Zodiac sign: దీపావళి తర్వాత ఆ ఆరు రాశుల వారు నక్కతోక తొక్కినట్టే.. ఏ వృత్తిలో ఉన్నా డబ్బు ప్రవాహంలా వచ్చేస్తుందట. ఇంకా చెప్పాలంటే ఆ ఆరు రాశుల్లో జన్మించిన జాతకులు దశనే మారుతుందట. కోట్ల రూపాయలు సంపాదించి మిలియనీర్లు అవ్వబోతున్నారట. ఇంతకీ ఆ ఆరు రాశులేవో వారికి ఎలాంటి సందర్భాల్లో సంపాదన పెరుగబోతుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో గ్రహాల మార్పు అనేది నిరంతరం జరుగుతూ ఉండే ప్రక్రియ. అయితే ఈ ప్రక్రియ వల్ల అంత వరకు ఎన్నో కష్టాలు అనుభవించిన వ్యక్తులు కూడా హఠాత్తుగా కోట్లు సంపాదిస్తారు. కూటికి గతి లేని బికారి కూడా బిలియనీర్ అయిన సందర్భాలు ఉంటాయి. సరిగ్గా ఇలాంటి గ్రహ మార్పుల వల్లే ఇన్ని రోజులు నానా కష్టాలు పడిన ఆరు రాశులు జాతకుల జీవితాలు మారబోతున్నాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు.
దీపావళి పండుగ తర్వాత తల రాత మారే జాతకులు మేషరాశి జాతకులు. వీరి రాశ్యాధిపతి కుజుడు మరియు ఇతర గ్రహాల అనుకూలతతో ఈ రాశి వారికి విజయం తప్పదని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఇన్ని రోజులు వీరు కన్న కలలు సాకారం అవుతాయి. ఉద్యోగులకు విదేశీయానం దక్కబోతుంది. అలాగే నిరుద్యోగులకు తాము కోరుకున్న ఉద్యోగం లభించబోతుందట. అవివాహితులకు మంచి కుటుంబాలతో సంబంధాలు వస్తాయట. పెళ్లి అయ్యే యోగం, బలం ఇప్పుడు వీరికి వచ్చిందట. ఇంకా వీరి ఆదాయం పెరగుతుందట. చేసే ఏ పనిలోనైనా ఇన్ని రోజులు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోనున్నాయట.
ఈ రాశి జాతకులకు కూడా దీపావళి తర్వాత మహర్ధశ పట్టనుందట. ఈ ఏడాది చివరి వరకు అత్యంత వీరికి అదృష్టం కంటిన్యూగా ఉండనుందట. ఈ టైలో వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది.. అన్నట్టుగా ఉంటుందట. ఆస్తి లాభాలు, పదోన్నతులు, ప్రేమ లేదా పెద్దల కుదిర్చిన వివాహం అయ్యే అవకాలు ఉన్నాయి. ఈ రాశి వారికి విదేశీ ఉద్యోగ అవకాశలు వస్తాయట. ఇన్ని రోజులు అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతున్నట్టయితే వీరి ఆరోగ్యం బాగవుతుందట.
ఈ రాశి వారికి దీపావళి తర్వాత ఈ రాశి అధిపతి బుధుడుతో పాటు అయిదు గ్రహాలు అనుకూలించనున్నాయి. దీంతో వీరిని విజయాలు వరుసగా వరిస్తాయని పండితులు చెప్తున్నారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ల ద్వారా విపరీతమైన లాభాలు అర్జిస్తాయరట. బ్యాంక్ బ్యాలెన్స్ హఠాత్తుగా పెరుగుతుందట. ఇంకా ఇంట్లో పెళ్లి తదితర శుభకార్యలు జరిగే అవకాశం ఉందట. సంతానం కోసం ఎదురుచూసే ఈ రాశి వారికి ఇప్పుడు మంచి సంతానం యోగం ఉందట.
ఈ రాశి వారికి దీపావళి తర్వాత బుధ గ్రహ సహకారంతో జీవితంలో పాజిటివ్ పెరుగుతుందట. దీంతో వీరి ఆర్థిక పరిస్థితి మునుపెన్నడూ లేని విధంగా టాప్ లోకి వెళ్తుందట. ఇన్నాళ్లు వేధించిన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయట. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఉన్న వారు ఉన్నత స్థితికి చేరుకుంటారట. ఇన్ని రోజులు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే.. ఇప్పుడు వారి ఆరోగ్యం బాగవుతుందట.
దీపావళి తర్వాత శుక్ర గ్రహ అనుకూలంతో తులారాశి వారికి రాజయోగాలు సిద్దిస్తాయట. ఇన్ని రోజులు వేధించిన భూవివాదాలు పరిష్కారం అవుతాయట. ఆస్తులు పొందుతారట.. షేర్ మార్చెట్‌లో లాభాలు చూస్తారట. ఈ రాశి వారికి ఈ టైంలో ప్రేమ, వివాహ యోగాలు ఉన్నట్టు పండితులు చెప్తున్నారు.
శని మరియు ఇతర గ్రహాల అనుకూలతతో ఈ రాశివారి జీవితం కొత్త దిశలో సాగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుందట. ఇక ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్న వారికి విజయాలు చేకూరుతాయట. విదేవీ యానం ఉందని పండితులు చెప్తున్నారు.
పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.