Explosion in America: అమెరికాలో భారీ పేలుడు సంభవించింది. నాష్‌విల్ సమీపంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న కెమికల్ మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు ముప్పై మందికి పైగా తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టెన్నెస్సీ రాష్ట్రంలోని స్ప్రింగ్ హిల్ ఇండస్ట్రియల్ జోన్లో ఉన్న ఈ కెమికల్ ఫ్యాక్టరీలో.. అర్ధరాత్రి సమయంలో ఒక రియాక్టర్ యూనిట్‌లో ప్రెజర్ పెరగడంతో.. ఒక్కసారిగా భారీ బ్లాస్ట్ సంభవించింది. ఆ వెంటనే ఫ్యాక్టరీలోని కెమికల్ ట్యాంకులు వరుసగా పేలిపోవడంతో మంటలు చెలరేగాయి.
సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
టెన్నెస్సీ పోలీస్, ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు.. ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి. ప్రాథమికంగా ఇది ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ అని భావించినప్పటికీ, భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. కెమికల్ మిశ్రమం తయారీలో ఉపయోగించే ఎథనాల్, నైట్రేట్, సల్ఫర్ పదార్థాలు..పేలుడు తీవ్రతను పెంచి ఉండవచ్చని ప్రాథమిక అంచనా వేస్తున్నారు.
Also Read: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
కాగా కంపెనీపై నిర్లక్ష్యం ఆరోపణలు గుప్పిస్తున్నాయి. భద్రతా పరికరాలు, ఎమర్జెన్సీ అలారమ్‌లు పనిచేయలేదని, వార్షిక సేఫ్టీ ఇన్స్పెక్షన్ కూడా పూర్తి చేయలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.