Horoscope Today : ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఆగస్ట్ 4వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. మీకోపాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. మీరు అనుకున్న మార్గాలలో పెట్టుబడులు పెట్టడానికి అనువైన కాలం. కొత్త మిత్రులు పరిచయం అవుతారు. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామి ద్వారా విలువైన బహుమతులు అందుకుంటారు. ఈ రోజు మీ లక్కీ నెంబర్ మూడు. గణపతి ఆలయాన్ని సందర్శిచడం మంచిది.
వృషభ రాశి: ఈ రాశివారు ఈరోజు మానసిక ఆందోళనకు గురవుతారు. మిత్రులతో గడపటం వల్ల ఆ సమస్య నుంచి దూరమవుతారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో సంతృప్తి కరంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచి సమయం. మీయొక్క వ్యక్తిగత సమయాన్ని జీవితభాగస్వామికి కేటాయించడం ద్వారా మీబంధం మరింతగా బలపడుతుంది. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం వల్ల అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఇవాళ మీ అదృష్టసంఖ్య రెండు.
మిథున రాశి: ఈ రాశివారికి ఇవాళ అకస్మిక ధనలాభ సూచనలున్నాయి. నూతన వ్యక్తితో మీకు పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయమే మీ నూతన వ్యాపారాలకు దారి తీస్తుంది. కుటుంబంలో సమస్యలకు కారణమైన భాగస్వామి మాటలను పట్టించుకోవద్దు. ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించాలి. లేదంటే అనారోగ్య సూచనలు ఉన్నాయి. మీ అదృష్ట సంఖ్య 9, రంగు ఎరుపు.
కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు శారీరకంగా నీరసానికి గురికావడం జరుగొచ్చు ఆహార విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోగలరు. మీదగ్గరి స్నేహితుల వద్ద రుణాలు చేసే అవకాశం కలదు. మీ కుటుంబ సభ్యులతోనూ మరియు ఆత్మీయులతోనూ గడపే సమయంలో వారి ప్రవర్తనను గమనించగలరు. మీరు కలవాలనుకున్న వ్యక్తులను కలవలేక పోవడంతో నిరాశకు గురవుతారు. ఈరోజు శివాలయాన్ని దర్శించుకోవడం శుభసూచికం. మీ అదృష్టసంఖ్య నాలుగు. రంగు తెలుసు రంగు.
సింహ రాశి: కుటుంబ వ్యవహారాలతో ఆందోళన చెందుతారు. మీసంతానం వలన సమయానికి ఆర్థిక లాభం చేకూరుతుంది. అతిథుల రాకతో కుటుంబమంతా సందడిగాఉంటుంది. ఈరోజు వృత్తి వ్యాపారాలకు విరామాన్నిచ్చి ఎంతో సందడిగా సమయాన్ని గడుపుతారు. మీ జీవిత భాగస్వామికి సంపూర్ణ సమయాన్ని కేటాయిస్తారు. ఇష్టదైవాన్ని ప్రార్థించగలరు. అదృష్టసంఖ్య2 , రంగు: తెలుపురంగు
కన్యా రాశి: మీ ఆధ్యాత్మికమైన ప్రవర్తనే మీమానసిక ఆరోగ్యానికి కారణం అదే మీజీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు. ఈరోజు మీరు సంపూర్ణమైన ఆర్థిక పరిపుష్టిని కలిగి ఉంటారు. మీరు పాత విషయాలకై ఆలోచిస్తూ విలువైన మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. నూతన అగ్రిమెంట్లు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అదృష్ట సంఖ్య:9 రంగు: పసుపు పచ్చ
ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట
