హిందూ మత గ్రంథాల ప్రకారం శనివారం శనిదేవుడికి అంకితం చేశారు. ఆ రోజు శనిదేవుని పూజించేవాళ్లు, శనీశ్వరుని ఆలయాలను సందర్శించేవారు ఎంతోమంది. శని దేవుని ప్రసన్నం చేసుకోవడానికి శనివారమే పూజిస్తారు. అలాగే శని చాలీసా కూడా చదువుతారు. ఆయనకు సంబంధించిన వస్తువులను దానం చేస్తారు. అన్ని విధాలుగా శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే శనివారం కొన్ని రకాల ఆహారాలను తినడం వల్ల ఎన్నో ప్రయోజకరమైన ఫలితాలు కలుగుతాయి. శని దేవుని ప్రసన్నం చేసుకోవడానికి చేసుకోవడానికి ఎలాంటి ఆహారాలను తినాలో తెలుసుకోండి. వీటిని శనివారం కచ్చితంగా తినేందుకు ప్రయత్నించండి. శని దేవుడు సంతోషించి మీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగిస్తాడు.
శనివారం నాడు శనికి ఇష్టమైన వస్తువులలో దేనినైనా ఆహారంగా తింటే మీ జాతకంలో శని శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు. మీరున్న ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. అలాగైతే కెరీర్లో, వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. శనివారం కచ్చితంగా తినాల్సిన ఆహారాలు ఏంటో తెలుసుకోండి.
నల్ల మినపప్పు
నల్ల మినప్పప్పుతో చేసే ఆహారాన్ని వండుకొని తింటే మంచిదే. నల్ల మినప్పప్పు అంటే పొట్టు తీయని మినప్పప్పు. అలాగే ఆ నల్ల మినప్పప్పును పేదలకు దానం చేసినా శని దేవుడు సంతోషిస్తాడు. నల్ల మినుములు అంటే శని దేవుడికి ఎంతో ఇష్టం. కాబట్టి దానితో చేసిన కిచిడీని చేసుకొని తింటే శని దేవుడు సంతోషిస్తాడు. జాతకంలోని గ్రహదోషాలను తొలగిస్తాడు.
గులాబ్ జామున్
శనివారం గులాబ్ జామూన్ తింటే ఎంతో శుభప్రదం. గులాబ్ జామూన్ అంటే శని దేవుడికి ఎంతో ఇష్టమైన ఆహారంగా చెప్పుకుంటారు. దీన్ని తినడం వల్ల జీవితంలో తీపి పెరుగుతుంది. ఇంట్లో కూడా శ్రేయస్సు కలుగుతుంది. శనివారం గులాబ్ జామున్ లను తినేందుకు ప్రయత్నించండి.
శనగలు
నల్ల శనగలను శనివారాల్లో ఆహారంగా తింటే ఎంతో ఉత్తమం. వీటిని నానబెట్టి నేరుగా తినవచ్చు. లేదా నానబెట్టి ఉడకబెట్టి కాస్త తాలింపు వేసుకొని తిన్నా మంచిదే. ఇది మంచి ఉత్తమమైన స్నాక్ గా కూడా ఉపయోగపడుతుంది.
నల్ల నువ్వులు
శనివారం నల్ల నువ్వులను దానం చేయడం ఎంతో ప్రయోజనం. శనిదోషం నుండి ఉపశమనం పొందాలంటే నల్ల నువ్వులను దానం చేయాలి. అలాగే శని దేవుడికి నల్ల నువ్వులను సమర్పించాలి. రావి చెట్టు కింద ఆవనూనెలో నల్ల నువ్వులు వేసి దీపం వెలిగించాలి. శనివారం ఆహారంలో నల్ల నువ్వులను భాగం చేసుకోవాలి. శని దేవుడు దయతో జీవితంలోని అనేక సమస్యలు మీకు పరిష్కారం అవుతాయి.
ఆవాల నూనె
శనికి ఆవాల నూనె అంటే ఎంతో ఇష్టం. శనివారం నాడు ఆవాల నూనె లేదా ఆవాల ఆకుకూరలతో చేసినవి ఆహారంగా తింటే మంచిది. మీరు శనిని ప్రసన్నం చేసుకోవచ్చు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.