Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన సెప్టెంబర్ 20వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతీ విషయంలో చాదస్తంగా ఆలోచన చేస్తుండటంతో అవకాశాలు చేజార్చుకుంటారు. ఆరోగ్య సమస్యలు పీడిస్తాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కానీ ఊహించని ఖర్చులు ఆందోళన పడేలా చేస్తాయి. కొత్త పరిచయాలతో లాభం చేకూరుతుంది.
ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరమైన సహాయం అందుతుంది. స్త్రీ మూలకంగా మీ ప్రయత్నాలలో మార్పులు జరుపుతారు. ప్రభుత్వఉద్యోగ అర్హతను సాధిస్తారు. మీ శక్తిసామర్థ్యాలని నమ్ముకోవడం మంచిది.
ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. ఉత్తమ ఉద్యోగిగా అవార్డులు అందుకుంటారు. వ్యాపారులకు మంచి అభివృద్ధి, అవకాశాలు కలిసి వస్తాయి. కాంట్రాక్టర్లకు కొత్త టెండర్లు దక్కుతాయి. నిజాయితీగా పనిచేయండి.
కొత్త ప్రదేశాలని సందర్శిస్తారు. భూ సమస్యలు పరిష్కారమవుతాయి. సాంకేతిక రంగాల్లో పని చేసేవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. సోదర వైరం పనికిరాదు. కళారంగం వారికి కొత్త అవకాశాలతో పాటు విశేషమైన గుర్తింపు లభిస్తుంది.
అన్నింటా మనదే పైచేయి అనే సిద్ధాంతాన్ని వదిలిపెట్టండి. ఎదుటి వారిని గౌరవిస్తూ పనులు పూర్తి చేయండి. గతంలో దూరమయిన బంధాలు చేరువవుతాయి. ఆర్థికంగా తృప్తి కరమైన ఖర్చులు ఉంటాయి. అకాల భోజనం నిద్ర లేమి వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
ఆకస్మిక ప్రయాణాల వల్ల ఖర్చులు అధికమవుతాయి. మాటలు జారడం వల్ల ఆర్థికంగా నష్టపోతారు. గురువులను పెద్దలను గౌరవించడం వల్ల మానసికంగా ఆనందంగా ఉంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి మంచి సమయం.
భార్యా భర్తల మధ్య అపర్థాల వల్ల గొడవలు తీవ్రతరం కాకుండా చూసుకోండి. పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేయండి. పెద్దవారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. క్రీడా రంగం వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వైద్యవృత్తిలో ఉండేవారు జాగ్రత్తగా ఉండండి.
చేసిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరులా అవుతుంది. ఆర్థికంగా వ్యక్తిగతంగా నష్టపోతారు. వీసా సమస్యలు తీరిపోతాయి. అనుకున్న ప్లేస్ మెంట్ లో చాన్స్ దక్కుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. వైద్యవృత్తిలో, ఫార్మసీ రంగంలో గొప్ప విజయాలు సాధిస్తారు.
ప్రేమ వ్యవహారాలు బెడిసి కొడుతాయి. తప్పు మీది కాకపోయినా కొన్నిసార్లు తలదించుకోవాల్సి వస్తుంది. మానసికంగా దృఢంగా ఉండటానికి ప్రయత్నించండి. స్వంత మనుషులే మోసం చేస్తారు. ఎవరినీ ఎక్కువగా నమ్మి అడుగేయకండి.
నేత్ర సంబంధమైన వ్యాధులు వస్తాయి. టెండర్లు నిలిచిపోతాయి. దైవానుగ్రహంతో కొన్ని పనులు అనుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు విఫలమవుతాయి. ప్రమాదాల బారి నుండి బయటపడుతారు.
ధన సంబంధమయిన విషయాల్లో లోపాయకారంగా వ్యవహరించండి. ప్రయోగాత్మక విజయాలు సాధిస్తారు. భాగస్వామితో కలిసి సమయం గడపండి. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. చేతికి వచ్చిన ప్రభుత్వ కాంట్రాక్టు ఇతరులకు దక్కుతుంది. గతాన్ని మరచి పోయి ముందడుగు వేయండి.
తీర్థయాత్రలు చేస్తారు విలువైన వస్తువులు చేజార్చుకుంటారు. పదునైన వస్తువులతో జాగ్రత్తగా ఉండండి. సంకల్పం సిద్ధిస్తుంది. దైవానుగ్రహం మెండుగా ఉంది.