Mercury Influence: బుధుని శుభ సంచారంతో ఆ ఐదు రాశుల వారికి అదృష్ట కాలం రానుందట. ఆగస్టు తొమ్మిదో తేదీ నుంచి ఆ రాశుల వారికి అనుకున్న పనులు అనుకున్న విధంగా సక్సెస్ అవుతాయట. ఏ పని చేసినా కలిసి వస్తుందట. ఇన్ని రోజులు వాయిదా పడిన ప్రాజెక్టలు ఇక పట్టాలెక్కతాయని వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఇంతకీ ఆ ఐదు రాశులేవో..? వారికి పట్టబోయే అదృష్ట యోగం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. .
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆగస్టు తొమ్మిదో తారీఖున బుధుడు కర్కాటక రాశిలోకి వెళ్తున్నాడట. దీంతో ద్వాదశ రాశుల్లోని ఐదు రాశుల్లో జన్మించిన జాతకులకు మంచికాలం రానుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఆ ఐదు రాశుల వారు తమ మాట శక్తితో ప్రజల మనసులను గెలుచుకుంటారు. కెరీర్ పరంగా వ్యక్తిగతంగా, కుటుంబ సంబంధాల్లో అనూహ్యమైన మార్పులు కనిపిస్తాయి. ఆ ఐదు రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి: ఈ రాశి జాతకులు ఆగస్టు తొమ్మిదో తేదీ నుంచి శుభకాలం ప్రారంభం కానుందట. ఈ సమయంలో మీరు చేసే ప్రతి మాట చక్కగా ప్రభావం చూపుతుంది. క్రియేటివ్ ఫీల్డ్‌లో ( సినిమా, కళా) ఉన్న వారికి శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి. ముఖ్యమైన కమ్యూనికేషన్ల విషయంలో విజయం సాధిస్తారు. మీలోని నైపుణ్యాలకు ప్రజల ఆదరణ లభిస్తుంది.
కర్కాటక రాశి: ఈ రాశి జాతకులకు వచ్చే తొమ్మిదో తారీఖు నుంచి బుధుడు లగ్న స్థానంలో ఉదయిస్తుండటం వల్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మీకు ఎదుటి వ్యక్తులతో ఎలా మాట్లాడాలో.. ఎలా సమర్థించుకోవాలో తెలుస్తుంది. మీలోని వ్యక్తిత్వం ఉజ్వలంగా ప్రకాశిస్తుంది. ఎదుటి వారిలో మీపై ఉన్న అభిప్రాయం మారి మీకు ఉన్నత స్థానం లభిస్తుంది. మీకు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.
తులా రాశి: ఈ రాశి జాతకులకు ఆగస్టు 9 నుంచి అదృష్టయోగం రానుంది. మీ లైఫ్‌లో మెరుగైన మార్పులు మొదలవుతాయి. సీనియర్ల మద్దతుతో కీలక బాధ్యతలు పొందుతారు. పదోన్నతికి అనుకూలంగా మారుతుంది. మీ కార్యాలయంలో మీకు ప్రాముఖ్యత పెరుగుతుంది. కీలక నిర్ణయాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి శుభ కాలం మొదలు కానుంది. వీరికి దూర ప్రయాణాల ద్వారా లాభాలు వస్తాయి. వాణిజ్య రంగాల్లో ప్రయోజనకరమైన ఒప్పందాలు కుదురతాయి. రచన, ప్రచురణ, విద్య రంగాలలో ఉన్నవారికి ఆశించిన అభివృద్ధి ఉంటుంది. మానసికంగా ధృడంగా ఉంటారు. మతపరమైన చింతన పెరుగుతుంది.
మీన రాశి: మీన రాశి జాతకులకు వచ్చే ఆగస్టు నుంచి మంచి కాలం మొదలు కానుందని పండితులు చెప్తున్నారు. ఈ టైంలో మీరు కమ్యూనికేషన్ ద్వారా ఇతరుల మద్దతు పొందుతారు. మీ పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. అలాగే మీడియా, సోషల్ మీడియా, సినీ, వినోద రంగాలలో ఉన్నవారికి ఇది గోల్డెన్ టైమ్. ఈ సమయంలో మీరు వ్యక్తిగతంగా లోతైన భావోద్వేగాలను వ్యక్తపరచగలుగుతారు. ప్రజల హృదయాన్ని స్పర్శించే విషయాలు చేయగలుగుతారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే