Gundeninda GudiGantalu Today episode September 20th : నిన్నటి ఎపిసోడ్ లో.. మీరు పంపించిన సోఫా మీరే తీసుకోండి మాకేం వద్దు అని ఫోన్ పెట్టేస్తాడు. సురేంద్ర మాస్టర్ ప్లాన్ చేస్తాడు.. ఆ సోఫాను మల్లి షాప్ కి తీసుకెళ్లి శోభన రిటర్న్ ఇవ్వాలని అనుకుంటుంది. మీ ఇంటికి ఇచ్చానుస్తామని నేను పంపిస్తే ఆ సోఫా నీకు తిరిగి మళ్ళీ పంపించారు నాకు సోఫా అవసరం లేదు మా ఇంట్లో చాలానే ఉన్నాయి అని రిటర్న్ ఇస్తున్నాను. అయితే డబ్బులు ఇప్పుడే డీలర్కు ఇచ్చాను.. మీకు రెండు మూడు రోజుల సర్ది ఏర్పాటు చేస్తానని మనోజ్ అంటాడు.. అయితే రోహిణి మాత్రం ఆమెకు డబ్బులు తెచ్చి ఇస్తుంది. ఇంత డబ్బులు నీ దగ్గర ఎలా వచ్చాయో రోహిణి అని మనోజ్ అడుగుతాడు.. పుస్తెలతాడు తాకట్టు పెట్టి తీసుకొచ్చాను అని రోహిణి అంటుంది.. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి రచ్చ చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీ ఆవిడ పూలన్నీ లక్ష రూపాయలు సోఫానికి కొంటుందా? అని ప్రభావతి అడుగుతుంది.. మా ఆవిడ పూలమ్మే నాకు కారు కొనిపెట్టింది ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావు అనుకుంటా అని బాలు అంటారు. సత్యం ఈ గొడవ ని వదిలేయండి అని అంటాడు. ఇక శృతి బాధపడుతుంటే రవి అక్కడికి వెళ్లి బాలు అన్నయ్య కోపంగానే అన్నాడు కానీ మీ అమ్మ ఒక మాట ముందుగానేంటే బాగుండేది కదా అని రవి శృతి తో అంటాడు.. నిజమే మా అమ్మ చెప్పకుండా ఇలాంటి పని చేయడం నాకు కూడా తప్పు అనిపిస్తుంది అని శృతి అంటుంది.
బాలు మీనాలను సందు దొరికితే ఎప్పుడు బయటకు పంపిద్దామని ప్రభావతి చూస్తూ ఉంటుంది. సోఫా విషయంలో ప్రభావతి బాలు పై పీకలు దాకా కోపంతో ఉంటుంది. ఎలాగైనా సరే వీడ్ని ఇంట్లో ఉండనిస్తే లేనిపోని గొడవలు పెడుతూ ఉంటాడు ఎలాగైనా బయటికి పంపించేయాలి అని ప్రభావతి అనుకుంటుంది.. అయితే గదిలోకి సత్యం రాగానే బాలు చేసింది ముమ్మాటికీ తప్పే అంటూ రెచ్చిపోతుంది ప్రభావతి. ఇలా చేయడం తప్పు కాదా అని సత్యంతో గొడవకు దిగుతుంది. బాలు మీనా ని ఇంట్లో ఉంటే గొడవలు అవుతాయి బయటకు పంపించేయండి అని నేను ఎప్పుడో చెప్పాను. కానీ మీరే ఒప్పుకోవట్లేదు అని ప్రభావతి తెచ్చిపోయి మాట్లాడుతుంది. సత్యం మాత్రం ఈ విషయం గురించి ఇంకొకసారి మాట్లాడితే మర్యాదగా ఉండవు అని అంటాడు.
ఈయనకు ఏం చెప్పినా ఇంతే అసలు పట్టించుకోడు.. వాడిని నెత్తిన పెట్టుకొని కూర్చుంటాడు అని ప్రభావతి అనుకుంటుంది. ఆలోచిస్తూ కింద గదిలో కూర్చుంటుంది. రోహిణి నేను పార్లర్కి వెళ్ళొస్తాను అత్తయ్య అని అంటుంది. ఇలానే వెళ్తావా అమ్మ రోహిణి అని ప్రభావతి అడుగుతుంది. ఏ అత్తయ్య డ్రెస్ బాగాలేదా అని రోహిణి అడుగుతుంది. డ్రెస్ కాదమ్మా మెల్లో పుస్తెలతాడు తోనే వెళ్ళిపోతావా అని ప్రభావతి అడుగుతుంది. ఇక తప్పదు కదా అత్తయ్య ఒకరు చేసిన పనికి నేను బలవల్సి వచ్చింది అని రోహిణి కావాలని బాలు పై కోపాన్ని ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.
ఇక బాలు వంటగదిలో ఉండడం చూసిన మీనా అక్కడికి వెళుతుంది. నా మీద మా నాన్న కోపంగా ఉన్నాడా అని బాలు అడుగుతాడు. కోపంగా ఉన్నాడా మరి నువ్వు చేసిన పిచ్చి పనికి అని మీనా సమాధానం చెబుతుంది. ప్రతి వాళ్ళ అమ్మ కావాలని గొడవకు పెట్టినట్టు తెలుస్తుంది. పుస్తెలతాడు మార్చినప్పుడు అలానే గొడవ చేసింది. అసలు నిజం తెలుసుకొని ఇంటికి ఇంటికి వచ్చేసింది. ఇక ఆవిడ సోఫాను వద్దన్నందుకు షాప్కు వెళ్లి మరీ ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు కదా ఇదంతా కావాలనే చేసినట్లు అనిపిస్తుంది..
మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అని మీనా ఉచిత సలహా ఇస్తుంది. ఆ మాట వినగానే బాలు అయ్యో నా పూలగంప నన్ను ఎంత బాగా అర్థం చేసుకున్నావు అని పొగడ్తల వర్షం కురిపిస్తాడు. ఇక మీరు ఇకమీదటైనా ఏదైనా చేయాలనుకున్నప్పుడు మావయ్య గారికి చెప్పి చేయండి అని మీనా అంటుంది. రోహిణి ప్రభావతి మాట్లాడుకోవడం శృతి వింటుంది. ఏమన్నారంటే మీనాది తప్పని ఎందుకంటారు అని ప్రభావతికి క్లాస్ పీకుతుంది. ప్రతి చిన్న విషయానికి మీనాని మధ్యలోకి లాగుతారు ఎందుకు.. మీనా కావాలని సోఫాను వెనక్కి పంపించమని చెప్పిందా ఏంటి అని శృతి దిమ్మతిరిగిపోయే క్వశ్చన్ లు వేస్తుంది.
Also Read: శనివారం అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు.. అవే స్పెషల్..
ప్రభావతి అదేం లేదమ్మా నేను ఇప్పుడు మీనాను అనట్లేదు. ప్రతి చిన్న విషయానికి మీనా ని మధ్యలోకి తీసుకొస్తారు ఏంటి మీరు. ఇంట్లో మీ పెద్ద కోడలు మాత్రమే కాదు మీనా కూడా పసుపు తాడు వేసుకొని ఉన్నింది. రోహిణి ఏమి అంతకుముందు కూడా బంగారు తాడు ఏం వేసుకోలేదు కదా మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని శృతి పెద్ద క్లాస్ పీకుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి..