BigTV English

OTT Movie : పజిల్స్ తో పరుగులు పెట్టించే కిల్లర్… నరాలు కట్టయ్యే సస్పెన్స్, ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్

OTT Movie : పజిల్స్ తో పరుగులు పెట్టించే కిల్లర్… నరాలు కట్టయ్యే సస్పెన్స్, ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్

OTT Movie :కొరియన్ సిరీస్‌ లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. ఇక్కడి నుంచి వచ్చే సీరియల్ కిల్లింగ్స్‌ స్టోరీలను చూపు తిప్పుకోకుండా చూస్తుంటారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా వచ్చిన ఒక సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ సిరీస్, కొరియన్ టాప్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. ఇది 10 ఏళ్ల క్రితం జరిగిన మర్డర్ కేస్ తో మొదలై, కొత్త సీరియల్ కిల్లింగ్స్‌తో సాగే ఒక సస్పెన్స్ స్టోరీ. ఇందులో కిల్లర్ హత్యలు చేసి, అక్కడ ఒక పజిల్ వదిలి వెళ్తుంటాడు. ఈ సిరీస్ ట్విస్ట్‌లు, ఎమోషనల్ సీన్స్‌తో కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘నైన్ పజిల్స్’ (9 Puzzles web series) 2025లో వచ్చిన కొరియన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. యూన్ జాంగ్-బిన్, కిమ్ జంగ్-హో దీనిని రూపొందించారు. ఇందులో యూన్ ఈ-నా (కిమ్ దా-మి), కిమ్ హాన్-సామ్ (సన్ సుక్-కూ) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌ 11 ఎపిసోడ్‌లతో ఒక్కో ఎపిసోడ్ 60 నిమిషాల నిడివితో, 2025 మే 21న డిస్నీ+లో రిలీజ్ అయ్యింది. దీనికి IMDbలో 8.4/10 రేటింగ్ పొందింది.

కథలోకి వెళ్తే

ఈ-నా అనే అమ్మాయి 10 ఏళ్ల క్రితం, తన అంకుల్ ని ఎవరో చంపుతున్నట్లు చూస్తుంది. అక్కడ కిల్లర్ ఒక పజిల్ ని వదిలి వెళ్తాడు. తను చిన్న వయసులో ఉండటంతో, ఈ-నాకు ఏమీ గుర్తుకు ఉండదు. డిటెక్టివ్ హాన్-సామ్ ఈ కేసులో ఈ-నా ను అనుమానిస్తాడు. కానీ ఆ కేస్ అప్పుడు సాల్వ్ కాకుండా మూసివేస్తారు. ఈ-నా మనసులో ఆ బాధ 10 ఏళ్ల తర్వాత కూడా ఉంటుంది. ఈ-నా ఇప్పుడు క్లూస్ టీం క్రిమినల్ ప్రొఫైలర్ అవుతుంది. ఈ సమయంలో మళ్ళీ కొత్త సీరియల్ మర్డర్స్ స్టార్ట్ అవుతాయి. ప్రతి మర్డర్ దగ్గర ఒక పజిల్ పీస్ ఉంటుంది. ఇది ఈ-నా అంకుల్ కేస్‌తో కనెక్ట్ అయినట్టు కనిపిస్తుంది.


ఇప్పుడు ఈ-నా, హాన్-సామ్ కలిసి ఈ కొత్త మర్డర్స్ సాల్వ్ చేయడానికి టీమ్ అవుతారు. హాన్-సామ్ ఇంకా ఈ-నాపై కొంచెం డౌట్‌తోనే ఉంటాడు. కానీ వాళ్లు కలిసి పని చేస్తారు. ప్రతి మర్డర్ దగ్గర ఉన్న పజిల్ పీస్‌లో కొత్త క్లూస్ ఉంటాయి. కొన్ని డ్రాయింగ్స్, కొన్ని మెసేజెస్. ఈ క్లూస్ ఈ-నా అన్కిల్ మర్డర్‌తో లింక్ అవుతాయి. హాన్-సామ్ కొంత మందిని అనుమానిస్తాడు. కానీ కిల్లర్ చాలా తెలివిగా ఎస్కేప్ అవుతుంటాడు. అయితే ఇన్వెస్టిగేషన్ సమయంలో ఒక షాకింగ్ సస్పెక్ట్ అరెస్ట్ అవుతాడు. అది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

సీరియల్ మర్డర్స్ వెనుక ఒక పెద్ద రహస్యం బయటపడుతుంది. అది 10 ఏళ్ల క్రితం కేస్‌తో కనెక్ట్ అవుతుంది. ఈ-నా తన అన్కిల్ మర్డర్ గురించి ఫుల్ ట్రూత్ తెలుసుకుంటుంది. ఇక ఈ-నా, హాన్-సామ్ కలిసి కిల్లర్‌ను పట్టుకోవడానికి ఫైట్ చేస్తారు. చివరికి ఊహించని ట్విస్ట్‌లు, ఎమోషనల్ సీన్స్‌తో ఈ స్టోరీ ముగుస్తుంది. కిల్లర్‌ను వీళ్ళు పట్టుకుంటారా ? కిల్లర్ ఎందుకు హత్యలు చేస్తున్నాడు ? కిల్లర్ వదిలి వెళ్తున్న పజిల్స్ ఎలాంటివి ? ఈ-నా అంకుల్ ని కిల్లర్ ఎందుకు చంపాడు ? అనే విషయాలను, ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Read Also : రాత్రిపూట భర్త గదిలోకి వెళ్లాలంటేనే భయపడే భార్య… నలుగురమ్మాయిల అరాచకం… సింగిల్స్ కు మాత్రమే

Related News

OTT Movie : భార్య ఉండగా ఇదెక్కడి దిక్కుమాలిన పని… మొగుడు మగాడే కాదని తెలిస్తే… సింగిల్ గా చూడాల్సిన మూవీ మావా

OTT Movie : భర్త పట్టించుకోట్లేదని మరొకడితో… ప్రియుడితో కలిసి మైండ్ ను మడతబెట్టే ప్లాన్ సామీ

OTT Movie : ఫస్ట్ నైట్ రోజే పరలోకానికి… పెళ్లి కొడుకుకి ఫ్యూజులు అవుటయ్యే షాక్… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : వరుస హత్యలు… ఆ రోగం ఉన్న పేషంట్సే ఈ సైకో టార్గెట్… సస్పెన్స్ తో పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : తమ్ముడి ముందే అక్కను దారుణంగా… మేనల్లుడి రివేంజ్ కి గూస్ బంప్స్ … క్లైమాక్స్ అరాచకం

OTT Movie : బిజినెస్ పేరుతో భర్త పత్తాపారం… మరో అమ్మాయిపై మోజుతో పాడు పని… కట్ చేస్తే తుక్కురేగ్గొట్టే ట్విస్ట్

OTT Movie : శవాలపై సైన్…ఈ కిల్లర్ మర్డర్స్ అరాచకం… క్షణక్షణం ఉత్కంఠ… గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×