Mrunal Thakur: సీరియల్ నటిగా తన ప్రయాణం మొదలుపెట్టి అనంతరం సినిమా అవకాశాలను అందుకుంటూ ప్రస్తుతం వరుస బాలీవుడ్, తెలుగు సినిమాలలో నటిస్తూ, కెరియర్ పరంగా ఏమాత్రం తీరిక లేకుండా గడుపుతున్న వారిలో నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)ఒకరు. మరాఠీ బుల్లితెర సీరియల్ ద్వారా మొదలైన ఈమె సినీ ప్రయాణం ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగులో కూడా పలు సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా మృణాల్ కు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇటీవల ఈమెతను 34వ పుట్టినరోజు (Birthday)వేడుకలను జరుపుకున్న సంగతి తెలిసిందే.
సింపుల్ గా ఉన్న… ధర మాత్రం…
ఆగస్టు 1వ తేదీ మృణాల్ తన పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఈమె ధరించిన డ్రెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ డ్రెస్ చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ, దీని ఖరీదు మాత్రం సోషల్ మీడియాలో చర్చలకు కారణమైంది. మరి ఈమె పుట్టినరోజు సందర్భంగా ధరించిన ఈ డ్రెస్ ధర(Derss Cost) తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే.మృణాల్ పుట్టినరోజు సందర్భంగా లూయిస్ విట్టన్(Louis Vuitton) ఫాల్-వింటర్ 2022 కలెక్షన్ నుండి అద్భుతమైన పూల జాక్వర్డ్ మినీ డ్రెస్ ధరించారు.
రూ. 2.83 లక్షలా?
ఈ దుస్తులలో నటి మృణాల్ చాలా హాట్ లుక్ లో కనిపిస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారడంతో ఈ డ్రెస్ ధర తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.ఇటలీలో తయారు చేయబడిన ఈ డ్రెస్ ధర ₹2.83 లక్షలు అనే విషయం తెలియడంతో అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. చూడటానికి ఇంత సింపుల్ గా కనిపిస్తున్న ధర మాత్రం భారీగా ఉందంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఇక ఈమె ఈ ఒక్క డ్రస్సుతో ఒక మధ్య తరగతి కుటుంబం ఆరు నెలల పాటు ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
క్రిస్మస్ సందర్భంగా డెకాయిట్…
ఇకపోతే సెలబ్రిటీలు ఈ విధమైన బ్రాండెడ్ ఖరీదైన వస్తువులను ఉపయోగించడం సర్వసాధారణం. వీటి ధరలు సామాన్యులకు కాస్త ఎక్కువగా అనిపించినా సెలబ్రిటీలకు మాత్రం కామన్ అని చెప్పాలి. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె తెలుగులో హీరో అడివి శేష్(Adivi Sesh) నటించిన డెకాయిట్ (Dacoit) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబర్ నెలలో క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమా విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం వెలబడలేదు.
Also Read: Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా… తెగ కష్టపడుతుందిగా?