Weekly Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఈ వారం (అక్టోబర్ 05 – అక్టోబర్ 11) రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర సందర్శనలు చేసుకుంటారు. ఇంట్లో దీర్ఘ కాలిక చికాకులు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం కలుగుతుంది. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట్లో బంధుమిత్రులతో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
ముఖ్యమైన సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. భూ సంబంధిత వివాదాలను పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వాహన యోగం ఉన్నది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలులో విజయ పరంపరలు కొనసాగుతాయి. బంధుమిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఒక ముఖ్యమైన వ్యవహారంలో స్నేహితుల సలహాలు లాభిస్తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొని ప్రశంసలు పొందుతారు.
పాత మిత్రులను కలుసుకుని కొన్ని సంఘటనల గురించి చర్చిస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. సంతాన విద్యా విషయాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు నిదానంగా సమయానికి పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఉన్న వివాదాలను తొలగుతాయి. మొండి బాకీలు కొంతవరకు వసూలు అవుతాయి. వ్యాపారులు ఊహించని లాభాలు పొందుతారు.
నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొని పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. ఆలోచనలు ఆచరణలో పెడతారు. వ్యాపారస్తులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలంగా ఉంటుంది. సన్నిహితులతో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. సంతానం విద్య పరంగా ఆశించిన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం తొలగుతుంది.
ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలసివస్తాయి. నూతన పరిచయాలు కలుగుతాయి. దూర ప్రాంత బంధువుల నుండి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. పాత మిత్రులను కలుసుకుని శుభకార్యాలకు హాజరవుతారు. సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు లభిస్తాయి. కొన్ని వ్యవహారాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. దైవ సంబంధిత కార్యక్రమాలు పాల్గొంటారు. వ్యాపార పరంగా నూతన ఆలోచనలు చేస్తారు.
ఇంట్లో కొన్ని ఆలోచనలు ఆచరణలో పెడతారు. సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు లభిస్తాయి. ఉద్యోగమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. సన్నిహితులతో దీర్ఘకాలికంగా ఉన్న వివాదాలను పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు.
మొండిబాకీలు వసూలవుతాయి. అవసరానికి ధన సహాయం లభిస్తుంది. రుణదాతల ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంటి నిర్మాణానికి ఉన్న ఇబ్బందులు తొలగుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. భూ క్రయ వ్యవహారాల్లో అవరోధాలు అధిగమిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు.
నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక విషయాలలో నూతన ప్రోత్సాహకాలు పొందుతారు. సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాల వలన కొన్ని వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. వాహన యోగం ఉన్నది. కొన్ని వ్యవహారాలలో మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేయగలుగుతారు.
దాయాదులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. పాత మిత్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. వృత్తి వ్యాపార పరంగా చేపట్టిన అన్ని వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. ఆర్ధిక పరంగా ఉన్నటువంటి చికాకులు తొలగుతాయి. సంతానం విద్యా విషయాల నూతన అవకాశాలు లభిస్తాయి. ఒక శుభ వార్త ఉత్సాహాన్నిస్తుంది.
దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించటం మంచిది. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపారస్తులు ఆశించిన ఫలితాలు పొందలేరు. ఉద్యోగ పరంగా స్థాన చలన సూచనలు ఉంటాయి. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. నూతన రుణాలు చేయవలసి రావచ్చు. చేపట్టిన వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. సన్నిహితులతో ఆకస్మిక విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన కొంత నిదానంగా పనులు పూర్తవుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు అదనపు ఒత్తిడి పెరుగుతుంది.
చిన్ననాటి మిత్రులతో విందు వినోద, విహారయాత్రలో పాల్గొంటారు. ఇతరుల నుండి ధన సహాయం లభిస్తుంది. వ్యాపార విస్తరణకు పెట్టుబడులు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పనిచేసి లాభాలను పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఉద్యోగపరంగా ఉన్నటువంటి చికాకులు తొలగుతాయి. ఆర్థికంగా కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఇంట్లో నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు ఆచరణలో పెడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
గృహ నిర్మాణ పనులు వేగంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ధన వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అంచనాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక, సేవ కార్యక్రమాలకు పాల్గొంటారు. ఇతరుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆత్మీయ్యుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.