BigTV English
Advertisement

Indian Railways: తొలిసారి ఆ మార్గంలో ఖాళీ రైళ్లను నడుపుకునేందుకు అనుమతి, రైల్వే కీలక నిర్ణయం!

Indian Railways: తొలిసారి ఆ మార్గంలో ఖాళీ రైళ్లను నడుపుకునేందుకు అనుమతి, రైల్వే కీలక నిర్ణయం!

Dedicated Freight Corridor:

మెరుగైన రవాణా సేవలు అందించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే తొలిసారి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (DFC) నెట్‌ వర్క్‌ లో ఖాళీ ప్యాసింజర్ రైళ్లను నడిపేందుకుఅనుమతించింది. సరుకు రవాణాను పెంచడానికి, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన DFCలో ఇప్పుడు ఖాళీ రైళ్లను నడుపుకునే అవకాశం కల్పిస్తోంది. “DFCCIL లైన్‌ లో ఖాళీ కోచ్ లతో కూడిన రైళ్లకు తొలిసారి ఇండియన్ రైల్వే అనుమతించింది” అని ఓ సీనియర్ రైల్వే అధికారి వెల్లడించారు.


రైల్వే ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

భారతీయ రైల్వే DFC నెట్‌ వర్క్‌ లో ప్యాసింజర్ రైళ్లను అనుమతించేందుకు ప్రత్యేక కారణం ఉంది. పండుగ సీజన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా ప్యాసింజర్ రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఈ రద్దీకి అనుగుణంగా అధికారులు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్యాసింజర్, ఎక్స్‌ ప్రెస్ రైళ్ల నిర్వహణను చేపట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. DFC నెట్ వర్క్ లో ఖాళీ ప్యాసింజర్ రైళ్లను నడపడం ద్వారా.. ప్రయాణీకులను వేగవంతంగా తమ గమ్యస్థానాలకు చేర్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఛత్ పూజ కోసం తమ స్వస్థలాలకు ప్రయాణించే ప్రయాణికులకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ ఏడాది ఛత్ పూజ అక్టోబర్ 25 నుంచి అక్టోబర్ 28 వరకు జరుపుకోనున్నారు. నార్త్ లో ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి.

ఛత్ పూజ కోసం ప్రత్యేక రైళ్లు

సాధారణ రైళ్లతో పాటు, ఛత్ పూజ నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా రైల్వే 1,500 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. దసరా, దీపావళి ఛత్ పూజ సందర్భంగా దేశ వ్యాప్తంగా 12,000 కంటే ఎక్కువ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది. అందులో భాగంగా ఛత్ పూజ కోసం ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. నవంబర్ 30 వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని రైల్వే అధికారులు వెల్లడించారు.


భారత్ లో ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు

దేశంలో మెరుగైన రవాణా వ్యవస్థ కోసం భారతీయ రైల్వే రెండు ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లను (DFC) నిర్మిస్తోంది. అవి. లూధియానా నుంచి సోంనగర్ వరకు తూర్పు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (EDFC) (1337 కి.మీ), జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ టెర్మినల్ (JNPT) నుంచి దాద్రి వరకు పశ్చిమ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (WDFC) (1506 కి.మీ)ను నిర్మిస్తున్నాయి.  ఇవి కాకుండా, రైల్వే మంత్రిత్వ శాఖ కింది మూడు  కొత్త డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల (DFCs) కోసం డీపీఆర్ సిద్ధం అవుతోంది. ఖరగ్ పూర్ నుంచి విజయవాడకు ఈస్ట్ కోస్ట్ కారిడార్, పాల్ఘర్ నుంచి ఆండాల్ వరకు ఈస్ట్ వెస్ట్ కారిడార్, విజవాడ నుంచి- ఇటార్సి వరకు నార్త్ సౌత్ సబ్ కారిడార్ ఉన్నాయి.

Read Also: ప్రత్యేక రైలు సర్వీసులు పొడిగింపు, పండుగ రద్దీ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం!

Related News

Indian Railways: ప్రయాణీకుల కోసం వెయిటింగ్ జోన్లు, ఇక ఆ స్టేషన్లలో రద్దీ కనిపించడదట!

Indian Railways: తెలంగాణకు రైల్వే గుడ్ న్యూస్, ఆ రెండు మార్గాల అప్‌గ్రేడ్ కు గ్రీన్ సిగ్నల్!

Bullet Train – AP: ఏపీలో రెండు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు, ఇక ఆంధ్రా దశ తిరిగినట్టే!

Special Trains: ప్రత్యేక రైలు సర్వీసులు పొడిగింపు, పండుగ రద్దీ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం!

Fire on Train: వారంలో రెండోసారి.. ఎక్స్‌ ప్రెస్ రైలులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు!

Viral Video: ఆర్డర్ చేసిన ఫుడ్ తో పాటు.. తినే ప్లేట్లకూ పే చేయాలట, భలే విచిత్రంగా ఉందే!

Bus Fire Tragedies: బస్సులో బతుకులు ‘బుగ్గి’.. ప్రమాదాల సమయంలో ఎదురవుతున్న అడ్డంకులు ఇవే!

Big Stories

×