BigTV English

Lokesh Kanagaraj: సక్సెస్ అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర డబ్బులు రావడం కాదు, కూలీ రిలీజ్ తర్వాత లోకేష్ ఫస్ట్ ఇంటర్వ్యూ

Lokesh Kanagaraj: సక్సెస్ అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర డబ్బులు రావడం కాదు, కూలీ రిలీజ్ తర్వాత లోకేష్ ఫస్ట్ ఇంటర్వ్యూ

Lokesh Kanagaraj: కేవలం తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా ఇష్టమైన దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇప్పటివరకు లోకేష్ దర్శకత్వం వహించిన ప్రతి సినిమా తెలుగులో కూడా విడుదలైంది. కొన్ని సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. ముఖ్యంగా చాలామందికి ఖైదీ సినిమా ఇప్పటికీ ఫేవరెట్.


నగరం సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన లోకేష్ మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును సాధించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఖైదీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మాస్టర్ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా ఒక రకంగా మంచి పేరుని తీసుకొచ్చింది. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాతో అందరికీ షాక్ ఇచ్చాడు లోకేష్. లోకేష్ సినీమాటిక్ యూనివర్స్ అంటూ సౌత్ సినిమా ఆడియన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చాడు.

సక్సెస్ అంటే డబ్బులు రావడం కాదు 


లోకేష్ అద్భుతమైన సినిమాలను తీయడం మాత్రమే కాకుండా ఇంటర్వ్యూస్ లో కొన్ని మంచి విషయాలు కూడా చెబుతుంటాడు. ముఖ్యంగా కూలీ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే వాటి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అది ఎన్ని కోట్లు సాధిస్తుందో నాకు అనవసరం బట్ ప్రేక్షకులు పెట్టే 150 రూపాయలకి నేను న్యాయం చేస్తే చాలు అనుకుంటాను అని లోకేష్ చెప్పాడు. అయితే కూలీ సినిమాకు ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.

మరోసారి దీని గురించి స్పందించాడు లోకేష్. సక్సెస్ అంటే బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాకు కోట్లు కోట్లు రావడం కాదు. ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాను అందించడమే సక్సెస్. అది రెండు నిమిషాలు ఉన్న, మూడు నిమిషాలు ఉన్న, మూడు గంటలు ఉన్న ప్రేక్షకుడికి సినిమా అందించడమే సక్సెస్. బాక్స్ ఆఫీస్ అనేది కేవలం ప్రొడ్యూసర్స్ కోసం. ఒక దర్శకుడిగా నీ పని పట్ల ఎంత సిన్సియర్ గా ఉన్నావు ఎంత హానెస్ట్ గా ఉన్నావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటూ తెలిపాడు లోకేష్.

భారీ ఓపెనింగ్ కూలీ 

ఈ సినిమాకి విపరీతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. బాక్స్ ఆఫీస్ వద్ద టికెట్లు బుక్ అయ్యే విధానం చూస్తుంటే ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు వసూలు చేస్తుంది అని అందరూ ఊహించరు. కేవలం పాజిటివ్ టాక్ వస్తే చాలు ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది అని అనుకున్నారు. అయితే ఈ సినిమాకి యునానిమస్ గా పాజిటివ్ టాక్ రాలేదు. అలా అని ఫ్లాప్ అని టాక్ కూడా రాలేదు. మిక్స్డ్ టాక్ వచ్చింది. మొత్తానికి ఈ సినిమా దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.

Also Read: Kishkindhapuri: వెనక్కు తగ్గిన బెల్లంకొండ, కంటెంట్ చూసి భయమా? సినిమా మీద గౌరవమా?

Related News

Nag Ashwin: కల్కి లో ఆ స్టార్లు కలెక్షన్స్ కోసం కాదు… అయ్యో డైరెక్టర్ నాగ్ అశ్విన్ పరువు తీశాడే!

Lokesh kanagaraj : ఫ్యూచర్ లో అతను లేకుండా సినిమా చేయను, లోకేష్ కనగరాజ్ బిగ్గెస్ట్ స్టేట్మెంట్

OG – Pawankalyan: అసలు పండుగ రేపు మొదలుకానుంది, పవన్ ఫ్యాన్స్ కు పూనకాలే

Peddi First Single: పెద్ది ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్

Janhvi Kapoor: శ్రీదేవి హిట్ సినిమా రీమేక్ ఆలోచనలో జాన్వీ… వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×