BigTV English

Chandra Gochar 2025: చంద్రుడి సంచారం.. ఈ 4 రాశుల వారు తస్మాత్ జాగ్రత్త

Chandra Gochar 2025: చంద్రుడి సంచారం.. ఈ 4 రాశుల వారు తస్మాత్ జాగ్రత్త

Chandra Gochar 2025: హిందూ క్యాలెండర్ ప్రకారం ఆగస్ట్ 2 వ తేదీ ఆదివారం నాడు చంద్రుడు వృషభ రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. దీనిని జ్యోతిష్య శాస్త్రంలో బలహీనమైన రాశిగా పరిగణిస్తారు. ఈ పరిస్థితి ఆగస్టు 5 వరకు ఉంటుంది. ఆ తర్వాత చంద్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడిని మనస్సు, భావోద్వేగం, మానసిక శక్తికి ప్రతినిధి గ్రహంగా పరిగణిస్తారు కాబట్టి.. బలహీన స్థితిలో ఈ సంచారం 12 రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. ఇది కొన్ని రాశుల వారికి సమస్యలను కలిగిస్తుంది. ఇంతకీ చంద్రుడి సంచారం ఏ ఏ రాశుల వారికి సమస్యలను కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.


మేషరాశి:
చంద్రుడి రాశి మార్పు మేష రాశి వారికి సమస్యలను కలిగిస్తుంది. ఫలితంగా మీకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఈ సమయంలో మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ పనిలో మీరు ఆశించిన ఫలితాలను పొందలేకపోవచ్చు. అధిక పనిభారం మానసిక అలసటకు కారణమవుతుంది. మీకు కడుపు, మానసిక అసమతుల్యత సమస్యలు పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. శివుడికి నీటిని సమర్పించి “ఓం నమః శివాయ” అని జపించండి. సమస్యలు కొంతవరకు దూరం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

మిథున రాశి:


చంద్రుడి సంచారం మిథున రాశి వారికి సమస్యలను తెచ్చి పెడుతుంది. అంతే కాకుండా ఈ సమయంలో మీరు శత్రువుల కారణంగా సమస్యలు ఎదుర్కోవలసి కూడా వస్తుంది. పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఖర్చుకు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అనవసరం అయిన వస్తువులను కొనుగోలు చేస్తారు. తల్లిదండ్రులతో విభేదాలు ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సంయమనం పాటించాల్సిన సమయం ఇది. పెట్టుబడుల్లో కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.శివలింగంపై పాలు అర్పించి “ఓం చంద్రాయ నమః” అని జపించడం వల్ల కొంత వరకు ఉపశమనం లభిస్తుంది.

కర్కాటక రాశి:
చంద్రుడు అధిపతి అయిన రాశి మారడంతో మీ భావోద్వేగ అసమతుల్యత పెరుగుతుంది. అంతే కాకుండా విద్య ,ఉద్యోగం విషయాల్లో బలహీనతలు ఎక్కువవుతాయి. తల్లిదండ్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. డబ్బు పరమైన నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండండి. అంతే కాకుండా దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న వారు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇలాంటి సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించి నీటిని దానం చేయండి. మంచి ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

Also Read: శ్రావణ మాసంలో చివరి సోమవారం ఈ పూజ చేస్తే.. సకల సంపదలు

ధనస్సు రాశి:
చంద్రుడి సంచారం వల్ల ధన నష్టం పెరుగుతుంది. అంతే కాకుండా వృధా ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ప్రతికూల సహవాసానికి దూరంగా ఉండండి. పరువు నష్టం జరిగే అవకాశాలు కూడ ఉన్నాయి. మీరు కోర్టు కేసులలో చిక్కుకోవచ్చు, జాగ్రత్తగా ఉండండి. పేదలకు తెల్లని బట్టలు, బియ్యం దానం చేయండి. ఇలా చేయడం వల్ల కొంత వరకు ఉపశమనం కూడా లభిస్తుంది.

Related News

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు. (20/09/2025)               

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు. (19/09/2025)

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు. (18/09/2025)

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు.. (17/09/2025)

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (16/09/2025)

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు. (15/09/2025)

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలం (సెప్టెంబర్‌ 14 – సెప్టెంబర్‌ 20)

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (14/09/2025)

Big Stories

×