Worship Gods: దేవుళ్లను పూజించడానికి కూడా ఒక టైం ఉంటుందట. ఏ టైంలో ఏ దేవుడిని పూజించాలో శాస్త్రం చెప్తుందట. అలా కాకుండా ఇష్టమైనప్పుడే దేవుడికి పూజలు చేస్తే ఆ పూజల వల్ల ఒరిగేదేముండదట. అయితే ఏ సమయంలో ఏ దేవుణ్ని పూజించాలో ఎలా పూజించాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
హిందూ ధర్మశాస్త్రం ప్రకారం దేవుళ్లను పూజించడానికో సమయం సందర్భం ఉంటుందట. అలా కాకుండా ఇష్టం వచ్చినప్పుడు నడి నెత్తిన సూర్యుడు ఉన్న మధ్యాహ్న సమయంలో కానీ అర్ధ్రరాత్రి వేలల్లో కానీ పూజలు చేస్తానంటే చేసుకోండి కానీ అలా చేసే పూజల వల్ల వచ్చే ఫలితాలు కూడా ఏమీ ఉండవని పండితులు చెప్తున్నారు. అయితే పూజలు ఎప్పుడు చేయాలి. అనేది శాస్త్రంలో వివరంగా ఉందంటున్నారు. శాస్త్రం ప్రకారం చేసే పూజలకే దేవుళ్లు కరుణిస్తారని అదే శాస్త్రంలో కూడా ఉందని చెప్తున్నారు పండితులు.
తెల్లవారు జామున మూడున్నర నుంచి ఐదున్నర వరకు ఉన్న సమయాన్నే బ్రహ్మముహూర్తం అంటారు. ఈ ముహూర్తంలో నిద్ర లేచి స్నానాదికాలు పూర్తి చేసుకుని చేసే పూజలు ఎక్కువగా ఫలిస్తాయి. ఈ సమయంలో చేసే ప్రార్థనలు డైరెక్టుగా దేవుడితో కనెక్ట్ అవుతాయట. అందుకే ఈ సమయాన్ని పూజలకు ఉత్తమమైనదిగా పండితులు చెప్తుంటారు.
సాయంత్రం సూర్యుడు అస్తమించాక చీకటి పడటానికి ముందు ఉంటే సమయంలో కూడా దీపం వెలిగించి ఏ దేవుడినినైనా ప్రార్థించవచ్చు. కానీ ఈ సమయంలో పూజ బ్రహ్మముహూర్తం కన్నా తక్కువ ఫలితాలను ఇస్తుందట.
ఈ సమయంలో సూర్య భగవానున్ని, లేదా వెంకటేశ్వర స్వామిని ప్రతి రోజూ ధ్యానించి పూజ చేస్తే చాలా శుభ ఫలితాలు పొందొచ్చంటున్నారు పండితులు. ఇది ఒక రకంగా చెప్పాలంటే కొంచెం బ్రహ్మముహూర్తంలో ఉంటుంది.
పొద్దున్నే ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య కూడా పూజ చేయోచ్చు. అయితే ఈ సమయంలో పరమశివుణ్ని లేదా దుర్గాదేవిని పూజించాలట. అప్పుడే మీ పూజలు ఆ దేవుళ్లకు చేరి మీ కోరికలు నెరవేరుతాయని శాస్త్రం ఘోషిస్తుందట.
ఈ సమయంలో చాలా తక్కువ దేవుళ్లను పూజిస్తారు. అందులో ముఖ్యమైన వారు గురు దత్తాత్రేయులు, హనుమాన్. మధ్యాహ్న సమయంలో వీరిద్దరిని పూజిస్తే వెంటనే కరుణిస్తారట. ఈ సమయంలో కూడా ఒక దేవుడినే కాదు.. నవగ్రహాలలో ఒకరైన రాహువు కూడా పూజించాలట. అవును రాహువును ఈ సమయంలో పూజించడం వల్ల శాంతిస్తాడని.. మీకు జీవితంలో ఏం కావాలన్నా ప్రసాదిస్తాడని పండితులు చెప్తున్నారు. అయితే చాలా మందికి ఈ విషయం తెలిసి ఉండదు.
సాయంత్రం సమయంలో మళ్లీ ఆ పరమ శివుడిని పూజించాలట. నెలకు రెండు సార్లు వచ్చే ప్రదోశ సమయం కూడా సాయంత్ర వేళ్లలో వచ్చేదే. ఆ టైంలో శివుడిని పూజిస్తే ఆయన అఖండ సంపదను ప్రసాదిస్తాడని చాలా మంది నమ్ముతారు.
ఈ సమయంలో మాతా లక్ష్మీదేవికి పూజలు చేయడం చాలా ఉత్తమం అట. అమ్మవారు ఈ సమయంలో త్వరగా కరుణిస్తారని చెప్తుంటారు.
పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: సైన్స్ ను సవాలు చేసిన హిందుత్వం – అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు.