E-Paper
Advertisement

మెగా డీఎస్సీపై రోజా ఫైర్.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే!

మెగా డీఎస్సీపై రోజా ఫైర్.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే!
Advertisement

Roja: మెగా డీఎస్సీ వ్యవహారంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయన్నారు మాజీ మంత్రి రోజా. ఇది అభ్యర్థులను మోసం చేసే ‘దగా డీఎస్సీ’గా మారిందని మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్‌.కె. రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కేటాయింపుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపించారు. నైతిక బాధ్యత వహిస్తూ విద్యారంగ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆమె గట్టిగా డిమాండ్ చేశారు.

 మాజీ మంత్రి రోజా మాట్లుడుతూ..

Advertisement

ఈ అంశంపై అభ్యర్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలంటూ తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రోజా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందని మండిపడ్డారు. కష్టపడి చదివిన అర్హులైన అభ్యర్థులకు మొండిచేయి చూపి, అక్రమాలకు తెరలేపారని విమర్శించారు.

Also Read: రామాలయ వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామ!

Advertisement

లోకేష్ వెంటనే రాజీ నామా చేయ్యాలి.

స్పోర్ట్స్ కోటా పేరుతో అర్హత లేని వారికి పోస్టులు కట్టబెట్టారని, దీనివల్ల నిజమైన క్రీడాకారులు, నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేసే వరకు ఈ పోరాటాన్ని ఆపేది లేదని, బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ తరఫున క్షేత్రస్థాయిలో పోరాటం కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.

Related News

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

మరోసారి కంటతడి పెట్టిన బొత్స.. ఓదార్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు!

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం!

అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్.. 12 గంటలు కూర్చో లేకపోతే ఎలా? ఫోన్లు వద్దని ముందే..

విషం కక్కుతున్నారు.. వారిని అస్సలు వదిలిపెట్టం, జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

Big Stories

Advertisement
×