OTT Movie : ఓటీటీలో ఒక బెంగాలీ సిరీస్ టాప్ లేపుతోంది. ఇది బెంగాలీలో టాప్ వెబ్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. సీరియల్ మర్డర్స్ చుట్టూ తిరిగే ఈ కథ, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది. ఇందులో పెళ్లి కూతుర్లు వరుసగా చనిపోతుంటారు. దీనికి కారణం ఒక సీరియల్ కిల్లర్ అని ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. చివరి ఎపిసోడ్ వరకు ఈ స్టోరీ సస్పెన్స్ తో చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘బిరంగన’ (Birangana) 2025లో వచ్చిన బెంగాలీ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. నిర్జ్హర్ మిత్ర దీనికి దర్శకత్వం వహించారు. సాండిప్త సేన్, నిరంజన్ మొండాల్, సౌమ్య దాస్, రుద్రానిల్ ఘోష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌లో 8 ఎపిసోడ్‌లతో, ఒక్కో ఎపిసోడ్ 40 నుంచి 50 నిమిషాలు ఉంటుంది. 2025 జూలై 25న ఇది హాయిచాయ్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. IMDbలో 7.5/10 రేటింగ్ పొందింది.
చిత్ర అనే ఒక యంగ్ పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ చాలా ధైర్యవంతురాలు, తెలివైన అమ్మాయి. ఒక ఊరిలో పెళ్లి రోజు ఒక పెళ్లి కూతురు చనిపోతుంది. అది సూసైడ్ లా కనిపిస్తుంది. చిత్ర ఈ కేస్‌ను ఇన్వెస్టిగేట్ చేస్తుంది. కానీ ఇది సాధారణ సూసైడ్ కాదని తెలుస్తుంది. అదే సమయంలో మరికొంత మంది పెళ్లి కూతుర్లు కూడా అదే విధంగా చనిపోతారు. చిత్ర ఈ కేస్‌ను డీప్‌గా తవ్వితే, చనిపోయినవాళ్లందరూ రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయిలని తెలుస్తుంది. ప్రతి మర్డర్ దగ్గర ఒక ఫ్లోరిస్ట్ (పూలు అమ్మేవాడు) కనిపిస్తాడు. అతను సస్పిషియస్‌గా ఉంటాడు.
చిత్ర తన పోలీసు టీమ్‌తో కలిసి ఈ మర్డర్స్‌ను సాల్వ్ చేయడానికి పని చేస్తుంది. ప్రతి మర్డర్ దగ్గర ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. ఫ్లోరిస్ట్ మొక్కలు డెలివర్ చేస్తాడు, మర్డర్స్ సూసైడ్‌లా కనిపిస్తాయి. చిత్ర ఈ ఫ్లోరిస్ట్‌ను డౌట్ చేస్తుంది, కానీ అతను చాలా సైలెంట్‌గా, తెలివిగా ఉంటాడు. ఇన్వెస్టిగేషన్‌లో చిత్రకు కొత్త క్లూస్ దొరుకుతాయి, కానీ కిల్లర్ ఎవరో తెలియడం కష్టంగా ఉంటుంది. చిత్ర మనసులో ప్రెషర్ పెరుగుతుంది. ఎందుకంటే మర్డర్స్ మాత్రం ఆగడం లేదు. ఇక సిరీస్ సస్పెన్స్ ఎక్కువవుతుంది. చిత్ర ఫ్లోరిస్ట్‌ను పట్టుకుంటుంది. కానీ అతను కిల్లర్ కాదని ఒక షాకింగ్ ట్విస్ట్‌లో తెలుస్తుంది.
ఈ సమయంలోనే నిజమైన కిల్లర్ బయటపడతాడు. మర్డర్స్ వెనుక ఒక డార్క్ రీజన్ ఉంటుంది. రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయిలపై, కిల్లర్ రివేంజ్ తీర్చుకుంటూ ఉంటాడు. ఈ సిరీస్ ఎమోషనల్, సస్పెన్స్ ఎండింగ్‌తో ముగుస్తుంది. కిల్లర్ ఎవరు ? ఎందుకు ఇలా చేస్తున్నాడు ? చిత్ర కిల్లర్‌ను ఎలా పట్టుకుంటుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలను, ఈ బెంగాలీ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.
Read Also : భర్త ఇంట్లో లేడని బాయ్ ఫ్రెండ్ ను పిలిచే భార్య… నెక్స్ట్ బుర్రబద్దలయ్యే ట్విస్ట్… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్