Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన అక్టోబర్ 7వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగులు ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం ఉంది. చేపట్టిన వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ధన పరంగా చేసే ప్రయత్నాలు కలసి రావు. ఇతరులతో అకారణ విభేదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణాలలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు పై అధికారుల అనుగ్రహంతో ఉన్నత హోదాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు మిత్రుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగమున పని ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు.
అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబమున శుభకార్య ప్రస్తావన వస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి తెలివిగా బయట పడతారు. వృత్తి ఉద్యోగ విషయంలో అధికారుల సహాయం లభిస్తుంది.
కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. సంతాన పరంగా ఊహించని సమస్యలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అధిక కష్టంతో స్వల్ప ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు నిర్వహించడం కష్టం అవుతుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది.
మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సౌకర్యాలకు లోటు ఉండదు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన వాహన లాభం కలుగుతుంది. స్ధిరాస్తి సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.
ఆదాయం మార్గాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో శుభకార్య విషయాలు చర్చిస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.
భాగస్వామ్య వ్యాపారాలలో విభేదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తి కావు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కుటుంబ పెద్దల అనారోగ్య సమస్యలు భాదిస్తాయి.
జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో జాప్యం కలుగుతుంది. ఆకస్మిక ప్రయాణాల వలన శారీరక శ్రమ తప్పదు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు.
విద్యార్థులు నూతన విద్యావకాశాలు పొందుతారు. వ్యాపారమున ఆటంకాలు తొలగుతాయి. దూర ప్రాంత బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఇంట్లో శుభకార్యములు నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగస్తులకు కష్టానికి తగిన గుర్తింపు పొందుతారు.
బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు. వ్యాపార వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. ఇంటా బయట ఊహించిన సమస్యలు కలుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఆత్మీయుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. పాత మిత్రులతో విహారయాత్రలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.