Wealth Numerology: న్యూమరాలజీ ప్రకారం ఆ తేదీల్లో పుట్టిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట. వారి జీవితంలో ఎన్ని కష్టాల్లో ఉన్నా.. ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నా వారి జాతకచక్రం ఎప్పటికైనా వారిని కోటీశ్వరుడిని చేస్తుందట. వారు పుట్టిన తేదీయే వారికి అంతటి పవర్ తీసుకొస్తుందట. ఇంతకీ ఆ నెంబర్లేంటి..? ఆ వ్యక్తులు ఎలా జీవితంలో ఎదుగుతారు. ఇలాంటి ఇంట్రస్టింగ్ విషయాలను ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతీయ సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన తేదీలలో పుట్టిన వారు ఎప్పటికైనా ధనవంతులు అవుతారట. వారు పుట్టినప్పుడు ఎంతటి పేదరికంలో ఉన్నప్పటికీ వారికి వయస్సు పెరిగే కొద్దీ.. ఉదయిస్తున్న సూర్యుడిలాగా వారి జీవితం కూడా అభివృద్ది పథంలో దూసుకుపోతుందట. అయితే ఎలాంటి తేదీల్లో పుడితే ఇలాంటి భాగ్యం కలుగుతుందో.. వారి జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
1వ తేదీ: ఏ నెలలోనైనా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారిని ఒకటవ నెంబర్ జాతకులు అంటారు. వీరికి జీవితంలో ఎదగాలనే పట్టుదల, కసి చాలా ఎక్కువగా ఉంటాయి. వీరికున్న ఈ పట్టుదలే వీరిని ఎప్పటికైనా కోటీశ్వరుడిని చేస్తుందట. పైగా ఈ తేదీలలో పుట్టిన వారికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. గొప్ప రాజకీయ నాయకులు అవుతారు. వీరు వ్యాపారంలో కూడా బాగా రాణిస్తారు. ఎలాంటి వ్యాపారం చేసిన వీరికి కలిసి వస్తుందట. అందువల్ల కోట్ల ఆస్థిని సంపాదించోగలరు ఈ జాతకులు అని న్యూమరాలజిస్టులు చెప్తున్నారు.
2వ తేదీ: ఏ నెలలోనైనా 11, 22, 29 తేదీల్లో పుట్టిన వారిని రెండవ నెంబర్ జాతకులు అంటారు. వీరు తమలోని మల్టీఫుల్ లక్షణాల వల్ల బాగా సక్సెస్ అవుతారు. వీరికి అసాధారణమైన లౌకిక తత్వం ఉంటుంది. ఎంతటి సమస్యనైనా చాలా కూల్‌గా పరిష్కరించే అలవాటు ఈ నెంబర్ జాతకులకు ఉంటుంది.
8వ తేదీ: ఏ నెలలోనైనా 8, 17, 26 తేదీల్లో పుట్టిన వాళ్లను ఎనిమిదవ నెంబర్ జాతకులు అంటారు. వీరు కష్టపడి పని చేయడానికి లక్ష్యాలను చేరుకోవడానికి ఇష్టపడతారు. వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయ. అందువల్ల వీరు పెద్ద రాజకీయ నాయకులుగా రాణిస్తారు. వీళ్లు ఆర్థికంగా గ్రాండ్ సక్సెస్ అవుతారు. ఎప్పటికైనా కోట్లు సంపాదించే జాతకులు ఈ నెంబర్ వ్యక్తులు.
9వ తేదీ: ఏ నెలలోనైనా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారిని తొమ్మిదవ నెంబర్ జాతకులు అంటారు. వీరు వృత్తి పరంగా అలాగే వ్యాపార పరంగా చాలా స్నేహంగా ఉంటారు. అందువల్ల వీళ్లకు ప్రతి పనిలోనూ లాభం కలుగుతుంది. వీరిలో అధ్యాత్మిక ధోరణి కాస్త ఎక్కువగానే ఉంటుంది. మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ నెంబర్ జాతకులు ఆర్థికంగా సక్సెస్ అవుతారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: న్యూమరాలజీ ప్రకారం ఆ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఉత్తమ భార్యలు అవుతారట