BigTV English

Zodiac Signs: మాటలతో మాయ చేసి డబ్బులు సంపాదించే వ్యక్తులు ఎక్కువగా ఆ రాశుల్లోనే పుడతారట

Zodiac Signs: మాటలతో మాయ చేసి డబ్బులు సంపాదించే వ్యక్తులు ఎక్కువగా ఆ రాశుల్లోనే పుడతారట

Zodiac Signs: మాటలతో మయా చేసి డబ్బులు సంపాదించే వ్యక్తులు ఏ రాశుళ్లో పుడతారో తెలుసా..? అసలు పన్నెండు రాశుల్లో పుట్టిన వ్యక్తులు గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసా..? ఎవరు కోట్లు సపాదిస్తారు.? ఎవరు కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇస్తారో తెలుసా..? ఎవరు ప్రేమకు బానిసవుతారో తెలుసా..? ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ విషయాలను ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పన్నెండు రాశుల్లో పుట్టిన వ్యక్తుల గుణగణాలను అంచనా వేయోచ్చంటున్నారు పండితులు. ఏ రాశిలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది. వారు దేనికి ప్రాధాన్యత ఇస్తారు. డబ్బు విషయంలో వాళ్ల ఒరవడి ఎలా ఉంటుంది. కుటుంబ విషయాల్లో వాళ్ల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది. సామాజిక అంశాల్లో వారు ఎలా పాలు పంచుకుంటారు. లాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవచ్చంటున్నారు పండితులు. మరి ద్వాదశ రాశుల్లో పుట్టిన వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి: ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. చాలా విషయాల్లో తొందరపాటు వల్లే వీళ్లు నష్టపోతుంటారు. ఈ రాశి వారికి ఉన్న మరో వీక్‌ పాయింట్‌ త్వరగా కోపం రావడం. దీని వల్ల వీళ్లు జీవితంలో చాలా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.


వృషభ రాశి: ఈ రాశి జాతకులకు మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీరు ఏదైతే చేయాలనుకుంటారో అదే చేస్తారు. దాని వల్ల నష్టపోయినా పర్వాలేదు అనుకునే స్వభావం ఈ రాశి జాతకులది. ఏదైనా తప్పు అని తెలిసినా కూడా ముందుకు వెళ్తారు. వీరికి దురాగ్రహం కూడా ఎక్కువే ఉంటుంది.

మిథున రాశి: ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు తమ మాటలతో ఎదుటి వారిని మెస్మరైజ్‌ చేస్తారు. మాటలతో కోటలు కడతారు అన్నట్టుగా వీరి మాటలు ఉంటాయి. అలాగే తమ మాటలతో డబ్బులు సంపాదిస్తారు. కానీ వీరు నిలకడలేమి వల్ల జీవితంలో చాలా నష్టపోతారు.

కర్కాటక రాశి:  ఈ రాశి జాతకులకు సెంటిమెంటల్‌ ఫెలోస్‌ అని చెప్పవచ్చు. వీరికి ఎమోషనల్‌ పాలు కూడా ఎక్కువగానే ఉంటాయట. చిన్న చిన్న విషయాలకే బాధపడతారట.

సింహ రాశి: ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. పది మందిలో వీరు స్పెషల్‌ గా నిలుస్తారు. అయితే వీరికి గర్వం ఎక్కువగా ఉంటుంది. అది తగ్గించుకోకపోవడంతో చాలా నష్టపోతారు. అలాగే నేనే అన్న అహంభావం కూడా ఎక్కువగా ఉంటుందట.

కన్యా రాశి: ఈ రాశి వ్యక్తులు విమర్శలు చేయడంతో దిట్ట. ఎదుటి వారు చిన్న తప్పు చేసినా విమర్శనాస్త్రాలతో విరుచుకుపడతారట. చిన్న చిన్న విషయాల్లో కూడా ఎదుటి వారిని విమర్శిస్తారట. అదే ఈ రాశి జాతకులకు నష్టం చేకూరుస్తుందట.

వృశ్చిక రాశి: ఈ రాశి జాతకులు కోపం ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వారిపై ప్రతికారం తీస్చుకోవడంలో వీరు సిద్దహస్తులు. అలాగే ఎవరైనా మంచి పొజిషన్‌ లో ఉంటే చూసి తట్టుకోలేరు. ఈ రాశి వారికి అసూయ ఎక్కువగా ఉంటుంది.

ధనస్సు రాశి: ఈ రాశి జాతకులు రెండు విధాలుగా ఉంటారు. కొన్ని సందర్భాలలో బాధ్యతలు మొత్తం భుజాన వేసుకుని కష్టపడతారు. మరికొన్ని సందర్భాలలో బాధ్యత లేకుండా తిరుగుతుంటారు. వీరికి పెద్దల మాటలు అంటే అసలే నచ్చవు.

మకర రాశి: ఈ రాశి వారికి ఉదాసీనత ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలోనైనా చూసి చూడనట్టు ఉంటారు. వీరికి భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది.

కుంభ రాశి: ఈ రాశి జాతకులు ఇతరులను అర్థం చేసుకోలేరు. వీరికి ఏ విషయం అంత ఈజీగా అర్థం కాదు. అలాగే వీరు జీవితంలో మార్పులను ఎక్కువగా కోరుకుంటారు అకస్మాత్తుగా జీవితం మారిపోవాలని ఆశిస్తుంటారు.

మీన రాశి: ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు ఎప్పుడూ ఊహల్లో బతుకుతుంటారు. ఆశలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా సవాల్ వస్తే ఎస్కేప్‌ కావడానికి ప్రయత్నిస్తారు. వీరిలో హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఆ ఐదు రాశుల వాళ్ళు ఎవ్వరికీ అప్పు ఇవ్వకూడదట – ఇస్తే తిరిగి రావడం కష్టమేనట

 

Related News

Horoscope Today August 6th: రాశి ఫలితాలు: ఆ రాశి వారు స్వర్ణాభరణాలు కొంటారు  

Zodiac Signs – Slaves: ఆ రాశుల్లో పుట్టిన పురుషులు.. భార్యలకు బానిసలుగా మారతారట

Warning Signs: మీకు చెడు రోజులు ప్రారంభమయ్యే ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయట

Horoscope Today August 5th: రాశి ఫలితాలు: ఆ రాశి  ప్రేమికులకు అనుకూల ఫలితాలు

Trigrahi Yog 2025: త్రిగ్రాహి యోగం.. ఆగస్ట్ 18 నుంచి వీరికి ధనలాభం !

Big Stories

×