Surya Gochar: ఆగస్టు 30వ తేదీ రాత్రి 9:52 గంటలకు.. గ్రహాలకు అధిపతి సూర్యుడు సింహరాశిలో ఉన్నప్పుడు పూర్వఫల్గుణ నక్షత్రంలో ప్రవేశించాడు. ఈ మార్పు వేద జ్యోతిష్య శాస్త్రంలో చాలా ముఖ్యమైందిగా చెబుతారు. ఎందుకంటే సూర్యుడు విశ్వాసం, నాయకత్వం, శక్తిని సూచిస్తుండగా.. పూర్వఫల్గుణ నక్షత్రం అందం, ప్రేమ, సృజనాత్మకత ,ఆనందంతో ముడిపడి ఉంటుంది.
ఈ సంచార ప్రభావం అన్ని రాశులపై వివిధ రూపాల్లో కనిపిస్తుంది. కొంతమంది జీవితాల్లో.. ఈ మార్పు కొత్త ప్రారంభాలను, సంబంధాలను బలోపేతం చేయడం, కెరీర్ పురోగతిని తెస్తుంది. మరికొందరు సూర్యుని తీవ్రమైన శక్తి కారణంగా స్వీయ నిగ్రహం, సమతుల్యతను కాపాడుకోవలసి ఉంటుంది. కాబట్టి సూర్యుని ఈ రాశి మార్పు ఏ 5 రాశులకు అత్యంత శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
ఆగస్టు 30, 2025న సూర్యుడు పూర్వఫల్గుణ నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల మీ ఐదవ ఇంటిపై ప్రభావం పడుతుంది. మీ జీవితం విద్య, సృజనాత్మకత, ప్రేమ ,పిల్లలతో ముడిపడి ఉంటుంది. ఈ సమయంలో మీ ఆలోచన, సృజనాత్మకత పెరుగుతాయి. విద్యార్థులు చదువులో విజయం సాధించవచ్చు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో ఆనందం పెరుగుతుంది. అంతే కాకుండా ఉద్యోగస్తులకు వారి పనిలో గౌరవం, ప్రశంసలు లభిస్తాయి.
సింహరాశి:
సూర్యుడు సింహరాశిలో ఉండి పూర్వఫల్గుణి నక్షత్రంలో సంచరిస్తాడు. కాబట్టి ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం గరిష్ట స్థాయిలో ఉంటుంది. ఈ సంచారం మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా మీ నాయకత్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ కెరీర్‌లో మీకు కొత్త బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఇది మీ పురోగతికి ద్వారాలు తెరుస్తుంది. సామాజిక జీవితంలో మీ ప్రజాదరణ పెరుగుతుంది. అంతే కాకుండా మీ సంబంధాలు బలపడతాయి. సానుకూల పనులలో మీ శక్తిని ఉపయోగించుకోండి. అహంకారాన్ని నివారించడం ద్వారా వినయంగా ఉండండి. ఈ సమయం మీరు కొత్త విజయాలు సాధించడానికి సువర్ణావకాశం.
కన్య రాశి:
మీ రాశి పన్నెండవ ఇంట్లో సూర్యుడి సంచార వల్ల మీ ఖర్చులు, విదేశాలకు సంబంధించిన విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో.. విదేశీ ప్రయాణ అవకాశాలు ఉంటాయి. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే.. ఈ సమయం ఆధ్యాత్మిక పురోగతికి, మానసిక శాంతిని పొందడానికి శుభప్రదం. కానీ ఖర్చులను ఖచ్చితంగా నియంత్రించాలి. లేకపోతే అనవసరమైన ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. మీ ఆరోగ్యం, మానసిక శాంతి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండండి. మీరు ప్రణాళిక వేసిన తర్వాత చర్యలు తీసుకుంటే.. ఈ కాలం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.
ధనస్సు రాశి:
మీ తొమ్మిదవ ఇంట్లో సూర్యుడి సంచారం అదృష్టం, ఉన్నత విద్య, మతం, సుదీర్ఘ ప్రయాణాలతో ముడిపడి ఉంటుంది. ఈ సమయం మీరు కొత్త ప్రణాళికలను ప్రారంభించడానికి, విదేశాలకు వెళ్లడానికి లేదా మత పరమైన కార్యకలాపాలలో పాల్గొనడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశం ఉంది. ఇది వారి ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. వ్యాపార తరగతికి మంచి పెట్టుబడి అవకాశాలు లభిస్తాయి. అంతే కాకుండా వ్యాపార విస్తరణ సాధ్యమవుతుంది. మీ లక్ష్యాలపై దృఢంగా దృష్టి పెట్టండి. అంతే కాకుండా ఓపికగా ఉండండి.
మీన రాశి:
సూర్యుడు ఆరవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఇది ఆరోగ్యం, సామర్థ్యం, పోటీ, సేవలకు సంబంధించింది. ఈ సమయంలో మీ సామర్థ్యం పెరుగుతుంది. అంతే కాకుండా మీరు మీరు మీ ప్రత్యర్థులను లేదా పోటీదారులను గెలుస్తారు. ఉద్యోగంలో మీ కృషికి తగిన ఫలితాన్ని పొందుతారు. అంతే కాకుండా ఆరోగ్యంలో కూడా మెరుగుదల ఉంటుంది. ఈ సమయంలో మీ లైఫ్ స్టైల్ క్రమబద్ధంగా ఉంచుకోవడం, ఒత్తిడిని నివారించడం చాలా ముఖ్యం. స్వీయ సంరక్షణపై దృష్టి పెట్టండి .సానుకూల ఆలోచనను కొనసాగించండి. తద్వారా ఈ సమయం మీకు సంతోషంగా ఉంటుంది.