Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన అక్టోబర్ 5వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. ఇతరులకు సహాయం అందిస్తారు.
వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. సంతానం విద్యా విషయాల అనుకూలిస్తాయి.
ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. రుణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
చేపట్టిన పనులలో శ్రమాధిక్యంగా ఉంటుంది. సోదరులతో కలహా సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం ఉంటుంది.
నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలిస్తాయి.
నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పరిష్కారమవుతాయి.
ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యయ ప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది తప్పదు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి.
మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. దూర బంధువులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి.
కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాలి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటుచేసుకుంటాయి.
ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. చేపట్టిన పనులను మరింత ఉత్సాహంగా పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.