Zodiac Signs: ఆ ఐదు రాశుల్లో పుట్టిన జాతకులు జీవితంలో ఎప్పటికీ ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకూడదట. పొరపాటున మీరు ఎవరికైనా అప్పుగా డబ్బులు ఇచ్చారంటే మీ డబ్బులు మీకు తిరిగి రావడం అనేది గగనమేనట. పైగా డబ్బులు ఇచ్చన మీ మీదే తీసుకున్న వాళ్లు నిందలు వేస్తారట. అయితే ఆ అయిదు రాశుల జాతకులు ఎవరో..? ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికల ఆధారంగా మనుషుల జీవిత విశేషాలను గణిస్తుంటారు పండితులు. అలా ప్రతి మనిషి జీవితంలో జరిగే జరగబోయే అంశాలను అంచనా వేస్తారు జ్యోతిష్యులు. అలా అంచనా వేసి ప్రతి మనిషి జీవితంలో చేయాల్సిన పనులు, చేయకూడని పనులను చెప్తుంటారు. ఇక రాశుల ఆధారంగా కూడా ఏ రాశిలో పుట్టిన వ్యక్తులు డబ్బులు అప్పుగా ఇస్తే తిరిగి రావో ఆ రాశుల గురించి కూడా వివరంగా చెప్పారు పండితులు. ఆ రాశుల్లో పుట్టిన వ్యక్తులు సొంత వాళ్లకైనా.. పరాయి వాళ్లకైనా డబ్బులు అప్పుగా ఇస్తే తిరిగి రావవని పైగా అప్పు ఇచ్చినందుకు బోనస్‌గా నిందలు భరించాల్సి వస్తుందని చెప్తున్నారు. ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక పుట్టిన తేదీ లేని వ్యక్తులకు పేరు బలం ఆధారంగా రాశి అంచనా వేస్తారు.
మేష రాశి: ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలట. భాగస్వామ్య వ్యాపారాలు వీరికి అంతగా కలిసి రావట. ఇక వీళ్లు ఎవరికైనా అప్పుగా డబ్బులు ఎప్పటికీ ఇవ్వొద్దని సూచిస్తున్నారు. ఒకవేళ అలా ఇవ్వాల్సి వస్తే ఆ డబ్బుల మీద ఆశలు వదిలేసుకుని ఇవ్వాలంటున్నారు. అలాగే ఈ రాశి వ్యక్తులు అప్పు తిరిగి అడగడానికి కూడా మొహమాట పడుతుంటారట. ఈ కారణం వల్లే ఈ రాశి జాతకులు నష్టపోతారట.
మిథున రాశి: ఈ రాశి వారు కూడా అప్పులు ఇవ్వడంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పండితులు. అయితే ఎదుటి వ్యక్తులతో ఉన్న సంబంధాలను కాపాడుకునేందుకు అప్పు ఇస్తారు. అయితే ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోయినా వీళ్లు మళ్లీ అడగరట. ఇదే ఈ రాశి జాతకుల బలహీనత అంటున్నారు.
కర్కాటక రాశి: ఈ రాశి జాతకులకు సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుందట. అందువల్లే ఎదుటి వ్యక్తులు ఎవరైనా కష్టాల్లో ఉన్నామని.. డబ్బులు కావాలని అడిగితే ఎమోషనల్‌గా స్పందించడమే కాదు. వెంటనే డబ్బులు అప్పుగా ఇస్తారట. అయితే ఇచ్చిన అప్పును తిరిగి అడిగితే ఎదుటివారు ఏమనుకుంటారోనని అడగరట. ఇదే ఈ రాశి జాతకులకు శాపంగా మారుతుందని చెప్తున్నారు పండితులు.
తుల రాశి: ఈ రాశి జాతకులు కూడా అతి సంస్కారంతో ఇచ్చిన అప్పును తిరిగి అడగరట. దీంతో వీరి సంస్కారాన్ని ఎదుటి వాళ్లు దుర్వినియోగం చేసుకుంటారు. అందువల్ల ఈ రాశి వారికి ఇచ్చిన అప్పు తిరిగి రాదట.
మీన రాశి: ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు ఎదుటి వారు కష్టాల్లో ఉంటే చూడలేరట. అడిగిన అడగకున్నా వెంటనే సాయం చేస్తారట. అలాగే అప్పుల విషయంలో కూడా అడగక ముందే కష్టాల్లో ఉన్న వారికి అప్పులు ఇస్తారట. ఇచ్చిన అప్పు తిరిగి రాకపోయినా ఈ రాశి వారు మనసులో బాధపడతారట కానీ ఎప్పుడు అప్పు తీసుకున్న వ్యక్తులను ఇబ్బంది పెట్టరట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే