OTT Movie : అక్రమ సంబంధం ప్రధాన అంశంగా, ఒక తమిళ థ్రిల్లర్ సినిమా థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఓటీటీలో ఫర్వాలేదనిపించింది. ఈ కథలో భార్య, భర్తల మధ్య మూడో వ్యక్తి ఎంట్రీ ఇవ్వడంతో అసలు స్టోరీ మొదలవుతుంది. ఈ సినిమాలో నటి పూర్ణ ప్రధాన పాత్రలో నటించింది. ఆమె తన భర్త పై ప్రతీకారాన్ని తీర్చుకునే క్రమంలో స్టోరీ థ్రిల్లర్ వైబ్ లోకి వెళ్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
‘డెవిల్’ (Devil) 2024లో వచ్చిన తమిళ హారర్ థ్రిల్లర్ సినిమా. ఆథిత్యా దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో హేమా (పూర్ణ), అలెక్స్ (విధార్త్), అరుణ్ (త్రిగుణ్), సోఫియా (షుభశ్రీ) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 ఫిబ్రవరి 2న రిలీజ్ అయ్యింది. 1 గంట 58 నిమిషాల రన్ టైమ్ తో, ఈ సినిమా Aha ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
హేమా అనే యువతి అలెక్స్ ను పెళ్లి చేసుకుంటుంది. వాళ్ల పెళ్లి కొన్నాళ్లు హ్యాపీగా ఉంటుంది. కానీ ఆ తరువాత అలెక్స్ హేమాను ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అతను తన ఆఫీస్‌లో పనిచేసే సోఫియాతో అఫైర్ పెట్టుకుంటాడు. హేమాకు ఈ విషయం తెలిసి, బాధపడుతుంది. ఒక రోజు హేమా రోడ్డు యాక్సిడెంట్‌లో అరుణ్ అనే వ్యక్తి ఆమెను సేవ్ చేస్తాడు. వాళ్ల మధ్య ఫ్రెండ్‌షిప్ మొదలవుతుంది. హేమా అరుణ్‌తో మాట్లాడుతూ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. కొన్ని రోజుల్లోనే హేమా, అరుణ్ మధ్య ఫ్రెండ్‌షిప్ డీప్ అవుతుంది. అలెక్స్ కూడా సోఫియాతో ఇంకా క్లోజ్‌గా ఉంటాడు.హేమాకు భర్తమీద మనసులో కోపం, బాధ పెరుగుతాయి.
ఇప్పుడు సినిమా థ్రిల్లర్ గా మారుతుంది. హేమాకు కలలో విచిత్రమైన సీన్స్, డెవిల్ లాంటి ఇమేజెస్ కనిపిస్తాయి. ఈ సమయంలో ఆమె అలెక్స్ అఫైర్ గురించి కన్ఫర్మ్ చేసుకుంటుంది. హేమా అరుణ్‌తో మరింత క్లోజ్ అవుతుంది, కానీ ఆమె మనసు కన్ఫ్యూజ్ అవుతుంది. అలెక్స్‌ను ప్రేమించాలా, వదిలేయాలా అనే డైలమాలో పడుతుంది. అలెక్స్ కూడా హేమా, అరుణ్ మధ్య ఏదో ఉందని డౌట్ పడతాడు. అయితే హేమా, అరుణ్ తో కలసి అలెక్స్ పై ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అవుతుంది. క్లైమాక్స్ హారర్ సీన్స్, మర్డర్ ప్లాన్స్ తో చాలా కాంప్లికేటెడ్ గా ముగుస్తుంది. చివరికి హేమ తన ప్రతీకారం తీర్చుకుంటుందా ? అరుణ్‌తో ఆమె ప్రయాణం ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.
Read Also : ‘అవెంజర్స్’ ను గుర్తుచేసే కొరియన్ సినిమా… చచ్చినోడి బాడీ పార్ట్స్ తో సూపర్ పవర్స్ .. కిరాక్ మూవీ