Sharwanand: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో శర్వానంద్ ఒకరు. శర్వానంద్ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. అయితే రీసెంట్ టైమ్స్ లో శర్వానంద్ చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించటం లేదు. అప్పట్లో వచ్చిన ఒకే ఒక జీవితం (oke Oka jeevitham) సినిమా డీసెంట్ సక్సెస్ సాధించింది కానీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. శర్వానంద్ మంచి కాన్సెప్ట్ సినిమాలు ఎంచుకుంటాడు అని అందరికీ ఒక రకమైన నమ్మకం ఉంది.
ప్రస్తుతం శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి (Naari Naari Naduma Murari) అనే ఒక సినిమాను చేస్తున్నాడు. మరోవైపు భోగి (Bhogi) అనే సినిమా కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం శర్వానంద్ చూస్తుంటే అందరికీ షాకింగ్ గా అనిపిస్తుంది. సినిమాల కోసం భారీగా బరువు తగ్గిపోయాడు.
కొందరు హీరోలను చూసి అభిమానులు విపరీతంగా ఇష్టపడుతుంటారు. అయితే ఆ హీరోల్లో విపరీతమైన మార్పులు వచ్చినప్పుడు అభిమానులు కొద్దిగా ఖంగారు పడటం సహజం. తెలుగు హీరోలు ఎన్టీఆర్ (Ntr) , శర్వానంద్ భారీగా బరువు తగ్గిపోయారు. ఎన్టీఆర్ అయితే డ్రాగన్ (Dragon) సినిమా కోసం కంప్లీట్ సన్నబడిపోయాడు. ఇప్పుడు శర్వానంద్ కూడా సన్నంగా అయిపోయాడు. అయితే సడన్ గా వాళ్లను ఇలా చూసేసరికి మరి పేషెంట్స్ లా తయారవుతున్నారు ఏంటి అని ఫీలింగ్ వస్తుంది. సినిమా కోసం ఇంతలా కష్టపడుతున్న వాళ్లకు సక్సెస్ వస్తే అది ఇంకా బాగుంటుంది.
శర్వానంద్ విషయానికి వస్తే కొన్ని విషయాల్లో అతని చాలా విపరీతంగా కొంతమంది ఇష్టపడతారు. ఒక సినిమా ఆడియో వేడుకలో అతని కాళ్లు పట్టుకోవడానికి అభిమాని వచ్చినప్పుడు, మీ తల్లిదండ్రులు పాదాలకు నమస్కారం చేయండి అంటూ తిడుతూ వార్నింగ్ ఇచ్చాడు. అది ఆ అభిమానికి ఎలా అనిపించిందో చెప్పలేము గాని ఖచ్చితంగా చాలామందికి మాత్రం మంచి మాట చెప్పాడు అనిపించింది. అలానే వ్యక్తిగతంగా కూడా శర్వానంద్ అందరితో చాలా మంచిగా మాట్లాడుతారు, రామ్ చరణ్ (Ram Charan) తో కూడా శర్వానంద్ కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. రామ్ చరణ్, రానా (Rana daggupati), శర్వానంద్ మధ్య బాండింగ్ పలు సందర్భాలలో వాళ్లే చెప్పారు.
Also Read: Kalki 2 : కల్కి సినిమా నుంచి తప్పుకోవడానికి అదే కారణం, దీపికా పదుకొనే రియాక్షన్