Brazil News: బ్రెజిల్‌లో షాకింగ్ ఘటన జరిగింది. పరానా ప్రాంతంలోని గురాపువావా పట్టణంలో ఒక బస్సులో 20 ఏళ్ల యువతి మృతదేహం లభ్యమైంది. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే.. ఆమె శరీరానికి 26 ఐఫోన్‌లు అతుక్కొని ఉన్నాయి. ఈ ఘటన ఆమె ప్రయాణిస్తున్న సమయంలో జరిగింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. ఫోరెన్సిక్ రిపోర్టుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఆమె మరణానికి గల కారణాలేంటి అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి విషయాల గురించి తెలుసుకుందాం.
వివరాల ప్రకారం.. బస్సులో యువతి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు సంకేతాలను చూపించడం ప్రారంభించింది. ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తినట్టు తెలుస్తోంది. వెంటనే తోటి ప్రయాణికులు అత్యవసర సిబ్బందిని సంప్రదించారు. వెంటనే వైద్యులు అక్కడకు చేరుకున్నారు. కానీ ఆమె బస్సులోనే చికిత్స పొందుతుండగా గుండెపోటుకు గురైంది. వైద్యులు 45 నిమిషాల పాటు ఆమెను బతికించడానికి ప్రయత్నించినప్పటికీ యువతి ప్రాణాలు కోల్పోయింది.
అయితే యువతి ఒంటిపై మొత్తం 26 ఐఫోన్‌లు నేరుగా అతుక్కొని ఉన్నట్లు పోలీస్ అధికారులు గుర్తించారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించాయి. ఒక స్నిఫర్ డాగ్‌ను ఉపయోగించి తనిఖీలు కూడా నిర్వహించారు. ఆమె వద్ద ఎలాంటి డ్రగ్స్ లభ్యం కాలేదు. కానీ ఆమె బ్యాగులో అనేక మద్యం సీసాలు ఉన్నాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ALSO READ: Kaleshwaram Report: కాళేశ్వరం నివేదిక ముగిసిన భేటీ.. కేసీఆర్‌కు బిగ్ షాక్..?
అమ్మాయి మృతిచెందడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ రిపోర్టుల కోసం వెయిట్ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఐఫోన్‌లను బ్రెజిల్ ఫెడరల్ రెవెన్యూ సర్వీస్‌కు అప్పగించారు. అయితే యువతికి డ్రగ్స్ అలవాటు ఉందా..? స్మిగ్లింగ్ తో ఎలాంటి సంబంధాలు అయినా ఉన్నాయా..? అనేది పోలీసులు ఇంకా తెలపలేదు.
ALSO READ: A.K. Rayaru Gopal: రూ.2 డాక్టర్ గోపాల్ కన్నుమూత.. కారణమిదే..?
అయితే ఈ ఘటన స్థానికంగా… అలాగే అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇంత పెద్ద సంఖ్యలో ఫోన్‌లను శరీరానికి అతుక్కోవడం అనేది మామూలు విషయం కాదు. పోలీసులు ఈ కేసులో అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాత అన్ని విషయాలు బయటపడనున్నాయి.