రక్షాబంధన్ పండుగ ఆగస్టు 9న నిర్వహించుకోబోతున్నాము. ఈ పండుగ అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల మధ్య పవిత్ర బంధాన్ని సూచిస్తుంది. ఈ రోజున చెల్లెలు, అక్కలు తమ సోదరుడికి రాఖీనే కడతారు. అతనికి దీర్ఘాయువు ఆనందం దక్కాలని దీవిస్తారు. అలాగే అన్నా తమ్ముళ్లు, తమ అక్కాచెల్లెళ్ల కోసం అందమైన బహుమతులను అందిస్తారు. అయితే ఆరోజు ఏ రంగు రాఖీని తమ సోదరులకు కట్టకూడదో అక్కాచెల్లెళ్ళు తెలుసుకోవాలి.
జ్యోతిష్శాస్త్రం ప్రకారం రాఖీ పండుగను శుభసమయంలోనే శుభముహూర్తంలోనే జరుపుకోవాలని అలాగే ఎరుపు రంగు రాఖీని మీ సోదరుడికి కట్టకూడదు. ఈ సంవత్సరం ఎరుపు రంగు రాఖీని ఎందుకు కట్టకూడదో కూడా జ్యోతిష్య నిపుణులు వివరిస్తున్నారు.
ఈ ఏడాది కుజ గ్రహానిదే
2025 సంవత్సరాన్ని కుజ సంవత్సరంగా పిలుస్తున్నారు. ఎందుకంటే 2025లోని అన్ని అంకెలను కలిపితే 9 వస్తుంది. తొమ్మిది సంఖ్యకు అధిపతి కుజుడే. కాబట్టి దీన్ని కుజ సంవత్సరంగా పిలుస్తారు. కుజుడు ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి, శక్తికి, కోపానికి ప్రతీక. అలాగే ఎరుపు రంగు అనేది కుజ గ్రహాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ కొద్ది సంవత్సరంలో మీ సోదరుడికి ఎరుపు రంగు రాఖీ కట్టడం ఏ మాత్రం మంచిది కాదు. ఇది వారికి హాని కలిగి చేసే అవకాశం ఉంది. రాఖీ పండుగ నాడు వారికి దురదృష్టాన్ని తెచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ సోదరుడికి ఎరుపు రంగు రాఖీని కట్టవద్దు.
అయితే ఎరుపు రంగును హిందూ మతపరంగా శుభసూచకం గానే చూస్తారు. కాబట్టి ఎంతోమంది ఎరుపు రంగు రాఖీని కట్టేందుకు ఇష్టపడతారు. అయితే కొంతమంది వాదన ప్రకారం ఈ సంవత్సరం కుజ గ్రహానికి సంబంధించింది. కాబట్టి ఎరుపు రంగు రాఖీ కట్టకపోవడమే ఉత్తమమని చెబుతున్నారు. ఏదేమైనా ప్రతిదీ వ్యక్తిగత నమ్మకాలపైనే ఆధారపడి ఉంటుంది. పైన చెప్పిన విషయంపై మీకు వ్యక్తిగతంగా నమ్మకం కుదిరితే మీరు ఎరుపు రంగు రాఖీ కట్టాల్సిన అవసరం లేదు. లేక అదంతా కేవలం అపోహగానే భావిస్తే మీ వ్యక్తిగత నిర్ణయాల ప్రకారం మీరు ఎరుపు రంగు రాఖీని కట్టవచ్చు. ఇది పూర్తిగా మీ వ్యక్తిగతమైన నిర్ణయమే