Harleen Deol: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025) కొనసాగుతున్న నేపథ్యంలో టీమిండియా స్టార్ ప్లేయర్ హర్లీన్ డియోల్ కు (Harleen Deol) ఊహించని పరిణామం ఎదురైంది. స్టేడియంలోని డగౌట్ లో కూర్చుని ఉన్న హర్లీన్ డియోల్ కు శ్రీలంక అభిమానులు ప్రపోజ్ చేస్తూ రచ్చ చేశారు. ఓ అభిమాని ఏకంగా ఫ్లకార్డు… రెచ్చిపోయాడు. ఐ లవ్ యూ హర్లీన్ డియోల్ అంటూ ఓ ప్లకార్డు పట్టుకొని ప్రపోజ్ కూడా చేశాడు. డ్రెస్సింగ్ రూమ్ దగ్గర కూర్చుని ఉన్న హర్లీన్ డియోల్ ను పిలిచి మరీ, ఐ లవ్ యు అంటూ రెచ్చిపోయాడు శ్రీలంక అభిమాని. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఈ టోర్నమెంట్ ప్రారంభంలో మ్యాచ్ జరిగింది. ఆ సమయంలోనే ఈ సంఘటన జరగగా తాజాగా వీడియో వెలుగులోకి వచ్చింది.
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే టీమిండియా సెమీ ఫైనల్ కు దూసుకు వెళ్లింది. మూడు మ్యాచ్ లలో విజయం సాధించిన టీమిండియా మహిళల జట్టుకు 6 పాయింట్లు దక్కాయి. దీంతో సెమీ ఫైనల్ కు వెళ్లిన నాలుగో జట్టుగా టీమిండియా రికార్డులోకి ఎక్కింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా అలాగే ఇంగ్లాండ్ జట్లు సెమీ ఫైనల్ కు దూసుకు వెళ్లిన సంగతి విధితమే.
?igsh=MWY5ajM0ZnNqN2hqcw%3D%3D