Virender Sehwag: సచిన్ టెండూల్కర్.. ఈ పేరు వింటేనే క్రీడాభిమానులలో ఏదో తెలియని వైబ్రేషన్స్. సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ కి దిగితే పూనకమే. 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న ఈ మాస్టర్ బ్లాస్టర్.. క్రికెట్ కె వన్నె తెచ్చాడు. 16 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. చరిత్రపుటల్లో సచిన్ టెండూల్కర్ కి ఓ ప్రత్యేక పేరు ఉంది. సచిన్ ని ఇండియాలో క్రికెట్ దేవుడిగా పిలుస్తారు.
Also Read: Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు
ఇక క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ నమోదు చేసిన రికార్డుల గురించి రాయాలంటే ఓ పుస్తకం కూడా సరిపోదు. వాల్యూమ్ 1, 2, 3 అంటూ ఓ పెద్ద గ్రంథమే రాయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్ లో సచిన్ 100 సెంచరీలు చేసిన మొట్టమొదటి క్రికెటర్ గా సరికొత్త చరిత్ర లిఖించాడు. ఒక సంవత్సరంలో 365 రోజులు ఉంటే.. ప్రతిరోజు సచిన్ టెండుల్కర్ ఏదో ఓ రికార్డు సాధించేవాడు. క్రికెట్ కి సచిన్ చేసిన సేవలకు భారత ప్రభుత్వం అతడిని భారతరత్నతో గౌరవించింది. ఇక తన కెరీర్ లో ఆరు వన్డే వరల్డ్ కప్ ఆడిన సచిన్ టెండుల్కర్.. 2003 ప్రపంచ కప్ లో మాత్రం చెలరేగాడు. సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగిన ఆ మెగా టోర్నీలో సచిన్ ఫామ్ అదుర్స్.
ఆ వరల్డ్ కప్ లో మొత్తం 11 మ్యాచ్ లు ఆడిన సచిన్ టెండూల్కర్.. 674 పరుగులు సాధించాడు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కండరాలు పట్టేసినా.. ఆ నొప్పిని పక్కన పెట్టి 98 పరుగులు సాధించి భారత్ గెలుపులో కీలకంగా మారాడు. అయితే చాలామందికి పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో సచిన్ కండరాల నొప్పి గురించి మాత్రమే తెలుసు. కానీ సూపర్ సిక్స్ మ్యాచ్ లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ గురించి, ఈ మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ ఎదుర్కొన్న తీవ్ర అనారోగ్య సమస్య గురించి ఎవరికి తెలియదు. దీని గురించి తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
Also Read: Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6
“శ్రీలంకతో జరిగిన మ్యాచ్ సమయంలో అతడు డయేరియా బారిన పడ్డాడు. దీంతో ఓ 500 కేజీల బరువు మోస్తున్న వ్యక్తి ఎలాగైతే నిలబడలేడో.. అలా అతడి పరిస్థితి తయారయింది. ఇక పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో బాగా అలసిపోవడంతో.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ కి కోలుకునేందుకు పెద్ద మొత్తంలో ద్రవపదార్థాలు తీసుకున్నాడు. దీంతో నీళ్ల విరేచనాలు మొదలయ్యాయి. ఆ క్రమంలో ఎనర్జీ డ్రింక్ లో ఉప్పు కలుపుకొని తాగినా ప్రయోజనం కనిపించలేదు. అయినప్పటికీ శ్రీలంకతో మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతడు డైపర్ వేసుకుని మరీ బ్యాటింగ్ కి వచ్చాడు” అంటూ సచిన్ కి సంబంధించిన ఓ సీక్రెట్ ని బయటపెట్టాడు సెహ్వాగ్.
?utm_source=ig_web_copy_link