అక్వేరియంలో ఉండే చేపలు ఎంతో అందంగా ఉంటాయి. ఆకర్షణీయమైన రంగుల్లో ఉండే అక్వేరియం ఇంట్లో ఉంటే లివింగ్ రూమ్ మరింత బావుంటుంది. మనదేశంలో చేపలను శుభంగానే భావిస్తారు. వాటిని స్వచ్ఛతకు, చిహ్నంగా భావిస్తారు. పురాణాలలో కూడా విష్ణువు మత్య్సావతారాన్ని ఎత్తినట్టు చెబుతారు. కాబట్టి చేప అనేది శుభసూచకంగానే భావిస్తారు. పురాతన చైనీస్ వాస్తు శాస్త్రవేత్తలు ఫెంగ్ షూయ్ కూడా చేపను విజయానికి, శ్రేయస్సుకు, డబ్బు ప్రవాహానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే చాలామంది ఇళ్లల్లో అక్వేరియం కనిపిస్తుంది.
ఫెంగ్ షూయ్ చెబుతున్న ప్రకారం చేపలు నీటితో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఈ సంబంధం సంపదను, వృత్తిని సూచిస్తుంది. చేపలు ఈత కొట్టినప్పుడు అవి నిరంతరం శక్తి ప్రవాహాన్ని వాడుతూనే ఉంటాయి. అందువల్ల ఇంట్లో చేపల చిత్రాలు ఉంచడం మంచిదని చెబుతారు. జీవితంలో ఉత్సాహం, ఉల్లాసం కలుగుతాయని వివరిస్తారు. ముఖ్యంగా చేపలు ఎప్పుడూ జంటగా ఉండేలా చూసుకోవాలి. లేదా ఎనిమిది బంగారు చేపలు ఉండేలా ఉంటే మంచిది. అలాగే బంగారు చేపల మధ్యలో ఒక నెల చేప ఉన్న పెయింటింగ్ లను కొని ఇంట్లో పెడితే ఎంతో మంచిది. ఇది ఇంట్లో ఉన్న దురదృష్టాన్ని నివారిస్తుంది. అదృష్టాన్ని ఆహ్వానిస్తుంది. ఈ పెయింటింగ్ ఇంటికి అందర్నీ తేవడమే కాదు ఎన్నో శుభాలను అందిస్తుంది.
ఏ దిశలో ఉంచాలి?
వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం చేపల చిత్రాలను ఈశాన్య దిశలో ఉంచడం. అత్యంత పవిత్రం ఎందుకంటే ఈ దిశ జ్ఞానానికి, స్పష్టతకు, ఆధ్యాత్మిక శక్తికి మూలం. ఇక్కడ నీటి మూలకమైన చేపలను ఉంచడం వల్ల మానసిక స్పష్టత ఆ ఇంట్లో ఆర్థిక పురోగతి, శాంతి పెరుగుతాయి. ఒకవేళ మీకు ఈశాన్య దిశలో పెయింటింగ్ ను ఉంచడం వీలు కాకపోతే ఉత్తర దిశలో ఉంచవచ్చు. ఎందుకంటే ఈ దిశ కూడా కెరీర్, ధన ప్రవాహంతో ముడిపడి ఉంటుంది. అయితే దక్షిణా లేదా నైరుతి దిశలో చేపలు పెయింటింగ్ ను ఎప్పుడు ఉంచకండి. ఈ దిశలో నీటి మూలకానికి వ్యతిరేకంగా ఉంటాయి.
చేపల పెయింటింగ్ తో పోలిస్తే అక్వేరియం ఇంట్లో ఉంచుకుంటే ఇంకా మంచిది. అయితే అక్వేరియంలో నిర్వహించడం కష్టం. చేపలు మరణించినప్పుడు ప్రతికూల శక్తి ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పెయింటింగ్ పెట్టుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. అయితే పెయింటింగ్ లో ఎన్ని చేపలు ఉండాలి. వాటి రంగు ఎలా ఉండాలి? వంటివి కూడా పరిగణలోకి తీసుకోవాలి. చేపల చిత్రాలను ఎంపిక చేసుకునేటప్పుడు ఆ చేపలు ఈత కొడుతూ ఉండేలా చూసుకోండి. అలాగే ఆ ముఖాలు నీటి నుంచి బయటికి కాకుండా నీటి లోపలే ఉన్నట్టు చూడండి. ఇది సంపద శుభం ఇంట్లోకి ప్రవహించడానికి కారణం.
ఎన్ని చేపలు?
చేపల పెయింటింగ్ కనీసం తొమ్మిది చేపలు ఉండేలా చూసుకోండి. ఎనిమిది బంగారు రంగులో ఉంటే ఒకటి నలుపు రంగులో ఉండాలి. ఇలా చేస్తే ఇలాంటి చేపల పెయింటింగ్ ఇంట్లో పెడితే దుదృష్టం పోతుంది. మీకు ఈ బంగారు రంగు, నలుపు రంగులో ఉండే చేపల పెయింటింగ్ దొరకకపోతే నీలం, బంగారు, ఎరుపు వంటి శక్తివంతమైన రంగులతో ఉన్న చేపల పెయింటింగ్ ను కోరవచ్చు. ఈ రంగులు చాలా శక్తివంతంగా ఉంటాయి. అలాగే పెయింటింగ్ లోని నీరు స్పష్టంగా, ప్రశాంతంగా ప్రవహిస్తున్నట్టు ఉండాలి. అల్లకల్లోలంగా ఉన్నట్టు కనిపిస్తే అది ప్రతికూల శక్తిని ఇంట్లోకి ఆహ్వానించినట్టే.