జాతకంలో రాహువు సరైన స్థానంలో లేకపోతే ఆ వ్యక్తికి ఆర్థిక నష్టాలు తప్పవు. అలాగే మానసిక ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. జ్యోతిష్శాస్త్రంలో రాహువును దుష్ట గ్రహంగా చెబుతారు. అలాగే నీడ గ్రహంగా కూడా పిలుచుకుంటారు. ఈ కలియుగంలో ధనవంతులని పేదవాడిగా, పేదవారిని ధనవంతులుగా మార్చగల ఏకైక గ్రహం రాహువే. రాహువు దుష్ట గ్రహమే అయినప్పటికీ ఎప్పుడూ చెడే చెయ్యడు.. అప్పుడప్పుడు మంచి ఫలితాలను కూడా అందిస్తాడు. రాహువును మీ జాతకంలో బలంగా మార్చుకుంటే మీకు అంతా శుభాలే ఎదురవుతాయి.
మీ జాతకంలో రాహువు బలంగా ఉంటే మీరు మట్టి పట్టుకున్న కూడా బంగారంగా మారిపోతుంది. రాహువు ప్రతి వ్యక్తి చేసే పనులను బట్టి శుభా శుభ ఫలితాలను అందిస్తాడు. మీ జాతకంలో రాహువు చెడు స్థానంలో ఉంటే అతడు మీకు ఎంతో కీడు చేస్తాడు. అలాగే ఆ వ్యక్తి పనిచేస్తున్న ఫలితం రాదు. వ్యాధులతో ఇబ్బంది పడతాడు. అప్పుల్లో కూరుకుపోతాడు. మానసిక ఒత్తిడి కూడా పెరిగిపోతుంది. జీవితంలో అశాంతిగా మారిపోతుంది. అతను ఏ రంగంలో పనిచేసినా కూడా నష్టాలే ఎదురవుతాయి. కాబట్టి రాహువును బలంగా మార్చుకునే పనులను కొన్ని చేయాల్సి నా అవసరం ఉంది.
చేయాల్సిన పరిహారాలు
రాహువు దోషాలను నివారించడానికి మీరు తరచూ నీలం రంగు దుస్తులను ధరిస్తే మంచిది. అలాగే మద్యం, మాంసం వంటివి పూర్తిగా మానేస్తే రాహు దోషాలు తొలగిపోతాయి. శివ పురాణాలు చదవడం, శివునికి సంబంధించిన సాహిత్యాన్ని చదువుతూ ఉండడం వల్ల రాహువు మీకు శుభ ఫలితాలు ఇస్తాడు. ఇక రాహువు కి ఇష్టమైన దేవత సరస్వతి కాబట్టి సరస్వతి దేవిని తరచూ పూజించండి. రాహు శుభ ఫలితాలు మీకు కచ్చితంగా అందుతాయి.
ఈ పనులు చేయండి
అమావాస్య రోజున రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు. రాహువును బలంగా మార్చుకోవడానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే పేదలకు అవసరమైన వస్తువులలో అప్పుడప్పుడు దానం చేస్తూ ఉండండి. ఇది కూడా రాహువును బలోపేతం చేస్తుంది. అలాగే రాహువు యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోండి. నీరు అధికంగా తాగండి. శరీరంలో నీటి కొరత ఏర్పడినా కూడా రాహువు బలహీనంగా మారుతాడు. దీనివల్ల నష్టాలు తప్పవు. అలాగే హనుమాన్ సహస్రనామాన్ని తరచూ పారాయణం చేస్తూ ఉండండి. ఈ పనులు చేస్తే రాహువు బలంగా మారడం ఖాయం.