Anasuya -Rashmi: బుల్లితెర యాంకర్లుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj), రష్మి గౌతమ్(Rashmi Gautham) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ జబర్దస్త్ (Jabardasth)కార్యక్రమానికి యాంకర్లుగా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్నారు. ముందుగా జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభం కావడంతో అనసూయ యాంకర్ గా పరిచయమయ్యారు. ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో ఎక్స్ట్రా జబర్దస్త్ పేరిట మరొక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రష్మి గౌతమ్ యాంకర్ గా వ్యవహరించేవారు. అయితే ఇటీవల జబర్దస్త్ పేరిట ఈ కార్యక్రమం ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కామెడీ షో 12 సంవత్సరాల పాటు విజయవంతంగా ప్రసారమవుతున్న నేపథ్యంలో మెగా సెలబ్రేషన్స్ నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే.
ఈ జన్మకు జబర్దస్త్ అనసూయనే..
ఈ కార్యక్రమం ఆగస్టు 8 , 9వ తేదీ ప్రసారం కాబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలను విడుదల చేస్తున్నారు. తాజాగా ఒక ప్రోమో వీడియో విడుదల చేశారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమం మొదట్లో పాల్గొన్న కమెడియన్ల నుంచి ప్రస్తుత కమెడియన్స్ మరోసారి స్కిట్ల రూపంలో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో అనసూయ కూడా సందడి చేశారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ తాను జబర్దస్త్ కార్యక్రమం వదిలిపెట్టి వెళ్లిన సినిమాల పరంగా ఎలా ఉన్నా ఈ జన్మకు తాను జబర్దస్త్ అనసూయనే అంటూ ఈమె తెలియజేశారు.
రష్మీతో అనసూయ గొడవ…
ఇకపోతే ఈ ప్రోమో వీడియోలో అనసూయ మాట్లాడుతూ.. జీవితం బోలెడు అవకాశాలను ఇవ్వదు అని చాలామంది చెబుతుంటారు కానీ తప్పకుండా ఇస్తుందని నేను నమ్ముతాను. నేను కొందరితో ప్యాచప్ చేసుకోవాలి అంటూ ఈమె అక్కడి నుంచి లేచి వెళ్లి మరొక యాంకర్ రష్మి గౌతమ్ ను హగ్ చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఇక రష్మి గౌతమ్ అయితే ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం అనసూయ మాట్లాడుతూ ఎవరికి తెలియని విషయాలు కూడా మన ప్యాచప్ వల్ల తెలిసిపోయేలాగా ఉన్నాయని మాట్లాడారు.
అనసూయ ఇలా మాట్లాడటంతో వెంటనే రష్మి అలా అనుకునేటప్పుడు ఏదో ఫోన్ కాల్ లేదా వాట్సప్ ద్వారా మాట్లాడొచ్చు కదా అంటూ చెప్పగా, అలా అయితే కొన్ని ఇగోలు అడ్డు వస్తాయని అనసూయ మాట్లాడారు. ఇలా వీరిద్దరి ఈ సంభాషణ చూస్తుంటే ఇద్దరు మధ్య ఏదో ఒక విషయం గురించి పెద్ద ఎత్తున గొడవ జరిగిందని ఆ గొడవ కారణంగానే ఇన్ని రోజులు మాట్లాడుకోలేదని స్పష్టం అవుతుంది. మరి ఈ ఇద్దరి మధ్య జరిగిన ఆ గొడవ ఏంటి? అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఈ మెగా సెలబ్రేషన్స్ కార్యక్రమంలో భాగంగా నటుడు నాగబాబు (Nagababu) హాజరై సందడి చేశారు కానీ ఈ కార్యక్రమంలో రోజా మాత్రం ఎక్కడ కనిపించలేదు. రోజాతో పాటు సుడిగాలి సుదీర్ కూడా ఈ మెగా సెలెబ్రేషన్స్ లో పాల్గొనకపోవడంతో వీరి అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.