BigTV English

Evil Eye Symptoms: ఈ 6 లక్షణాలు మీలో ఉంటే ఖచ్చితంగా నరదృష్టి లక్షణాలే..

Evil Eye Symptoms: ఈ 6 లక్షణాలు మీలో ఉంటే ఖచ్చితంగా నరదృష్టి లక్షణాలే..

Evil Eye Symptoms: మనలో చాలా మందికి నర దృష్టి అనే పదం వినగానే ఇది పెద్దవాళ్ల చెప్పే మాటల్లా అనిపించవచ్చు. కానీ ఒకసారి నిజంగా ఆ అనుభవం ఎదురైతే, అది మన జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో అర్థమవుతుంది. నర దృష్టి అంటే ఇతరుల ఈర్ష్య, అసూయ, ద్వేషం కలిగిన ప్రతికూల శక్తులు మనపై ప్రభావం చూపడం. కొందరు కావాలనే చేస్తారు, మరికొందరు తెలియకపోయినా తమ ప్రతికూల ఆలోచనలతో మన ఎదుగుదలను దెబ్బతీస్తారు. ఒకసారి ఆ ప్రతికూల శక్తులు మన చుట్టూ వ్యాపించాక, మన పాజిటివ్ ఎనర్జీని తగ్గించేస్తాయి. దాంతో మనసు దిగులుగా మారడం, ఉత్సాహం తగ్గిపోవడం, అనవసర సమస్యలు వరుసగా రావడం మొదలవుతుంది. దీనికి 6 సూచనలు ముందుగానే వచ్చిన మనం వాటిని తేలికగా తీసుకుంటాం. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.


అకస్మాత్తుగా అలసట (Sudden Fatigue)
నర దృష్టి బారిన పడితే ముందుగా శరీరంలో అలసట మొదలవుతుంది. ఎంత విశ్రాంతి తీసుకున్నా, ఎంతసేపు నిద్రపోయినా, శక్తి లేకపోవడం శరీరం నీరసంగా ఉంటుంది. వైద్యపరంగా ఏ సమస్యా లేకపోయినా, శరీరం నిర్జీవంగా అనిపిస్తే అది సాధారణం కాదని అర్థం చేసుకోవాలి.

పనుల్లో అడ్డంకులు (Facing Blockages)
మీరు ఎంత కష్టపడినా, ఎంత శ్రమించినా, ఫలితం రావడంలేదు. ఒక్కొక్కటి సరిగా జరుగుతున్నట్టే అనిపించి, చివరి క్షణంలో ఆగిపోవడం… ఇది సాధారణం కాదు. దీనికి గల కారణం నర దృష్టి కావచ్చు.


ఆకస్మిక ఆరోగ్య సమస్యలు (Sudden Health Issues)
ఎందుకో తలనొప్పులు, గుండె వేగంగా కొట్టుకోవడం, లేదా శరీరంలో అసహజమైన నొప్పులు రావడం… ఎలాంటి వైద్య కారణం లేకపోయినా ఇవి జరగటం కూడా నర దృష్టి లక్షణాలలో ఒకటి.

భావోద్వేగ అస్థిరత, ఆందోళన (Emotionally Drained & Anxiety)
చిన్న విషయానికే ఎక్కువగా ఎమోషనల్ అవ్వడం, ఒక్కసారిగా మూడ్ మారిపోవడం, అనుకోకుండా ఆందోళన కలగడం… ఇవన్నీ కూడా మీ మనసులో ప్రతికూల శక్తుల ప్రభావం ఉన్నట్టు సూచిస్తాయి.

భయంకరమైన కలలు (Nightmares)
రాత్రిపూట భయంకరమైన కలలు — ఎవరో వెంబడిస్తున్నట్టు, పాములు, మొసళ్ళు, లేదా భయంకరమైన జంతువులు దాడి చేస్తున్నట్టు — ఇవన్నీ మీ ఆత్మశక్తిపై దాడి జరుగుతోందని సూచించే సంకేతాలు.

వస్తువుల లోపాలు (Object Malfunction)
మీ గది లైట్లు ఒక్కసారిగా చిమ్మ చిమ్మ మంటూ వెలిగిపోవడం, ఫోన్ పని చేయకపోవడం, టీవీ ఆగిపోవడం… ఇవి కేవలం టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనిపించినా, కొన్నిసార్లు ఇవి కూడా నర దృష్టి హెచ్చరికలుగా భావించవచ్చు.

ఇవన్నీ సాధారణం అనిపించినా, కొన్నిసార్లు ఇవి కూడా నర దృష్టి సంకేతాలు కావచ్చు. దీని ప్రభావం సులువుగా తీసుకోవద్దు. ఇది మన శరీర శక్తివలయాన్ని, మన ఎదుగుదలను దెబ్బతీసే ఒక రకమైన ఆధ్యాత్మిక దాడి. కాబట్టి ఒకవేళ మీరు అలసట, అడ్డంకులు, ఆకస్మిక అనారోగ్యం, భయంకరమైన కలలు, లేదా వస్తువుల లోపాలు అనుభవిస్తుంటే వెంటనే ఆ శక్తుల నుంచి రక్షణ పొందే మార్గాలు అన్వేషించాలి. ఉప్పు నీటితో స్నానం చేయడం, నిమ్మకాయ-మిరపకాయల తోరణాలకు పెట్టడం, మీరు నమ్మే దేవుడికి ప్రార్థనలు లేదా పూజలు చేయడం — ఇవన్నీ మీ ఎదుగుదలను మంచి చేస్తాయి, ప్రతికూల శక్తులను దూరం చేస్తాయి. జీవితంలో పాజిటివ్ ఎనర్జీని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మన ఆత్మశక్తి బలంగా ఉన్నంత కాలం, ఎలాంటి నర దృష్టి మనకు హాని చేయలేదు.

Related News

Horoscope Today August 12th: రాశి ఫలితాలు:  ఆ రాశి జాతకులకు ఇవాళ పట్టిందల్లా బంగారంలా ఉంటుంది

Vish Yog 2025: 30 ఏళ్ల తర్వాత విషయోగం.. ఆగస్ట్ 12 నుంచి వీరికి అడుగడుగునా కష్టాలు

Horoscope Today August 11th: రాశి ఫలితాలు:  ఈ రోజు ఆ రాశి వారికి ధన లాభం

Trigrahi yog 2025: మిథున రాశిలో అరుదైన త్రిగ్రహి యోగం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనుంది !

Horoscope Today August 10th: రాశి ఫలితాలు: ఆ రాశి వారికి సమాజంలో గౌరవం, సన్మానాలు, సత్కారాలు 

Big Stories

×