Vish Yog 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాలు కాలానుగుణంగా తమ స్థానాన్ని మార్చుకుంటాయి. ఈ సమయంలో అవి జీవితంలో శుభ లేదా అశుభ ప్రభావాలను కలిగించే యోగాలను ఏర్పరుస్తాయి. ఈ గ్రహ సంచార ప్రభావం ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత పరిస్థితులపై మాత్రమే కాకుండా.. ప్రకృతి, పర్యావరణంపై కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో న్యాయాధిపతి అయిన శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఆగస్టు 12న చంద్రుడు కూడా మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఫలితంగా మాలవ్య, బుధాదిత్య రాజ్య యోగం ఏర్పడటంతో.. 12 రాశులపై తీవ్ర ప్రభావం పడుతుంది.
శని, చంద్రుల కలయిక జ్యోతిష్య శాస్త్రంలో ‘విష యోగం’ ఏర్పడుతుంది. ఈ యోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది. దీని ప్రభావం కారణంగా.. కొన్ని రాశులు డబ్బు నష్టం, మానసిక ఒత్తిడి, ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇలాంటి సమయంలో కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతే కాకుండా ఆలోచించి అడుగులు వేయాలి. ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
మేష రాశి వారికి విష యోగం అనేక సమస్యలను తెచ్చి పెడుతుంది. ఎందుకంటే ఇది మీ రాశి నుంచి పన్నెండవ ఇంట్లో ఏర్పడుతుంది. ఈ సమయంలో.. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఇది మీ ఆర్థిక సమస్యల్లోకి నెడుతుంది. అదృష్టం కూడా తక్కువ అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్యంలో పని చేసే వారు నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. ఆఫీసుల్లో జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ఇబ్బందులు పెరుగుతాయి. ఈ సమయంలో.. మీపై తప్పుడు ఆరోపణలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. సంవత్సరం మొదటి వారంలో ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకుండా ఉండండి.
సింహ రాశి:
సింహ రాశి వారికి, ఈ విష యోగం ఎనిమిదవ ఇంట్లో ఏర్పడుతుంది. ఇది సాధారణంగా ఆకస్మిక సవాళ్లను సూచిస్తుంది. ఈ సమయంలో.. ఒక రహస్య వ్యాధి లేదా ఆరోగ్య సంబంధిత సమస్య తెరపైకి రావచ్చు. ఉద్యోగులు తమ పనిలో అడ్డంకులను ఎదుర్కుంటారు. ఆపీసుల్లో వాతావరణం ఒత్తిడి తో ఉంటుంది. భాగస్వామ్యం తో చేసే పనిలో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే.. మానసిక ఒత్తిడి , అశాంతి పెరుగుతాయి. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అంతే కాకుండా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపండి. అనవసరమైన విషయాల్లో తల దూర్చకండి.
Also Read: ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?
మీన రాశి:
మీన రాశి వారికి.. ఈ విష యోగం మీ లగ్న భావంలో నేరుగా ఏర్పడుతోంది. ఇది జీవితంలోని అనేక రంగాలలో ఉద్రిక్తతను కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో సీనియర్లు లేదా జూనియర్లతో విభేదాలు ఏర్పడతాయి. వైవాహిక జీవితంలో కూడా వాదనలను నివారించడం ముఖ్యం. లేకపోతే సంబంధాలలో ఉద్రిక్తతలు పెరుగుతాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ సమయంలో ఏదైనా పాత లేదా కొత్త సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది.