Warning Signs: మీకు చెడు జరగబోయే ముందు ఎలాంటి సంకేతాలు వస్తాయో తెలుసా..? మీకు గడ్డుకాలం రాబోతుందని ఎలా తెలుసుకోవాలో మీకు తెలుసా..? ఇలాంటి ఇంట్రస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక టైంలో కష్టాలు రావడం సహజం. అలా కష్టాలు వచ్చే ముందు ప్రతి మనిషికి కర్మ కొన్ని సంకేతాలు పంపుతుందని పండితులు చెప్తున్నారు. సంకేతాలు అంటే ఏవేవో అనుకుంటే పొరపాటే మీ దైనందిన జీవితంలో జరిగే చిన్న సంకేతాలేనని జ్యోతిష్యులు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
పాలు విరగడం: చెడు రోజులు మొదలయ్యే ముందు వచ్చే సంకేతం పాలు విరిగిపోవడం. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా పాలు ఏదో ఒక విధంగా విరిగిపోతాయట. అలాగే పాలు వేడి చేస్తున్నప్పుడు పాత్రలోంచి పొంగిపోవడం కూడా మీకొచ్చే చెడుకు సంకేతంగా భావించాలట.
ఉప్పు : అవును మీకు చెడు రోజులు మొదలయ్యే ముందు మీ ఇంట్లో ఉన్న ఉప్పుపై నల్ల చీమలు ఎక్కుతాయట. ఎక్కడైనా చీమలు పంచదార లేదా బెల్లం మీద వాలిపోతుంటాయి. కానీ చెడు రావడానికి ముందు చీమలు ఉప్పును తింటాయట. ఇలా మీ ఇంట్లో జరుగుతుందంటే మీకేదో కీడు జరగబోతుందని అర్థం చేసుకోవాలట.
గడియారం: మీ ఇంట్లో గోడకు ఉన్న గడియారం అయినా.. లేక మీ చేతికి ఉన్న వాచ్ అయినా సడెన్ గా ఆగిపోయాయి అంటే మీకేదో చెడు జరగబోతుందని అర్థం చేసుకోవాలట.
మీ వ్యక్తిత్వంలో మార్పు: మీకు కష్టాలు రాబోతున్నాయి అనడానికి మరో సంకేతం మీలో ఒక రకమైన మార్పు రావడం. ప్రతి చిన్న విషయానికి కూడా చికాకు పడటం. గట్టిగా అరవడం. వెంటనే ప్రతి స్పందించడం. ఏ విషయానికైనా కోపంగా స్పందించండి లాంటి లక్షణాలు మీలో కనిపిస్తే మీకు గడ్డు కాలం రానుందని అర్థం.
మంచంపై ఉండటం: మీకు రాబోయేది కష్టకాలం అని తెలియజేసే మరో సంకేతం. మీరు ఎప్పుడు మంచం మీదే ఉండటం. చిన్న పని చేయడానికి కూడా బద్దకించడం. ఏ పని మీద ఆసక్తి లేకపోవడం. ఎప్పుడూ నిద్రపోవడం.
చెప్పులు: మీరు ధరించే చెప్పులు ఎప్పుడూ ఒకవైపే అరగడం. లేదా మీరు వేసుకున్న షూస్ పదే పదే అరిగిపోవడం లేదా.. ఉన్నపళంగా షూస్ లేస్ ఊడిపోయి మీకు చిరాకు తెప్పించడం. అసలు చెప్పులు షూస్ వేసుకోవాలంటే భయంగా అనిపించడం.
దుస్తులు: మీకు చెడు కాలం రాబోతుంది అనడానికి మరో సంకేతం మీరు వేసుకునే దుస్తుల్లో కూడా తెలుస్తుందట. మీరు ధరించిన షర్ట్ లేదా ఫ్యాంటులకు అకారణంగా రంధ్రాలు పడటం. లేదా ఏదో ఒక విధంగా అవి చిరిగిపోవడం.
ఇంకా మీరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మీ నోటిలోంచి ఉమ్మిలి బయటకు వచ్చి ఎదుటి వ్యక్తి మీద పడటం. లేదా నోటి కొనలొంచి రెండు పక్కల నుంచి తెల్లటి జిగురు లాంటి పదార్థం బయటకు వచ్చి అసహ్యంగా కనిపించడం. అలాగే మీరు ఆహరం తీసుకునేటప్పుడు మీ నోటి నుంచి ఒకరకమైన సౌండ్ రావడం లాంటివి కూడా మీకు చెడు రోజులు రాబోతున్నాయనడానికి సంకేతాలుగా భావించాలట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: ఉచితంగా తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కావాలా? అయితే ఇలా చేయండి