Conflict Reasons: ఇంట్లో తరుచూ గొడవలు జరుగుతున్నాయా..? మనఃశాంతి ఉండటం లేదా..? ఎప్పుడూ కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వస్తున్నాయా..? ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వేధిస్తున్నాయా..? ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా..? అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందా..? ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా మీ సమస్యలు తీరడం లేదా..? అయితే ఆ ఆరు కారణాలు అయ్యుండొచ్చు అంటున్నారు పండితులు. ఇంతకీ ఆ కారణాలేంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
పరిహార శాస్త్రం ప్రకారం ఎన్ని పూజలు చేసినా ఇంట్లో తరుచూ ఏదో ఒక కారణం చేత గొడవలు జరుగుతుంటాయి. ఎన్ని డబ్బులు సంపాదించినా నెల తిరగేసరికి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో మానసికమైన సంఘర్షణ ఇంటి సభ్యులను వేధిస్తూ ఉంటుంది. అయితే చాలా మంది ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా తమ సమస్యలు తీరడం లేదని వాపోతుంటారు. అయితే రోగం ఒక దగ్గర ఉంటే చికిత్స మరో దగ్గర చేస్తే ఎలా అన్నట్టు సమస్య మీ ఇంట్లోనే మీలోనే పెట్టుకుని సమస్యను పరిష్కరించుకోకుండా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా నిష్పలం అంటున్నారు పండితులు. ముందు ఇంట్లో ఉన్న ఆరు సమస్యలను అధిగమిస్తే మీకు తిరుగుండదని చెప్తున్నారు. ఆ ఆరు సమస్యలేంటో వాటిని ఎలా అధిగమించాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
నిత్య పూజలు చేయకపోవడం: ప్రతిరోజు ఉదయం ఇంట్లో దేవుని పూజలు చేయకపోవడం వల్ల ఇంట్లో ఎప్పుడూ నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. దీని వల్ల ఎప్పుడూ ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య మనఃస్పర్థలు వస్తుటాయి.
గడప ముందు చెప్పులు వదలడం: చాలా మందికి బయటి నుంచి రాగానే ఇంటి ముఖద్వారం వద్ద చెప్పులు వదలడం అలవాటుగా ఉంటుంది. ఎప్పుడూ ఇంటి ముందు కుప్పలు తెప్పలుగా చెప్పులు వదలే ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆ ఇంటిని ఆర్థిక సమస్యలు వేధిస్తూనే ఉంటాయట.
శుభ్రం చేయకపోవడం: ప్రతి రోజు ఇంటిని సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి వస్తుంది. అందువల్ల ఇంట్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. మనఃశాంతి కరువవుతుందట. అందుకే ఇంటిని ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.
నెగెటివ్ జాతకం ఉండటం: కుటుంబ సభ్యుల్లో ఎవరి జాతకంలోనైనా ఆరవ ఇంటికి అంగారకుడు అధిపతి అయితే కుటుంబంలో ఎప్పుడూ గొడవలు జరుగుతుంటాయి. అందువల్ల జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అందుకు రెమెడీలు తెలుసుకుని శాంతి చేయించుకోవడం మంచిది అంటున్నారు పండితులు.
వాస్తు దోషం: ఇంటి నిర్మాణం సమయంలో వాస్తు చూడకుండా ఇల్లు కడితే ఆ ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుదట. అందువల్ల ఆ ఇంట్లో ఎన్ని పూజలు చేసినా నెగటివ్ ఎనర్జీ తిష్ట వేస్తుందట. దీంతో ఆ ఇంట్లో ఎప్పుడూ గొడవలు, మనఃస్పర్థలు ఏర్పడతాయట.
సాయంత్రం నిద్ర: ఏ ఇంట్లో అయితే ఆ ఇంటి కుటుంబ సభ్యులు సాయంత్రం పూట పడుకుంటారో ఆ ఇంట్లో గొడవలు తరుచూ జరుగుతూనే ఉంటాయట. ఇక ఆ ఇంట్లో మనఃశాంతి ఉండదు. ఆ ఇంటి పెద్దను ఆర్థిక సమస్యలు వేధిస్తాయట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: న్యూమరాలజీ ప్రకారం ఆ తేదీల్లో పుట్టిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట