BigTV English

MLA Kavitha: సోమవారం నుంచి నిరాహార దీక్ష.. బీఆర్ఎస్ కుట్ర, ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలపై

MLA Kavitha: సోమవారం నుంచి నిరాహార దీక్ష.. బీఆర్ఎస్ కుట్ర,  ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలపై

MLA Kavitha:  బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్-బీజేపీ పార్టీలు డబుల్ గేమ్ మొదలుపెట్టారని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత. 42 శాతం రిజర్వేషన్ల విషయంలో ముస్లింలు ఉన్నారా లేదా? అనేదిపై అధికార పార్టీ స్పష్టత ఇవ్వలేదన్నారు. బీసీ రిజర్వేషన్లలో ముస్లింలుంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది లేదని బీజేపీ చెబుతోందని అన్నారు. ఇరు పార్టీలు కలిసి కట్టుగా ఆడుతున్న డ్రామాగా ఆమె వర్ణించారు.


ఈ రెండు పార్టీల ఆటలను ప్రజల ముందు తేటతెల్లం చేస్తామన్నారు కవిత. ఈ దీక్ష ద్వారా కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాలన్నారు. ఒకవేళ ముస్లింలు లేకపోతే వారి రిజర్వేషన్ల కోసం ఏం చేయబోతున్నారు? ఆర్డినెన్స్ అనేది రాజ్యాంగం ద్వారా ప్రస్తాదించిన హక్కని, దాన్ని బీజేపీ ఎందుకు వైలేట్ చేస్తోందని ప్రశ్నించారు.

ఆర్డినెన్స్‌పై గవర్నర్ ఎందుకు సంతకం చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రపతి వద్ద దానికి సంబంధించిన బిల్లు పెండింగ్ లో ఉందని, దాని విషయంలో అధికార ప్రభుత్వం ఎందుకు సుప్రీంకోర్టుని ఆశ్రయించలేదని సూటిగా లేవనెత్తారు. ఈ విషయంలో సమాధానాలు రావడం కోసమే దీక్ష చేస్తున్నట్లు వెల్లడించారు.


సోమవారం ఉదయం నుంచి ఇందిరాపార్కు వేదికగా 72 గంటలపాటు నిరాహార దీక్ష చేయనున్నారు కవిత.  సంతకం పెట్టాల్సింది గవర్నర్ అని, ఆయన సంతకం పెట్టకుండా బీసీలకు రావాల్సిన హక్కులను ఆపుతున్నట్లు తెలిపారు. కేంద్ర కేబినెట్ చెబితే రాష్ట్రపతి సంతకం చేయాలని, అక్కడా ఆపుతున్నారని అన్నారు. దీనిపై బీజేపీ నేతలు ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

పార్టీ వ్యవహారాలపై నోరు విప్పిన కవిత

ఆడబిడ్డపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే యావత్తు తెలంగాణ బాధపడిందన్నారు కవిత. అనేక మంది ఎక్కడికక్కడ రియాక్ట్ అయ్యారని గుర్తు చేశారు కవిత. మరి ఏమైందో తెలీదుగానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములు రియాక్ట్ కాలేదన్నారు. ఎందుకు రియాక్ట్ కాలేదన్నది ఒక్కసారి ఆలోచించాలన్నారు.

సమాచారం లేకుండా తాను మాట్లాడనని, ఆ వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ కీలక నేత హస్తముందన్నారు. అందుకే ఆ పార్టీ నేతలు సైలెంట్గ్‌గా ఉన్నారని తాను బలంగా నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు. అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందో తనకు ఎప్పటికప్పుడు సమాచారం వస్తుందని, ఏ సమయంలో ఎవర్ని కలిశారు? తనపై వ్యాఖ్యలు చేయడానికి ఎవర్ని ప్రొత్సహించారు?

కింద స్థాయి దిగజారి అలాంటి వ్యాఖ్యలు చేయించారన్నారు. ఇవన్నీ తాను గమనిస్తున్నానని, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నానని తెలిపారు. తనను ఒంటరి చేసి ఏదో చేయాలని భావించి ప్రస్తుతానికి శునకానందం పొందుతున్నారని అన్నారు. అది తిరిగి కొట్టే సమయం వస్తుందని కాసింత ఆవేశంగా చెప్పారు.

ఎంపీ సీఎం రమేష్ ఎందుకు మాట్లాడారో తనకు తెలీదని, ఆయన చేత మాట్లాడించడానికి ఆ లేఖ లీక్ చేశారేమో తనకు తెలీదన్నారు కవిత. సీఎం రమేష్ తనకు తెలిసిన వ్యక్తని, కాకపోతే ఐదారేళ్లలో ఆయనతో మాట్లాడిన సందర్భం లేదన్నారు. ఆయన బయటకు వచ్చి మాట్లాడడంతో దానికి -లెటర్ లీక్ కావడానికి వెనుక ఏదో సంబంధం ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత.

 

Related News

Hyderabad Skywalk: హైదరాబాద్‌లో మరో రెండు స్కైవాక్ లు.. ఈ ఏరియాల్లో ప్రజల కష్టాలు తీరినట్లే!

CM Revanth Reddy: హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్‌అండ్ టీ తప్పుకోలేదు.. ఇది కేసీఆర్ కుట్ర, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Fake doctors: హైదరాబాద్‌లో ఫేక్ డాక్టర్.. ఎలాంటి లైసెన్స్ లేకుండా వైద్యం.. చివరకు?

KTR Elevations: ఇదేం ఎలివేషన్ సామీ? ఓజీ సినిమాపై కేటీఆర్ కి అంత మోజుందా?

Weather News: రాష్ట్రంలో కుండపోత వర్షం.. ఈ ప్రాంతాల్లో రాత్రంతా కొట్టుడే కొట్టుడు, జాగ్రత్తగా ఉండండి

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.12 కోట్ల విలువవైన గంజాయి పట్టివేత

Kalvakuntla Kavitha: నేను ఫ్రీ బర్డ్.. బీఆర్ఎస్ నేతలు నాతో టచ్‌లో ఉన్నారు.. త్వరలో బాంబు పేల్చనున్న కవిత?

Income Tax Raids: నాలుగో రోజు క్యాప్స్‌ గోల్డ్ కంపెనీలో ఐటీ సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

Big Stories

×