BigTV English

Kayadu Lohar : ‘కాయదు’ పేరుకు ఇంత చరిత్ర ఉందా?.. ఈమె పెద్ద భక్తురాలే..

Kayadu Lohar : ‘కాయదు’ పేరుకు ఇంత చరిత్ర ఉందా?.. ఈమె పెద్ద భక్తురాలే..

Kayadu Lohar : ప్రస్తుతం ఎక్కడ వినిపించినా ‘కాయదు లోహర్’ పేరు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది. ఒక్క సినిమాతో యూత్ క్రష్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తున్న, ట్రెండింగ్‌లో ఉంటున్న పేరు కాయదు లోహర్అస్సాం నుంచి వచ్చిన ముద్దుగుమ్మ 2021లో ముగిలిపేట్ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తెలుగులో అవకాశాలు రావడంతో పాప ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ ను మించి క్రేజ్ ను అందుకుంది. తమిళ, మలయాళ, మరాఠి, తెలుగులో సౌత్ భాషలన్నింటిలో ఒక్కో చిత్రంలో నటించింది. ఇక 2022లో శ్రీవిష్ణు సరసన అల్లూరి సినిమాలో నటించినా అశించినంత గుర్తింపు రాలేదు. ఇప్పటివరకు కేవలం ఐదు సినిమాల్లో మాత్రమే నటించింది..


ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈమె వరుసగా ఫోటో షూట్ లను షేర్ చేస్తుంది. ఆమె అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.. ఆమె ఫోటోల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు అంటే అది మామూలు విషయం కాదు. అయితే రీసెంట్ గా ఈమె డ్రాగన్ మూవీ తో ప్రేక్షకులను పలకరించింది.. ఆమూవీ భారీ విజయాన్ని అందుకోవడం తో ఈమె పేరు నెట్టింట తెగ ప్రచారంలో ఉంది. సినిమాల పరంగా దూసుకుపోతున్న ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.. డ్రాగన్ సక్సెస్ మీట్ లో ఈమె మాట్లాడి అందరిని ఆకట్టుకుంది… శారీలో అందంగా కనిపించి అందరి చూపును తన వైపు తిప్పుకుంది.

ఆ ఈవెంట్ లో యాంకర్ సుమ కాయదు అనే పేరు యూత్ క్రష్ అయ్యింది. అసలు ఆ పేరుకు అర్థం ఏంటి? అని అడిగింది. దానికి అర్థం భక్త ప్రహల్లాద్ తల్లి, హిరణ్య కసిపుడు భార్య కాయదు పేరు పెట్టారని చెప్పారు. ఆ మాట వినగానే సుమ షాక్ అయ్యింది. నీ పేరులో ఇంత ఇంత అర్థం ఉందా అని అంది. మొత్తానికి ఆ పేరుకు అర్థం తెలియడంతో మరోసారి ఆమె వార్తల్లో నిలిచింది. అలా తన పేరు మరోసారి వార్తల్లో హైలెట్ అయ్యింది.


ఇక సినిమాల విషయానికొస్తే.. తాజాగా డ్రాగన్ సినిమా విజయం సాధించడంతో ఇతర భాషల నిర్మాతల, దర్శకులు, హీరోలు ఇప్పుడు కయదు లోహర్ కాల్షీట్ల కోసం తిరుగుతున్నారంటే ఈ ముద్దుగుమ్మకు డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందే ఇట్టే అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈమె విశ్వక్ సేన్ కు జోడిగా ఓ మూవీలో నటిస్తుంది.. జాతి రత్నాలు ఫేం అనుదీప్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్‌గా సెలక్ట్ చేసినట్లు సమాచారం. ఫంకీ’ లో హీరోయిన్ గా ఆమెను ఫిక్స్ చేశారని వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తుండగా, కళ్యాణ్ దర్శకత్వంలో రూపొందుతోంది. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఈ అమ్మడి జోరు చూస్తుంటే కొన్నాళ్ళకే ఇండస్ట్రీలోకి స్టార్ ఇమేజ్ ను అందుకుంటుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×