అరెస్టులు చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ వల్ల రాష్ట్రానికి ఏ మాత్రం ఒదిగేది లేదని మండిపడ్డారు. అసెంబ్లీలో పవన్ మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులను అణిచివేసేందుకు ఓ తీర్మానం చేయాలని పవన్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు తోపుదుర్తి.

ALSO READ: పోసాని అరెస్ట్.. రాత్రి ఇంట్లో ఏం జరిగింది?

రెడ్‌బుక్ రాజ్యాంగమే

పోసాని కృష్ణమురళి అరెస్టుపై వైసీపీ సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. శివరాత్రి రోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించింది. పోసాని ఇంటికి వెళ్లి అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిపింది.

అరెస్టు విషయంలో పోలీసులు డబుల్ గేమ్ మొదలుపెట్టారని వివరించింది. పోసాని కుటుంబ సభ్యులకు పోలీసులు ఇచ్చిన ఫోన్ నంబర్‌లో ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ అని ఉందన్నారు. న్యాయపరమైన వెసులుబాటు రానీయకుండా రెండు చోట్ల నుండి కేసును డ్రైవ్ చేస్తున్నటుగా అనుమానాలు ఉన్నాయని పేర్కొంది.

టెన్షన్‌లో వైసీపీ నేతలు

ఇక అసలు విషయానికొద్దాం.. త్వరలో  అరెస్టు చేయబోయే రేసులో ముగ్గురు వైసీపీ నేతలున్నట్లు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా చెలామణి అయ్యారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు, కృష్ణాజిల్లాకు చెందినవారు ఉన్నట్లు టీడీపీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. ఏపీలో ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచింది.  ప్రభుత్వం సైలెంట్‌గా ఉండడంతో  వైసీపీ నేతలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు.

ఈలోగా వారానికి ఒకరు చొప్పున ఇద్దరు నేతలు అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో కొందరి నేతలకు అప్పుడే టెన్షన్ మొదలైంది. బయటకు వెళ్లి ఇబ్బందులు తెచ్చుకునే బదులు సైలెంట్‌గా ఉండడమే బెటరన్న అంచనాకు వస్తున్నారట. ఇదిలావుండగా రెండురోజుల తాడేపల్లి నుంచి పులివెందుల మీదుగా బెంగుళూరుకి వెళ్లారు మాజీ సీఎం జగన్. పోసాని అరెస్టుతో ఆయన విజయవాడకు మళ్లీ వస్తారా? లేదా అనేది చూడాలి.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×