BigTV English

Ysrcp tweet: ఈ ట్వీట్ వేయడానికి మీకు చేతులెలా వచ్చాయి..?

Ysrcp tweet: ఈ ట్వీట్ వేయడానికి మీకు చేతులెలా వచ్చాయి..?

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా గిరిజన తండాలకు రోడ్లు వేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇంకా ఆ పని చేయలేదని, అందుకే డోలీలో ఆస్పత్రికి తీసుకెళ్తున్న గర్భిణి మార్గమధ్యంలోనే ప్రసవించిందంటూ వైసీపీ అధికారికంగా ఓ ట్వీట్ వేసింది. ఐదేళ్లుగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోడ్లు ఎందుకు వేయలేదు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రాగానే నిస్సిగ్గుగా ట్వీట్ వేసి విమర్శించడం అవసరమా అంటూ ట్రోలింగ్ మొదలైంది. తన చేతగాని తనాన్ని ఇలా జగన్ బయటపెట్టుకున్నారని కౌంటర్ ఇస్తున్నారు నెటిజన్లు.


అసలేమైంది..?
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది సంక్రాంతి నాటికి రాష్ట్రంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేస్తామని, కొత్త రోడ్లు వేస్తామని హామీ ఇచ్చింది. అన్నట్టుగానే చాలా చోట్ల రోడ్ల నిర్మాణం మొదలైంది. గుంతల రోడ్లు నేడు కొత్త రూపు సంతరించుకున్నాయి. గిరిజన తండాల్లో కూడా చాలా చోట్ల రోడ్లు వేయడం మొదలు పెట్టారు. అక్కడక్కడా కొంత ఆలస్యం జరుగుతున్న మాట వాస్తవమే అయినా, స్థానిక పరిస్థితుల దృష్ట్యా రోడ్ల నిర్మాణం అక్కడ సాధ్యం కాకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకోసం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ దశలో తాజాగా వైసీపీ అధికారిక అకౌంట్ నుంచి ఒక ట్వీట్ పడింది.

40 ఏళ్ల‌కు పైగా రాజ‌కీయ అనుభ‌వం అని, 4 సార్లు ముఖ్య‌మంత్రిని అని గొప్ప‌లు చెప్పుకోవ‌డం, కాదు గిరిజ‌న బిడ్డ‌ల క‌ష్టాలు చూడండి అంటూ వైసీపీ ఓ ట్వీట్ వేసింది.
సంక్రాంతి నాటికే రాష్ట్రంలో రోడ్లన్నీ పూర్తి చేస్తామంటీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఇచ్చిన హామీలు పేప‌ర్ల‌లో వార్త‌ల వ‌ర‌కే ప‌రిమితం అయ్యాయ‌ని ఆ ట్వీట్ లో విమర్శించారు. విజయ‌న‌గ‌రం జిల్లా రేగ‌పుణ్య‌గిరి గ్రామంలో ఒక గర్భిణీని డోలీలో ఆస్ప‌త్రికి తీసుకెళ్తుండ‌గా ఆమె మార్గం మ‌ధ్య‌లోనే ప్ర‌స‌వించిందంటూ ట్వీట్ లో ప్రస్తావించారు. గిరిజ‌న బిడ్డ‌ల క‌ష్టాలు ప్రభుత్వానికి ప‌ట్ట‌వా? అని నిలదీశారు. గిరిజ‌నుల గురించి పెద్ద పెద్ద ప్ర‌సంగాలు ఇవ్వ‌డం మానేసి, ఇప్ప‌టికైనా వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంపై దృష్టి పెట్టాలంటూ ప్రత్యేకంగా పవన్ ని ఉద్దేశిస్తూ ట్వీట్ వేసింది వైసీపీ.

నిస్సిగ్గుగా..
కూటమి అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది పూర్తి కాలేదు. పోనీ సంక్రాంతికి రోడ్లు వేస్తామని చెప్పి ఇంకా కాలయాపన చేయడం కూటమి తప్పే అనుకుందాం. మరి కూటమి కంటే ముందు ఐదేళ్లు వైసీపీ ఈ రాష్ట్రాన్ని పాలించింది. ఆ పాలనలో విజయనగరం జిల్లా రేగపుణ్యగిరి కష్టాలు పాలకులకు పట్టలేదా..? అప్పటి సీఎం జగన్, అప్పట్లోనే రోడ్డు వేసి ఉంటే ఇప్పుడీ గిరిజనులకు డోలీ కష్టాలు తప్పేవి కదా..? ఆ మాత్రం స్పృహలేకుండా ఇప్పుడు వైసీపీ తగుదునమ్మా అంటూ ట్వీట్ వేయడం వారి భావ దారిద్రానికి నిదర్శనం అంటున్నారు టీడీపీ నేతలు.

వైసీపీ హయాంలో ఏపీలో రోడ్ల దుస్థితి ఎలా ఉందో ప్రజలందరికీ తెలుసని, కూటమి అధికారంలోకి వచ్చాకే రోడ్లకు మరమ్మతులు చేశారని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారని అంటున్నారు నేతలు. తన హయాంలో రోడ్లను పట్టించుకోని జగన్, ఇప్పుడు రోడ్లు లేవు అంటూ మాట్లాడటం దిగజారిన రాజకీయం అంటూ విమర్శిస్తున్నారు జనసైనికులు. గిరిజనుల సమస్యలు పరిష్కరించడంలో పవన్ కల్యాణ్ చిత్తశుద్ధిని ప్రశ్నించే స్థాయి జగన్ కు లేదంటున్నారు. తాము ఐదేళ్లుగా చేతగానివాళ్లుగా ఉండిపోయామని జగన్ ఒప్పుకున్నట్టేనా అని ప్రశ్నిస్తున్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×