BigTV English

Rao Bahadur : వెంకటేష్ మహా, సత్యదేవ్ మరో వైవిద్యమైన ప్రాజెక్ట్, బ్రేక్ వస్తుందా?

Rao Bahadur : వెంకటేష్ మహా, సత్యదేవ్ మరో వైవిద్యమైన ప్రాజెక్ట్, బ్రేక్ వస్తుందా?

Rao Bahadur : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోలకు విపరీతమైన టాలెంట్ ఉంది. కానీ వాళ్ళ టాలెంట్ కు సరిపడా గుర్తింపు రాలేదు అనేది వాస్తవం. ఇలాంటి టాపిక్ ప్రస్తావన వస్తే మొదటి వినిపించే పేరు సత్యదేవ్. ముందుగా చిన్న చిన్న సినిమాల్లో కొన్ని పాత్రలు వేసిన సత్యదేవ్ జ్యోతిలక్ష్మి సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు.


జ్యోతిలక్ష్మి సినిమా జరుగుతుండగానే మరోవైపు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా పనిచేస్తూ ఉండేవాడు. రాత్రి ఆఫీసులో పనిచేస్తూ పొద్దున షూటింగ్ కి హాజరయ్యేవాడు. ఈ సినిమా రిలీజ్ అయిన అంతవరకు కూడా ఇలా రెండు పనులు చేశాడు అని చాలామందికి తెలియలేదు. మొత్తానికి ఆ సినిమాతో గుర్తింపు సాధించుకున్న తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. హీరోగా కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. తన కెరీర్ లో మంచి సినిమాలు ఉన్నా కూడా అవి సరైన ఆదరణ దక్కించుకోలేకపోయాయి.

మరో వైవిద్యమైన ప్రాజెక్ట్ 


కేరాఫ్ కంచరపాలెం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయ్యాడు వెంకటేష్ మహా. ఆ సినిమాతోనే చాలామంది దృష్టిని తనవైపు ఆకర్షించాడు. రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకులు ఈ సినిమా మీద విపరీతమైన ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా తర్వాత వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన సినిమా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య మలయాళం సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమా డైరెక్ట్ గా నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది. ఈ సినిమాను కూడా వెంకటేష్ మహా బాగా డీల్ చేశాడు అంటూ మంచి ప్రశంసలు వచ్చాయి. అయితే ఒక ఇంటర్వ్యూలో కేజిఎఫ్ సినిమా పైన వెంకటేష్ మహా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

అప్పట్నుంచి వెంకటేష్ మహా ను అందరూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే కొన్ని సినిమాల్లో నటుడుగా కనిపించిన వెంకటేష్ మహా దర్శకత్వం చేసి దాదాపు 5 ఏళ్ళు అయింది. ఇప్పుడు మళ్లీ సత్యదేవ్ హీరోగా రావు బహదూర్ అని సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రెసెంట్ చేస్తున్నారు. చింత గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

బ్రేక్ వస్తుందా.?

వాస్తవానికి సత్తిదేవ్ కెరియర్ లో మంచి సినిమాలు ఉన్నాయి. బ్లఫ్ మాస్టర్ సినిమా ఎప్పుడు చూసినా కూడా చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంటుంది. అలానే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా కూడా బానే ఉంటుంది. తిమ్మరసు సినిమా కూడా బాగానే వర్కౌట్ అయింది. రెండు సినిమాలు కరోనా వేవ్ లో కొట్టుకుపోతే. బ్లఫ్ మాస్టర్ సినిమాకి సరైన ఆదరణ లభించలేదు. కష్టపడుతున్న పేరు వస్తుంది గాని ఆ స్థాయి గుర్తింపు మాత్రం సత్యదేవ్ కి రావట్లేదు అనేది వాస్తవం. ఈ సినిమాతో ఏ మేరకు సక్సెస్ అందుకుంటాడో వేచి చూడాలి.

Also Read: SSMB 29 : బాబు లుక్ అదిరింది, మహేష్ బాబు ఫ్యాన్స్ లో జోష్ నింపిన కార్తికేయ

Related News

66 Years Of Kamal Haasan: కమల్ హాసన్ వివాదాలకు కేంద్ర బిందువు

Tollywood: తుది దశకు చేరుకున్న సినీ కార్మికుల సమ్మె… రేపు ఫైనల్ మీటింగ్ ?

Vijay Sethupathi: డబ్బుతో అమ్మాయిలను వంచిస్తాడు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన డైరెక్టర్!

Upasana: ఉప్సీ ఫోన్‌లో చరణ్ పేరు ఏం ఉంటుందో తెలుసా ? ఆ 200 వెనక పెద్ద కథే ఉంది

Anupama Parameswaran: 7:00 కి రమ్మంటారు… 9:30 కి షాట్ తీస్తారు, అడిగితే ఆటిట్యూడ్ అంటారు

Aamir khan in Coolie : రోలెక్స్‌ను కొట్టబోతున్న అమీర్ ఖాన్.. అంతా లోకీ లీలా

Big Stories

×