 
					OTT Movie : విదేశీ పర్యాటకులను మోసం చేసే నకిలీ గురువుల ఆధారంగా రూపొందిన సినిమా ‘మొహల్లా అస్సీ’. మొహల్లా అస్సీ అనేది వారణాసిలో గంగా నది ఒడ్డున ఉన్న ఒక ఘాట్. ఇక్కడ 1980-1990 మధ్య కాలంలో వారణాసిలో మతం వ్యాపారం గా మారుతున్న దృశ్యాలను, ఈ సినిమా సెటైరికల్ గా చూపిస్తుంది. ఇందులో సన్నీ డియోల్ సంస్కృత ఉపాధ్యాయుడిగా, సనాతన మత గురువుగా నటించారు. రామజన్మభూమి ఉద్యమంలో జరిగిన సంఘటనల ద్వారా సినిమా కథ సాగుతుంది. 2015 జూన్ 30న మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు ‘మొహల్లా అస్సీ’ విడుదలపై ఢిల్లీ కోర్టు స్టే విధించింది. దీంతో ఈ సినిమా విడుదలకి 3 సంవత్సరాలు ఆలస్యమైంది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందారం పదండి.
‘మొహల్లా అస్సీ’ (Mohalla Assi) 2018లో విడుదలైన భారతీయ హిందీ సెటైరికల్ సినిమా. ఇందులో సన్నీ డియోల్, సాక్షి తన్వర్ ప్రధాన పాత్రల్లో నటించారు. మిగతా పాత్రల్లో సౌరభ్ శుక్లా, ముఖేష్ తివారీ, రవి కిషన్, రాజేంద్ర గుప్తా నటించారు. ఇది కాశీనాథ్ సింగ్ ప్రసిద్ధ నవల కాశీ కా అస్సీ ఆధారంగా, చంద్రప్రకాశ్ ద్వివేదీ దర్శకత్వంలో తెరకెక్కింది. 2 గంటల 35 నిమిషాల ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
వారణాసి గంగా తీరంలోని అస్సీ ఘాట్ మొహల్లాలో ధర్మనాథ్ పాండే అనే సంస్కృత పండితుడు తన భార్య సుమిత్రా , కుమారుడితో కలిసి ఆదర్శవంతమైన జీవితం గడుపుతుంటాడు. అతను ఉదయం గంగా స్నానం, వేద పఠనం, శుద్ధ హిందూ సంప్రదాయాలు పాటిస్తుంటారు. కానీ 1980-90ల నాటి భారతదేశంలో గ్లోబలైజేషన్, విదేశీ పర్యాటకుల రాకతో మొహల్లా మారిపోతుంది. స్థానికులు ఫేక్ బాబాలు, యోగా గురువులు, జ్యోతిషులుగా మారి ఫారినర్స్‌ను మోసం చేస్తుంటారు. డ్రగ్స్, సెక్స్, డబ్బు కోసం హిందూ మతాన్ని వ్యాపారంగా మారుస్తారు. పాండే ఈ మోసాలను చూసి ఆగ్రహిస్తాడు, కానీ అతని స్వంత ఇల్లు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో పడుతుంది. రవి కిషన్ అనే ఒక ఫేక్ గురువు, విదేశీ మహిళలతో రొమాన్స్, డ్రగ్స్ పార్టీలు నడుపుతాడు. ఈ మధ్యలో రామ్ జన్మభూమి ఉద్యమం, మండల్ కమిషన్ రిజర్వేషన్స్ వంటి రాజకీయ సంఘటనలు మొహల్లాను రెండు వర్గాలుగా చీలుస్తాయి.
Read Also : ఒంటరి పిల్ల ఒంటిపై చెయ్యేసి పాడు పని… ట్విస్టులతో మతిపోగొట్టే మలయాళ మూవీ