Amaravati: ఏపీలో మెగా డీస్సీపై రగడ కంటిన్యూ అవుతోంది. ఈ వ్యవహారంపై అధికార టీడీపీ-విపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఒకరిపై మరొకరు విమర్శలు కాకుండా సవాళ్ల పర్వం జోరందుకుంది. గురువారం మీడియా సమావేశంలో మాజీ సీఎం జగన్ చేసిన ఆరోపణలపై తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి లోకేష్. దీనికి సంబంధించి ఓ వీడియో విడుదల చేశారు.
గురువారం మీడియా ముందుకొచ్చిన మాజీ సీఎం జగన్.. మెగా డీఎస్సీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. మెగా కాదు.. దగా డీఎస్సీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అదే సమయంలో జర్నలిస్టులపై కేసు వ్యవహారం ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో జగన్ మీడియా ముందు చేసిన ఆరోపణలకు కౌంటర్‌గా గురువారం రాత్రి రెండు నిమిషాల నిడివి గల ఓ వీడియో విడుదల చేశారు మంత్రి లోకేష్.
ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని, చేతనైతే ఆపాలని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజలందరికీ హృదయ పూర్వక నమస్కారాలు చెబుతూ మాజీ సీఎం జగన్ డీఎస్సీపై మళ్లీ చేసిన ఆరోపణలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. డీఎస్సీ-ఏపీపీఎస్సీకి మధ్య తేడా మీకు తెలుసా అంటూ ప్రశ్నించారు. డీఎస్సీపై అనేక సార్లు న్యాయస్థానాలను ఆశ్రయించారని, మీ పార్టీ నేత పిల్ వేసి సీబీఐ ఎంక్వైరీ కోరితే తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. డీఎస్సీ ఆపాలని 300 కేసులు మీరు వేసినా.. న్యాయస్థానం ఎక్కడా మమ్మల్ని తప్పు బట్టలేదన్నారు. విద్యాశాఖ అధికారులు మీడియా సమావేశంలో మీరు చేసిన ఆరోపణలకు అద్భుతంగా సమాధానం చెప్పారని, ఇకపైనా డీఎస్సీపై విషం కక్కడం చాలా బాధాకరమన్నారు.
ఈ మధ్యన మీ దొంగ పేపర్ విలేకరులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి అక్కడున్న ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని చెప్పుకొచ్చారు. కొన్నిచోట్ల దాడులు కూడా చేస్తున్నారని, అలాంటివాళ్లను అస్సలు వదిలిపెట్టమని తేల్చేశారు. ఇలాంటి విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని, ఉపాధ్యాయుల జోలికి ఎవరైనావెళ్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవాళ కుంభకోణాల గురించి మాట్లాడుతున్నారని, మూడేళ్ల కిందట స్కిల్ డెవలప్ మెంట్ కేసు ఏమైందని ప్రశ్నించారు. ఆనాడు జరిగిన ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ విషయంలో మా కుటుంబానికి, పార్టీకి ఎలాంటి అవినీతి సొమ్ము రాలేదని దర్యాప్తు సంస్థలు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
ALSO READ: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో
యువగళం పాదయాత్రలో ఎంతోమంది నిరుద్యోగ యువతీయువకులను కలిశానని, వాళ్ల సమస్యలను తెలుసుకున్నానని వివరించారు. పట్టుదలతో, క్రమశిక్షణతో ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించాలని డిసైడ్ అయ్యామని, ప్రతి సంవత్సరం 3 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. దాదాపు 30 వేల టీచర్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత తాను తీసుకుంటానని, చేతనైతే ఆపాలని సవాల్ విసిరారు. నేను వదిలిపెట్టను.. అనుకున్నది సాధిస్తామన్నారు. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని చెప్పకనే చెప్పారు. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ రానుందని వెల్లడించారు. యువత అందరికీ ఒకటే చెబుతున్నామని, బాగా ప్రిపేర్ అయి అద్భుతంగా రాయండి ఉపాధ్యాయులు కావాలన్నారు. అందరం కలసికట్టుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుదామని ఆ వీడియోలో ప్రస్తావించారు.
.@ysjagan, try and stop me!#DSCFakesByYCP #JaganAgainstTeachers #PsychoFekuJagan pic.twitter.com/rnzozD7wZx
— Lokesh Nara (@naralokesh) September 10, 2026