తులా రాశి: మీ సౌమ్య ప్రవర్తనతో చుట్టూ ఉన్నవారిని ఆకర్షిస్తారు. అనవసరమైన ఖర్చులతో డబ్బు వృధా చేసుకుని తరువాత బాధపడుతారు. అవసరాలకు అందవలసిన డబ్బు అందదు కుటుంబలో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటాయి. మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. మానసికంగా దృఢంగా ఉండవలసిన అవసరం ఉంది. శివాలయంలో అవుపాలు ఇవ్వడం శుభసూచకం. అదృష్ట సంఖ్య:3 రంగు: బూడిదరంగు
వృశ్చిక రాశి: ఈ రాశివారు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం జరుగుతుంది ఔషధ సేవనం తప్పకపోవచ్చు ముఖ్యమైన ప్రయాణాలు రద్దు చేసుకునే అవకాశం ఉంది. నూతన పెట్టుబడుల విషయంలో వెనక్కి తగ్గడం మంచిది. తద్వారా ఆర్థిక లాభాలు గడిస్తారు. ఒంటరిగా గడపటానికి ఇష్టపడుతారు. ప్రకృతి ఒడిలో గడపటం వలన మానసిక ఆనందాన్ని పొందుతారు. అదృష్ట సంఖ్య 5 రంగు: నీలంరంగు
ధనస్సు రాశి: మీ స్నేహితుల ద్వారా కొత్త వ్యక్తి పరిచయమవుతారు. వారి ద్వారా మీ కార్యక్రమాలను నేర్పుతో సాధించుకుంటారు. ఎంతో కాలంగా రావాల్సిన మొండిబాకీలు వసూలు అయ్యే అవకాశం ఉంది. మీ ఆకర్షణీయమైన ప్రవర్తనతో కొత్త పరిచయాలు ఏర్పరుచుకుంటారు. ఇతరులకు వీలయినంతగా సహాయం చేయండి. మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. అదృష్ట సంఖ్య 2 రంగు, పాలపిట్ట రంగు.
మకర రాశి: మీరు పని చేసే చోట మీ నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది. ఉన్నతాధికారులసమక్షంలో మీ శక్తిని నిరూపించుకోవాల్సి ఉంటుంది. డబ్బు సంపాదనకై కొత్తమార్గాలను అన్వేషిస్తారు. కుటుంబసభ్యులతో కలసి ఆనందంగా గడుపుతారు. మీకు కాబోయే జీవిత భాగస్వామిని కలిసే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితంపై అసంతృప్తితో ఉంటారు. మీ ఆలోచనలన్నీ కెరియర్‌లో ఎదగడానికి ఉపయోగించి అనుకున్న ఫలితాలు సాధించవచ్చు. మీ కులదైవాన్ని తలచుకుని అడుగు ముందుకు వేయండి. అదృష్ట సంఖ్య:2 రంగు: నలుపురంగు
కుంభ రాశి: ఇతరులపై మీ అసూయను తగ్గించుకోవడం వలన సత్సంబంధాలను కొనసాగించగలరు. తోటివారి ఎదుగుదలను ప్రశంసించండి. ఈరోజు మీరు ఎటువంటి లావాదేవీలు జరిపినా నష్టపోయే అవకాశం ఉంది. ప్రత్యేకించి ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామి అభిప్రాయాన్ని స్వీకరించడం ద్వారా ఆనందకర సమయాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉండటం వల్ల అంతా మంచి జరుగుతుంది. అదృష్ట సంఖ్య:8 రంగు:ముదురునీలం
మీన రాశి: ఇంటి వద్ద పనిచేసే సమయంలో జాగ్రత్త వహించడం మంచిది. ప్రత్యేకమైన వస్తువు ద్వారా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మీ విలువైన వస్తువులు వాలెట్ మొబైల్ లాంటివి కోల్పోయే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమగా సమయాన్ని గడపటం వలన సంపూర్ణ ఆనందాన్ని పొందుతారు. మీరు హాజరు కావాల్సిన సమావేశాల్లో కొత్త ఆలోచనలతో ఉన్నతస్థాయిని చేరుకుంటారు. మీ ఎదుగుదలను అడ్డుకునేవారికి దూరంగా ఉండటం మంచిది. వేంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. అదృష్ట సంఖ్య 6 రంగు: ముదురు పచ్చ
ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే