ఆగస్టు నెలలో ఎన్నో యోగాలు ఏర్పడబోతున్నాయి. అలాగే ఒక ప్రమాదకరమైన యోగం కూడా ఏర్పడబోతోంది. అదే సూర్యకేతువుల కలయిక. నిజానికి సూర్యకేతుల కలయిక అశుభకరంగానే భావిస్తారు. కానీ ఈ యోగం కూడా ఆగస్టు నెలలో మూడు రాశుల వారికి మేలు చేయబోతోంది.
సూర్య కేతు గ్రహణ యోగం
జ్యోతిష శాస్త్రం చెబుతున్న ప్రకారం గ్రహాల రాజు అయినా సూర్యుడు ఆగస్టు 17న సింహరాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు. కేతువు ఇప్పటికే సింహరాశిలో ఉన్నాడు. దీని కారణంగా సింహరాశిలో సూర్యుడు కేతువు కలయిక జరుగుతుంది. ఇది గ్రహణ యోగాన్ని ఏర్పరుస్తుంది. సూర్యుడు సెప్టెంబర్ 15 వరకు సింహరాశిలోనే ఉంటాడు. అప్పటివరకు ఈ గ్రహణ యోగం ఏర్పడుతుంది.
ఆగస్టు 15న సూర్యుని సంచారం వల్ల ఏర్పడే గ్రహణ యోగం పన్నెండు రాశుల వారి జీవితంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. నిజానికి ఈ గ్రహణ యోగం ఏ మాత్రం మంచిది కాదు. కొన్ని రాశుల వాళ్లను ఇది తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. కానీ మూడు రాశుల వారికి మాత్రం సానుకూల ఫలితాలను ఇస్తుంది. వీరిని అదృష్ట రాశులు గానే చెప్పుకోవాలి.
వృషభ రాశి
సూర్యుడు కేతువు కలయికతో వృషభ రాశి వారికి ఎంతో మేలు జరగబోతుంది. మీకు ఎంతో విజయం కూడా దక్కుతుంది. మీరు ఈ సమయంలో చేపట్టే పనులు విజయవంతం అవుతాయి. అలాగే అపారమైన సంపద కూడా కలగవచ్చు. కొత్త పనులను ప్రారంభించడానికి ఇదే మంచి సమయం వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. మీ ఆరోగ్యము, అనుబంధాలు మెరుగుపడతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి సూర్యుడు కేతువుల కలయిక వల్ల శరీరంలో ఉన్నత శిఖరాలను అందుకునే అవకాశం దక్కుతుంది. మీరు పనిచేసే చోటా మీకు అన్ని విధాలుగా సపోర్టు లభిస్తుంది. పని కూడా మీరు బాగా పనిచేస్తారు. వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.
మకర రాశి
మకర రాశి వారికి సూర్యుడు, కేతువు కలయిక ఎంతో మంచిది. ఆర్థిక పురోగతిని అందిస్తుంది. ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం. అయితే జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే పెట్టుబడులను పెట్టాలి. ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది. కొన్ని పనులు మీకు త్వరగా పూర్తవుతాయి. ఏదైనా పెద్ద సమస్య ఉన్నా కూడా అది పరిష్కారం అవుతుంది. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.