OG Single : సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఓజి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. సుజిత్ కూడా స్వతహాగా పవన్ కళ్యాణ్ అభిమాని. పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఎలా చూడటానికి ఇష్టపడతారు అలానే చూపించే ప్రయత్నం చేస్తుంటారు పవన్ ను అభిమానించే దర్శకులు. గతంలో హరీష్ శంకర్ కూడా గబ్బర్ సింగ్ సినిమా అదే కోవాలో చేసి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సాధించాడు.
గబ్బర్ సింగ్ సినిమా విడుదలైనప్పుడు, హిట్ అయిన జోష్ లో సుజిత్ పవర్ స్టార్ అని అరిచిన వీడియోలు కూడా వైరల్ గా మారాయి. ఇప్పుడు పవర్ స్టార్ తో ఏకంగా సుజిత్ సినిమా చేస్తున్నాడు. సుజిత్ ఒక రీమేక్ సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లారు. ఆ తరుణంలో ఏమైనా కథ ఉందా అని అడిగినప్పుడు సుజిత్ ఓజీ కథను చెప్పారు. ఈ కథ విపరీతంగా నచ్చడంతో సినిమాను పట్టాలెక్కించారు.
సాంగ్ లో డీటెయిల్స్
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో పవన్ కళ్యాణ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత పవన్ కెరియర్ లో తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు పడ్డాయి. ఆ సినిమాలకు ఇప్పటికీ ఒక మంచి క్రేజ్ ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా ఓ జి సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో ఇంక్లూట్ చేశాడు సుజిత్. గణేష్ ది ప్రొటెక్టర్, బాలు ది లవర్, సుభాష్ ది సన్, బద్రి ద గార్డియన్, సిద్దు ద రెబల్, జానీ ది ఫైటర్, గని ద వారియర్, బంగారం ది గోల్డెన్ హార్ట్, సంజయ్ సాహు ది లీడర్,జై ద ఫియర్లెస్. అని ప్రతి క్యారెక్టర్ ను తెలిపాడు. ఈ డీటెయిల్స్ అన్ని చూస్తుంటే సినిమాని ఎంత పవర్ఫుల్గా సుజిత్ ప్యాక్ చేశాడో అర్థమవుతుంది.
సెప్టెంబర్ లో సెలబ్రేషన్
ఈ సినిమాను 2024 సెప్టెంబర్ లో విడుదల చేస్తారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. అధికారికంగా కూడా ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాని సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఏదేమైనా ఈసారి మాత్రం సినిమా రిలీజ్ అవ్వడం ఖాయం. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంత క్యూరియాసిటీతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఏళ్లు తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న స్ట్రైట్ ఫిలిం కాబట్టి ఈ సినిమా మీద అన్ని అంచనాలు. హరిహర వీరమల్లు సినిమా కూడా స్ట్రైట్ ఫిల్మ్ అయిన అది ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
Also Read: Kingdom : ఇది రేర్ అచీవ్మెంట్, మాలీవుడ్ లో హిస్టరీ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