Sangareddy Crime News: భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో తెలీదు. సడన్‌గా భార్యా పుట్టింటికి వెళ్లిపోయింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె భర్త, ఇద్దరు కొడుకులను చంపేశాడు. ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. సంచలనం రేపిన ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. ఇంతకీ అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
సమాజంలో చిన్న చిన్న కోపాలను భూతద్దంలో చూస్తున్నారు భార్యభర్తలు. ఫలితంగా ఏ ఒక్కరూ రాజీ పడడం లేదు. అభం శుభం తెలియని చిన్నారులను చంపేస్తున్నారు. లేకుంటే వారైనా ఈ లోకాన్ని విడిచి పెడుతున్నారు. లేదంటూ పిల్లలను అనాధలను చేస్తున్నారు. అలాంటి తల్లిదండ్రుల వల్ల వారి జీవితాలు నరకప్రాయంగా మారాయి.. మారుతోంది కూడా.
అసలేం జరిగింది?
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపి తను సూసైడ్ చేసుకున్నాడు ఓ వ్యక్తి. సుభాష్ అనే వ్యక్తి భార్య పిల్లలతో కలిసి మల్కపూర్ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల సుభాష్ భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. పుట్టింటికి వెళ్లిందా? లేక మరో చోటికి వెళ్లిందా అనేది తెలీదు.
భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత మనస్తాపానికి గురయ్యాడు సుభాష్. ఎందుకు అలా చేసిందో అర్థంకాలేదు. ఎంత ఆలోచించినా అంతబట్టడం లేదు. భార్య లేని ఈ లోకంలో తాను ఉండడం ఎందుకని భావించాడు. తన ఇద్దరు పిల్లలను ఉరి వేసి చంపేశాడు. ఆ తర్వాత తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ALSO READ: ఇన్యూరెన్స్ రెన్యువల్ పేరుతో మోసాలు, హైదరాబాద్‌లో అరాచకాలు
సుభాష్ ఇంటి వద్ద ఎలాంటి సందడి లేదని గమనించారు ఇరుగుపొరుగు వారు. చివరకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. వెంటనే తలుపు ఓపెన్ చేసి చూసేసరికి ముగ్గురు మృతదేహాలు కనిపించాయి. వాటిని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం దర్యాప్తు మొదలుపెట్టారు. భార్య వస్తేనే అసలు విషయం ఏంటనేది తెలుస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఇరువైపుల కుటుంబాలకు పోలీసులు సమాచారం ఇచ్చారు. మల్కపూర్ గ్రామంలో విషాదం నెలకొంది.